LSG vs KKR : లక్నో గెలుపు బాట పట్టేనా ?..కోల్ కతాతో డూ ఆర్ డై
LSG vs KKR : ఐపీఎల్ 19వ సీజన్ లక్నో సూపర్ జెయింట్స్ డూ ఆర్ డై మ్యాచ్ కు రెడీ అయింది. తమ హోంగ్రౌండ్ వేదికగా కోల్ కతా నైట్ రైడర్స్ తో తలపడబోతోంది.
LSG vs KKR
ఐపీఎల్ 19వ సీజన్ లక్నో సూపర్ జెయింట్స్ డూ ఆర్ డై మ్యాచ్ కు రెడీ అయింది. తమ హోంగ్రౌండ్ వేదికగా కోల్ కతా నైట్ రైడర్స్(LSG vs KKR) తో తలపడబోతోంది. వరుసగా నాలుగు పరాజయాలతో ఆ జట్టు తీవ్రఒత్తిడిని ఎదుర్కొంటోంది. 7 మ్యాచ్ లు ఆడి కేవలం 2 విజయాలే సాధించిన లక్నో పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో కొనసాగుతోంది.
లక్నో ఓటములకు కారణం ఆ జట్టు పేలవమైన బ్యాటింగే. అంచనాలు పెట్టుకున్న ఏ ఒక్క బ్యాటర్ కూడా రాణించడం లేదు. గత మ్యాచ్ లో రాజస్థాన్ పై 160 పరుగుల టార్గెట్ ను కూడా ఛేదించలేకపోయింది. ఈ నేపథ్యంలో బ్యాటర్లు ఫామ్ లోకి వస్తే తప్ప లక్నో ఓటములకు బ్రేక్ పడేలా కనిపించడం లేదు. అదే సమయంలో మితిమీరిన ప్రయోగాలు కూడా దెబ్బతీస్తున్నాయి.
బ్యాటింగ్ లో ఓపెనర్లను తరచూ మారుస్తుండడం, మార్క్ క్రమ్ ను మిడిలార్డర్ లో చివరన ఆడించడం, పంత్ టాపార్డర్ లో వస్తున్నా ఘోరంగా విఫలమవుతుండడం వంటివి కారణాలుగా చెబుతున్నారు. అటు బౌలింగ్ లో మహ్మద్ షమీతో పాటు మోసిన్ ఖాన్, ప్రిన్స్ యాదవ్, దిగ్వేశ్ పైనా అంచనాలున్నాయి. వీరు కలిసికట్టుగా రాణించలేకపోతుండడం లక్నోకు మైనస్ గా మారింది.
మరోవైపు కోల్ కతా నైట్ రైడర్స్ (LSG vs KKR)ఎట్టకేలకు గెలుపు రుచి చూసింది.వరుసగా ఐదు మ్యాచ్ లు ఓడిపోయి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న వేళ రాజస్థాన్ రాయల్స్ పై గెలుపొందింది. ఈ మ్యాచ్ లోనూ కీలక బ్యాటర్లు తడబడకుండా రాణిస్తే మాత్రం ప్రత్యర్థిని చిత్తు చేయొచ్చు. కెప్టెన్ రహానే , సిఫర్ట్ పేలవ ఫామ్ లో ఉండగా, రఘువంశీ కూడా నిరాశపరుస్తున్నాడు.

కామెరూన్ గ్రీన్, రోవమన్ పావెల్ అంచనాలు అందుకుంటే తిరుగుండదు. రింకూ సింగ్ ఎట్టకేలకు హాఫ్ సెంచరీతో మ్యాచ్ ను గెలిపించాడు. రింకూ ఇదే జోరు కొనసాగించాలని కేకేఆర్ మేనేజ్ మెంట్ కోరుకుంటోంది. రమణ్ దీప్ సింగ్ నుంచి కూడా కోల్ కతా భారీ ఇన్నింగ్స్ ఆశిస్తోంది.
అటు బౌలింగ్ లో మతీషా పతిరణ రాక కోల్ కతాకు పెద్ద అడ్వాంటేజ్. వైభవ్ ఆరోరా, వరుణ్ చక్రవర్తి , సునీల్ నరైన్ కూడా ఫామ్ అందుకున్నారు. దానిని అదే ఉత్సాహంతో కొనసాగిస్తే మాత్రం రెండో విజయాన్ని ఖాతాలో వేసుకోవచ్చు. మ్యాచ్ కు ఆతిథ్యమిస్తున్న లక్నో పిచ్ బౌలర్లకు అనుకూలంగా ఉంటుందని అంచనా.
Sunrisers Hyderabad : సన్ రైజర్స్ జైత్రయాత్ర..రాజస్థాన్ పై ఘనవిజయం





