Micro Habits : జీవితాన్ని మార్చే చిన్న అలవాట్లు.. మైక్రో హ్యాబిట్స్‌తో అదిరిపోయే బెనిఫిట్స్ ..

Micro Habits : రోజూ మనం చేసే చిన్న చిన్న అలవాట్లే ఫ్యూచర్‌లో ఊహించని పెద్ద విజయాలకు పునాది వేస్తాయి. వీటినే సైకాలజీలో మైక్రో హ్యాబిట్స్ అంటారు.

Micro Habits

పెద్ద పెద్ద టార్గెట్‌లను సాధించాలంటే ఒకే రోజులో పెద్ద పెద్ద మార్పులేమీ చేసేయాల్సిన అవసరం లేదు. రోజూ మనం చేసే చిన్న చిన్న అలవాట్లే ఫ్యూచర్‌లో ఊహించని పెద్ద విజయాలకు పునాది వేస్తాయి. వీటినే సైకాలజీలో మైక్రో హ్యాబిట్స్ అంటారు. హెల్దీ లైఫ్‌ స్టైల్‌తో గోల్స్ రీచ్ అవ్వడానికి ఈ చిన్న అలవాట్లే సహాయపడతాయని నిపుణులు చెబుతున్నారు.

ఉదయం నిద్రలేచిన వెంటనే బెడ్ సర్దడం చాలామందికి చాలా చిన్న పనిగా అనిపించొచ్చు. కానీ, నిద్ర లేచిన వెంటనే బెడ్‌ను అలా నీట్‌గా సర్దడం వల్ల రోజు స్టార్టింగ్‌లోనే ఒక పనిని సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేశామనే ఫీల్ మెదడుకు కలుగుతుంది. ఇదే రోజంతా మిగిలిన పనులను కూడా క్రమశిక్షణతో చేయడానికి మంచి బూస్ట్ ఇస్తుంది.

అలాగే ఎక్సర్‌సైజ్‌లు అనగానే గంటల తరబడి చేయాలని అనుకుని ఆగిపోయేవాళ్లు కొంతమంది అయితే, రెండు రోజులు చేసి ఆపేసే వాళ్లు మరికొంతమంది ఉంటారు. ఇలాంటివాళ్లు అసలు దానికి బదులుగా రోజూ కేవలం 10 నిమిషాలు నడవడం అలవాటు చేసుకుని, మెల్లగా సమయాన్ని పెంచుకుంటూ వెళ్లడం బెటర్.

నీళ్లు తాగడం తగ్గించి టీ, కాఫీలు ఎక్కువ తాగేవాళ్లు దానిని కంట్రోల్ చేయడానికి.. టీ, కాఫీ తాగాలనిపించిన ప్రతిసారీ ముందుగా ఒక గ్లాసు నీళ్లు తాగే అలవాటు చేసుకోవాలి. ఇది అనవసర డ్రింక్స్‌ తాగడాన్ని కంట్రోల్ చేసి.. శరీరానికి తగినంత హైడ్రేషన్ ఇస్తుంది.

Micro Habits

ఇక గంటల తరబడి ఒకే చోట కూర్చుని ఆఫీసు పని వెన్నునొప్పి, అలసట ఇబ్బంది పెడుతుంది. అందుకే గంటకోసారి లేచి నిలబడటం లేదంటే చిన్నగా స్ట్రెచింగ్స్ చేయడం వల్ల రక్తప్రసరణ పెరుగుతుంది.

ఇక రాత్రి పడుకునే ముందు మర్నాడు చేయాల్సిన పనులను ఒక బుక్‌లో కానీ పేపర్‌పై రాసుకోవడం వల్ల మెదడుపై ఒత్తిడి తగ్గి ప్రశాంతమైన నిద్ర పడుతుంది. ఈ మైక్రో హ్యాబిట్స్(Micro Habits) పాటించడం చాలా ఈజీనే ఎఫెక్ట్ మాత్రం చాలా పెద్దది.

Lac Bangles : చార్మినార్ చుట్టూ మెరిసే లక్క గాజుల సీక్రెట్..రాయల్ బ్యాంగిల్స్ హిస్టరీ తెలుసా?

Exit mobile version