Liechtenstein : హైదరాబాద్ కంటే చిన్న దేశం.. కానీ ఆ విషయంలో మాత్రం ఈ కంట్రీ టాప్..
Liechtenstein : లిక్టెన్‌స్టెయిన్ కంట్రీకి ఒకవైపు స్విట్జర్లాండ్.. మరోవైపు ఆస్ట్రియా దేశాలు బోర్డర్‌గా ఉన్నాయి.
Liechtenstein
వరల్డ్‌లో ఎన్ని పెద్ద పెద్ద దేశాలున్నాయో… అంతే ఆశ్చర్యపరిచే చిన్న దేశాలు కూడా ఉన్నాయి. యూరప్‌లోని ఆల్ప్స్ పర్వతాల మధ్య దాగి ఉన్న లిక్టెన్‌స్టెయిన్ (Liechtenstein) అనే కంట్రీ గురించి తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోతారు. కేవలం 160 చదరపు కి.మీటర్ల వైశాల్యం ఉండే ఈ చిన్న దేశం… విస్తీర్ణంలో అమెరికాలో ఉన్న వాషింగ్టన్ డీసీ కంటే చిన్నదిగా ఉంటుంది. అంతెందుకు హైదరాబాద్ కంటే కూడా చాలా చాలా చిన్న దేశం.
లిక్టెన్‌స్టెయిన్ కంట్రీకి ఒకవైపు స్విట్జర్లాండ్.. మరోవైపు ఆస్ట్రియా దేశాలు బోర్డర్‌గా ఉన్నాయి. చుట్టూ మంచు కొండలు, పచ్చని లోయలతో ఉండే ఈ దేశం నేచర్ లవర్స్‌కు నిజమైన స్వర్గధామం. దేశమంతా కలిపి కేవలం 40 వేల మంది పాపులేషన్ మాత్రమే ఉంటుంది. అయితే జనాభా తక్కువగా ఉందని ఈ దేశాన్ని తేలికగా తీసిపారేయలేం. ప్రపంచంలోనే ఎక్కువ తలసరి రాబడి, హయ్యస్ట్ లివింగ్ స్టాండర్డ్స్ కలిగిన ధనిక దేశాల్లో ఇది ఒకటిగా నిలుస్తోంది.
ఈ దేశానికి రాజధాని వడుజ్’ (Vaduz). ఎత్తయిన కొండపై ఉండే వడుజ్ కోటలో ఇప్పటికీ కూడా లిక్టెన్‌స్టెయిన్ దేశపు రాజకుటుంబం నివసిస్తోంది. ఇక్కడ ఇప్పటికీ రాచరిక వ్యవస్థ ఉనికిలో ఉండటం మరో విశేషం. అంతేకాదు ఇదొక రాజ్యాంగబద్ధ రాచరిక దేశం.
యువరాజు రాజ్యాధిపతిగా ఉన్నా కూడా డెమోక్రటికల్లీ ఎన్నికైన పార్లమెంట్ రూల్ సాగిస్తుంది. ఎంత విచిత్రమంటే… ఈ లిక్టెన్‌స్టెయిన్ దేశానికి సొంతంగా సైన్యం కూడా లేదు. పొరుగునే ఉన్న స్విట్జర్లాండ్‌తో మాత్రం సన్నిహిత సంబంధాలు కలిగి ఉండి ట్రేడ్ , సెక్యూరిటీ విషయాల్లో కలిసి పనిచేస్తుంది.

దేశం చిన్నదైనా కూడా ఇండస్ట్రియల్స్ , బ్యాంకింగ్, గ్లోబల్ వాణిజ్యంలో లిక్టెన్‌స్టెయిన్ చాలా టాప్‌లో ఉంది. ఇక్కడ నిరుద్యోగం అనే మాటే వినిపించదు. వింటర్‌లో స్కీయింగ్, సమ్మర్‌లో ట్రెక్కింగ్ చేయడానికి వరల్డ్ నలుమూలల నుంచి టూరిస్టులు ఇక్కడికి వస్తుంటారు.
మొత్తంగా పెద్ద దేశం అయినంత మాత్రాన గొప్పది అయిపోదు. లివింగ్ స్టాండర్డ్స్ ప్రజల సంతోషంలో ముందుండటమే అసలైన విజయమని నిరూపిస్తోంది ఈ వండర్‌ఫుల్ కంట్రీ.
Shopping Bill : షాపింగ్ బిల్లులు కొన్ని రోజులకే మాయమవుతున్నాయా? మరి గ్యారంటీ, వారంటీ మాటేంటి?





