Leaftronics : ఈ-వేస్ట్ సమస్యకు శాశ్వత చెక్ ..చెట్టు ఆకుల్లో దాగున్న ఎలక్ట్రానిక్ సీక్రెట్ ఏంటి?

Leaftronics : సాధారణ సర్క్యూట్ బోర్డుల లాగా గట్టిగా ఉండకుండా... ఈ లీఫ్‌ట్రానిక్స్ బోర్డులు వంచడానికి వీలుగా ఉంటాయి.

Leaftronics

మనం వాడుతున్న మొబైల్స్, ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్ వాచ్‌లు… రోజుకో రకం అప్‌డేటెడ్ వెర్షన్స్‌ మార్కెట్లో రిలీజ్ అవుతున్నాయి . కానీ వాటితో పాటు ఈ-వేస్ట్’ అంటే ఎలక్ట్రానిక్ వ్యర్థాలనే పూడ్చలేని పెద్ద ప్రాబ్లెమ్‌ అవుతోంది. సాధారణంగా ఎలక్ట్రానిక్స్‌లో వాడే ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డులు (PCB) అన్నీ కూడా.. గ్లాస్ ఫైబర్, ప్లాస్టిక్స్‌తో తయారవుతాయి.

ఇవి కొన్ని వందల ఏళ్లయినా సరే భూమిలో కలవవు. ఈ సమస్యాత్మక ఈ-వేస్ట్‌కు చెక్ పెట్టడానికి ప్రకృతి నుంచి స్ఫూర్తి పొందిన శాస్త్రవేత్తలు.. లీఫ్‌ట్రానిక్స్ (Leaftronics)అనే విప్లవాత్మక టెక్నాలజీని కనిపెట్టారు.

లీఫ్‌ట్రానిక్స్ అంటే ఏంటనేది ఈ పేరులోనే ఉంది. లీఫ్ ప్లస్ ఎలక్ట్రానిక్స్ కలిపి లీఫ్‌ట్రానిక్స్‌గా పిలుస్తున్నారు. ఒక చెట్టు ఆకును జాగ్రత్తగా గమనిస్తే దానిలో నీటిని సప్లై చేసే చిన్న చిన్న సిరలు (Veins) కనిపిస్తాయి. సైంటిస్టులు ఈ నేచురల్ సిరల నిర్మాణాన్ని (Lignocellulose Structure) ఒక ఫ్రేమ్‌లా వాడుకుంటున్నారు.

ఆకులోని మృదువైన పార్ట్‌ను తొలగించి, మిగిలిన గట్టి సిరల నిర్మాణానికి బయో-పాలిమర్లను యాడ్ చేసి ఒక బలమైన షీట్‌లా తయారు చేస్తారు. దానిపై ఎలక్ట్రికల్ ట్రాక్‌లను ప్రింట్ చేసి సర్క్యూట్ బోర్డులుగా మారుస్తున్నారు.

సాధారణ సర్క్యూట్ బోర్డుల లాగా గట్టిగా ఉండకుండా… ఈ లీఫ్‌ట్రానిక్స్ బోర్డులు వంచడానికి వీలుగా (Flexible) ఉంటాయి. ఇవి సుమారు 80 శాతానికి పైగా ట్రాన్ఫరెన్సీని కలిగి ఉండి, లైట్ వెయిట్‌గా ఉంటాయి. దీనివల్ల ఫ్యూచర్‌లో మనం ధరించే వేరబుల్ స్మార్ట్ ఇనుస్ట్రుమెంట్స్ అయిన స్మార్ట్ వాచ్‌లు, స్మార్ట్ రింగ్ వంటి వాటితో పాటు ఫ్లెక్సిబుల్ డిస్‌ప్లేలలో వీటిని విరివిగా వాడొచ్చు. అంతేకాదు ల్యాబొరేటరీలో రీఫ్లో సోల్డరింగ్ ద్వారా వీటిపై నిజమైన ఎలక్ట్రానిక్ పార్టులను అమర్చి విజయవంతంగా పని కూడా చేయించారు.

Leaftronics

ఈ కొత్త టెక్నాలజీ వల్ల ఇంకో అతిపెద్ద ప్లస్ పాయింట్ ఏంటంటే… ఇనుస్ట్రుమెంట్ పాడైపోయిన తర్వాత దీన్ని బయోకెమికల్ ప్రాసెస్ ద్వారా ఈజీగా విచ్ఛిన్నం చేయవచ్చు. బోర్డు భూమిలో సులువుగా కలిసిపోతుంది. దానికున్న ఎలక్ట్రానిక్ చిప్స్, పార్ట్స్ తేలికగా ఊడివస్తాయి. కాబట్టి వాటిని మళ్లీ రీసైకిల్ చేసి వాడుకోవచ్చు.

మొత్తంగా అతి త్వరలోనే మన డిజిటల్ వరల్డ్‌ను పర్యావరణహితంగా మార్చడంలో ఈ లీఫ్‌ట్రానిక్స్ టెక్నాలజీ ఒక మైలురాయిగా మారబోతోందనడంలో ఎలాంటి సందేహం లేదని శాస్త్రవేత్తలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Liechtenstein : హైదరాబాద్ కంటే చిన్న దేశం.. కానీ విషయంలో మాత్రం కంట్రీ టాప్..

Exit mobile version