Hangry : ఆకలేస్తే కోపం వస్తోందా.. ఆకలి కోపానికి బ్రేక్ వేసే సింపుల్ సైకాలజీ ట్రిక్స్..

Hangry : మీరు ఆకలితో ఉన్నప్పుడు పక్కనున్నవారు ఏమైనా అన్నా, లేదా ట్రాఫిక్‌లో ఎవరైనా అడ్డు వచ్చినా మామూలుగా ఉన్నప్పుడు కంటే పదిరెట్లు ఎక్కువ కోపం వస్తుంది.

Hangry

కడుపులో ఆకలి నకనకలాడుతున్నప్పుడు చాలామందిలో ఎక్కడ లేని చిరాకు కనిపిస్తూ ఉంటుంది. చిన్నచిన్న విషయాలకు కూడా విపరీతమైన కోపం వచ్చేస్తూ ఉంటుంది. అయితే అది సాధారణ కోపం కాదని వారు ఆ సమయంలో హ్యాంగ్రీ’ (Hungry + Angry) అంటే ఆకలి ప్లస్ కోపం మోడ్‌లోకి వెళ్లిపోయినట్లే అని సైకాలజిస్టులు చెబుతున్నారు.

ఇది మనలో చాలామందికి ఎదురయ్యే సాధారణ అనుభవమే అయినా..కొందరు ఆ సమయంలో పిచ్చి పిచ్చి నిర్ణయాలు తీసుకుంటారని సైకాలజిస్టులు చెబుతున్నారు. అసలు ఆకలేసినప్పుడు మనిషి మైండ్ ఇంత నెగిటివ్‌గా రియాక్ట్ అవడానికి వెనుక పెద్ద సైంటిఫిక్ రీజన్ ఉందట.

మనం ఆకలితో ఉన్నప్పుడు మనిషి బాడీ చాలా ఎక్కువ స్ట్రెస్‌కు గురవుతుంది. దాంతో నాడీ వ్యవస్థ ఉద్రిక్తతకు లోనై కార్టిసాల్, అడ్రినలిన్ వంటి స్ట్రెస్ హార్మోన్లను చాలా ఎక్కువగా రిలీజ్ చేస్తుంది. సైకాలజీలో దీనిని అఫెక్ట్-యాజ్-ఇన్ఫర్మేషన్ థియరీతో వివరిస్తారు.అంటే మన ఇంటర్నల్ శారీరక అసౌకర్యాన్ని, చుట్టూ ఉన్న పరిస్థితులకు ఆపాదిస్తాం అన్నమాట.

ఉదాహరణకు మీరు ఆకలితో ఉన్నప్పుడు పక్కనున్నవారు ఏమైనా అన్నా, లేదా ట్రాఫిక్‌లో ఎవరైనా అడ్డు వచ్చినా మామూలుగా ఉన్నప్పుడు కంటే పదిరెట్లు ఎక్కువ కోపం వస్తుంది. నిజానికి అప్పుడు బయటకు వచ్చిన కోపం ఆ వ్యక్తి మీద కాదు.. మీ కడుపులో ఉన్న ఆకలి మీద అని సైకాలజీ చెబుతుంది

ఈ ఆకలి కోపానికి బ్రేక్ వేయడం పెద్ద కష్టమేమీ కాదని.. సైకాలజిస్టులు చెబుతున్నారు. డైలీ మనం తినే ఆహారంలో ప్రోటీన్లతో పాటు ఫైబర్ ఎక్కువగా ఉండేలా చూసుకుంటే ఎనర్జీ మెల్లగా రిలీజ్ అయి ఎక్కువ సేపు ఆకలి వేయకుండా ఉంటుంది.

Hangry

ముఖ్యంగా వర్క్ హడావుడిలో ఆకలి పంపే సంకేతాలను నిర్లక్ష్యం చేయకుండా వెంటనే హెల్దీ ఫుడ్ తీసుకోవాలి. లాంగ్ టైమ్ డైటింగ్ చేసేవారు, షుగర్ పేషెంట్లలో ఈ హ్యాంగ్రీ(Hangry) ప్రాబ్లెమ్ మరీ ఎక్కువగా ఉంటుందని .. కాబట్టి వీరు డైట్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని మానసిక నిపుణులు అంటున్నారు.

ఒకవేళ మీరు ఇంపార్టెంట్ వర్క్‌లోనో లేదంటే ట్రాఫిక్‌లోనో చిక్కుకుపోయి వెంటనే తినే అవకాశం లేకపోతే.. మైండ్‌ను వెంటనే డైవర్ట్ చేయాలి. ఆ సమయంలో మంచి మ్యూజిక్ లేదంటే పాడ్‌కాస్ట్ వింటూ మీ మూడ్‌ను ఆహ్లాదకరంగా మార్చుకోవాలి. మీ చిరాకుకు అసలు కారణం మీ ఆకలే అని గుర్తిస్తే చాలు.. మీ సగం కోపం అక్కడే తగ్గిపోతుంది.

Ego In Relationship : బంధంలో ఈగో అడ్డుగోడ వేస్తోందా? స్పందన లేని భాగస్వామితో ముందడుగు వేయొచ్చా?

Exit mobile version