Emotional Availability
వైఫ్ అడిగిన జ్యువెలరీ కొనిచ్చేశాం, పిల్లలడిగిన ఖరీదైన గ్యాడ్జెట్లు, టాయ్స్ తెచ్చి చేతిలో పెట్టేశాం.. ఇక మన బాధ్యత పూర్తయిపోయినట్లే అని అనుకుంటారు చాలామంది. కానీ వీటి కంటే కూడా.. పైసా ఖర్చు లేని, ఎన్ని కోట్లు కుమ్మరించినా కొనలేని గిఫ్ట్ కోసం మీ ఇంట్లో వాళ్లు ప్రతిరోజూ ఎదురు చూస్తుంటారన్న విషయాన్ని వారు తెలుసుకోలేరు.
దానినే సైకాలజీ భాషలో ఎమోషనల్ ఎవైలబిలిటీ (Emotional Availability) అంటారు. బంధాల్లో కేవలం డబ్బు, వస్తువులు మాత్రమే కాదు.. సమయం, మనస్సును తాకే టచ్ ఎంత కీలకమో చెబుతున్న ఈ సైకాలజీ కాన్సెప్ట్ నెట్టింట కొద్ది రోజులుగా చర్చనీయాంశంగా మారింది.
ఎమోషనల్ ఎవైలబిలిటీ(Emotional Availability) అంటే అదేమీ పెద్ద కష్టమైన పని కాదు. ఇంట్లో భార్య లేదా పిల్లలు ఏదైనా హెల్త్ ప్రాబ్లెమ్తోనో, మెంటల్ టెన్షన్తోనో బాధపడుతున్నప్పుడు నేను నీ పక్కనే ఉన్నాననే భరోసా ఇవ్వడమే. ఒక రాత్రి వేళ పిల్లలకో, భార్యకో, పేరెంట్స్కో ఒంట్లో బాగోలేనప్పుడు నుదిటిపై చేయి వేసి కాసేపు పక్కన కూర్చుంటే చాలు.
లేదా రోజంతా పనిచేసి అలసిపోయిన భార్య మనసు విప్పి మాట్లాడాలనుకున్నప్పుడు ఎన్ని పనులున్నా ఆమె చెప్పినవి ఓపికగా వింటే చాలు. వారికున్న సమస్యను వెంటనే తీర్చేయమని కాదు.. వారి కష్టంలో, వారి బాధలో వారికి తోడుగా ఉన్నాననే నమ్మకాన్ని ఇవ్వడమే ఈ ఎమోషనల్ సెక్యూరిటీ అసలు ఉద్దేశం.
ఈ ఎమోషనల్ సపోర్ట్ దక్కిన ఇళ్లల్లో తెలియని ఎన్నో అద్భుతాలు జరుగుతాయని మానసిక నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా పిల్లలలో ఇది కొండంత ఆత్మవిశ్వాసాన్ని (Confidence), నింపుతుంది. వారిలో ప్రతికూల పరిస్థితులను తట్టుకునే మనోధైర్యాన్ని (Resilience) పెంచుతుంది.
చిన్నతనంలో తల్లిదండ్రుల నుంచి పూర్తి ఎమోషనల్ సపోర్ట్ పొందిన పిల్లలు పెద్దయ్యాక టెన్షన్స్ను,ప్రాబ్లెమ్స్‌ను చాలా ఈజీగా హ్యాండిల్ చేయడమే కాకుండా, ఇతరులతో హెల్దీ రిలేషన్‌షిప్‌ను మెయిన్‌టెయిన్ చేయగలుగుతారు. ఇక భార్య విషయానికి వస్తే ఎవరు ఎన్ని మాటలు అన్నా, ఎంత పెద్ద కష్టం వచ్చినా కూడా.. భర్త తనకు తోడుగా ఉన్నాడనే ధైర్యం డిప్రెషన్, ఇతర టెన్షన్ల బారిన పడకుండా ఆమెను కాపాడుతుంది.
నిజానికి జీవిత చరమాంకంలో ఎవరైనా సరే తమ పార్ట్నర్ కొనిచ్చిన ఖరీదైన కార్లను, గిఫ్టులను గుర్తుపెట్టుకోరు. తన క్లిష్ట సమయాల్లో పార్ట్నర్ తన పక్కన నిలబడి ఇచ్చిన ప్రేమ, ఓపిక, మానసిక సపోర్ట్‌ను మాత్రమే వారు జీవితాంతం గుర్తుంచుకుంటారు.
Thermal Bill : థర్మల్ బిల్లుతో ఇంత ప్రమాదమా? ఆ ఉద్యోగులు డేంజర్లో ఉన్నారా?
