Just TelanganaJust LifestyleLatest News

Lac Bangles : చార్మినార్ చుట్టూ మెరిసే లక్క గాజుల సీక్రెట్..రాయల్ బ్యాంగిల్స్ హిస్టరీ తెలుసా?

Lac Bangles : లక్క చాలా మెత్తగా ఉంటుంది కాబట్టి, బ్యాంగిల్ చితికిపోకుండా ఉండటానికి లోపల బేస్‌గా ఒక చిన్న అల్యూమినియం కానీ రాగి వైర్ రింగ్‌ను కానీ పెడతారు

Lac Bangles

మహిళలు ఎంత బాగా రెడీ అయినా.. చేతులకు గాజులు వేసుకుంటే వచ్చే అందమే వేరు. అందుకే బ్యాంగిల్స్ లవర్స్ చార్మినార్‌ దగ్గరకు వెళ్తే మాత్రం ..లాడ్ బజార్ గల్లీల్లో కన్నులపండువగా మెరిసే ఆ రంగురంగుల గాజుల కాంతిని చూస్తూ మురిసిపోతుంటారు.

ముఖ్యంగా అక్కడ చేతులకు రాజసాన్ని ఇచ్చే ఆ లక్క గాజులు (Lac Bangles) తీసుకోకుండా అక్కడ నుంచి తిరిగి రారు. అసలు ప్రతి పండగలకు , పెళ్లిళ్లకు, శుభకార్యాలలో యువతుల చేతికి మెరిసిపోయే ఆ గాజులను చూసి అందరూ కేవలం గాజు, ప్లాస్టిక్ లేదా మట్టి బ్యాంగిల్స్ అనుకుంటారు. కానీ ఆ రాయల్ బ్యాంగిల్స్ వెనుక ఒక ఊహించని ప్రకృతి మ్యాజిక్, సైన్స్, తరతరాల చేతివృత్తి విజ్ఞానం దాగున్నాయని చాలామందికి అసలు తెలీదు.

నిజానికి లక్క గాజుల వెనుక ఒక సిస్టమేటిక్ నేచురల్ ఆర్ట్ ఉంది. ల్యాసిఫెర్ లక్కా (Laccifer lacca) అనే చిన్ని కీటకాలు కొన్ని రకాల చెట్ల కొమ్మలపై స్రవించే నేచురల్ రెజిన్ అంటే జిగురు వంటి పదార్థం నుంచి ఈ లక్కను సేకరిస్తారు. అంటే ఇవి ప్రకృతి ప్రసాదించిన ప్యూర్ మెటీరియల్‌తో రూపుదిద్దుకుంటాయి.

ఈ లక్కను వేడి బొగ్గుల పొయ్యిపై కరిగించి, దానికి తగిన స్ట్రెంత్‌ను ఇవ్వడానికి కాల్షియం కార్బోనేట్ లేదా బేరియమ్ సల్ఫేట్ పౌడర్‌ను కలుపుతారు. ఆ తర్వాత కరిగిన లక్కలో ఆకట్టుకునే రాయల్ రంగులు మిక్స్ చేస్తారు.

ఇక్కడే తయారీదారుల నైపుణ్యం బయటపడుతుంది. లక్క చాలా మెత్తగా ఉంటుంది కాబట్టి, బ్యాంగిల్ చితికిపోకుండా ఉండటానికి లోపల బేస్‌గా ఒక చిన్న అల్యూమినియం కానీ రాగి వైర్ రింగ్‌ను కానీ పెడతారు. దాని చుట్టూ వేడి వేడి లక్క ముద్దను రుద్దుతూ సన్నటి కడ్డీలా సాగదీసి మౌల్డ్ చేస్తారు.

ఆ తర్వాత ప్రత్యేకమైన కొయ్య దిమ్మెలపై తిప్పుతూ పర్ఫెక్ట్ బ్యాంగిల్ షేప్‌కు తీసుకుస్తారు. అది ఇంకా వేడిగా, జిగురుగా ఉన్నప్పుడే చేతితో తమ క్రియేటివిటీకి పని చెప్పి రాళ్లు, అద్దాలు, పూసలు, చమ్కీలు ఒత్తుతారు. లక్క చల్లారగానే అది రాయిలా గట్టిపడిపోతుంది కాబట్టి ఆ రాళ్లు ఎప్పటికీ ఊడిపోవు.

Lac Bangles
Lac Bangles

నిజానికి ఈ లక్క గాజుల(Lac Bangles) స్పెషాలిటీ ఏంటో తెలిస్తే అంతా ఆశ్చర్యపోతారు. ఇవి ఎప్పటికీ పగిలిపోవు (Unbreakable). అలాగే నేచురల్ పదార్థాలతో తయారవుతాయి కాబట్టి ఈ గాజులతో ఎలాంటి స్కిన్ అలెర్జీలు రావు.

అలాగే లక్క గాజులను మళ్లీ రీ-సైజ్ (Re-sizeable) కూడా చేసుకోవచ్చు. వాతావరణం మారినా లేదా చేయి కొంచెం లావెక్కి గాజు సరిపోకపోయినా.. జస్ట్ లైట్‌గా వేడి చేస్తే చాలు లక్క కాస్త మెత్తబడి మీ హ్యాండ్ సైజుకు ఈజీగా అడ్జస్ట్ అయిపోతుంది.

అంతేకాదు.. లక్క గాజులను శుభానికి సంకేతం(Auspicious) గా భావిస్తారు. పూర్వం రాజకుటుంబాల నుంచి సామాన్యుల వరకూ లక్క గాజులనే ధరించేవారు.హైదరాబాద్‌లోని చార్మినార్ లాడ్ బజార్‌కు వెళ్లినపుడు మీకు కావాల్సిన సైజులో, మీకు నచ్చిన డిజైన్‌తో వీటిని కస్టమైజ్ చేయించుకుని.. లక్కగాజుల చేతులతో మరింత అందంగా కనిపించండి.

 

View this post on Instagram

 

A post shared by Just Telugu News (@justtelugunews)

AP Model Of Education : సింగపూర్, ఫిన్లాండ్ లెవెల్ లెర్నింగ్..ఈ ట్రైనింగ్‌తో గవర్నమెంట్ స్కూల్స్ రూపురేఖలు మారతాయా?

Related Articles

Back to top button