Partner:మాటిచ్చి ఎందుకు తప్పుతారు? భాగస్వామి కోసం మారడం అంత కష్టంగా ఎందుకు అనిపిస్తుంది?

Partner: తమను తాము మార్చుకుంటామని పెద్ద పెద్ద మాటలు చెప్పడం కంటే, చిన్న చిన్న మార్పుల నుంచి తమను తాము మార్చుకునే ప్రయత్నాన్ని గట్టిగా మొదలుపెట్టాలి.

Partner

ప్రేమ అనేది ప్రతీ ఒక్కరి జీవితంలోనూ ఒక అద్భుతమైన అనుభూతే. అయితే ఆ ప్రేమను ఆచరణలో పెట్టడం,ట ముఖ్యంగా తమ అలవాట్లను మార్చుకోవడం దగ్గరకు వచ్చేసరికి చాలామంది ఫెయిల్ అవుతూ ఉంటారు. నిన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నానని, నీ కోసం ఏదైనా చేస్తానని చెప్పే లైఫ్ పార్టనర్(Partner), తీరా ఒక చిన్న అలవాటును మార్చుకోమంటే మాత్రం చాలా కష్టాలు పడుతుంటారు.

ఎందుకంటే చాలామందిలో ప్రేమ వేరు, ప్రవర్తన వేరు అని సైకాలజీ చెబుతోంది. ఎదుటి వ్యక్తిని మనస్పూర్తిగా ప్రేమించినంత మాత్రాన, వారి మెదడులో దశాబ్దాలుగా పాతుకుపోయిన అలవాట్లు రాత్రికి రాత్రే ఏవీ మారిపోవు. ఈ అలవాట్లు అనేవి మెదడులోని న్యూరల్ పాత్‌వేస్ వంటివి. అంటే ఒక పనిని పదే పదే చేయడం వల్ల అవి అలవాటుగా చాలా బలంగా తయారవుతాయి.

భాగస్వామి(Partner)కి మాటిచ్చినప్పుడు ఆ క్షణంలో ఉన్న వారికున్న ప్రేమ వల్ల..తమను తాము మార్చుకుంటామని నిజాయితీగానే చెబుతారు. కానీ ఆ అలవాటును అమలు చేసే సమయం వచ్చేసరికి మాత్రం మెదడు పాత దారిలోనే నడవడానికి ఇష్టపడుతుంది. దీనినే కాగ్నిటివ్ డిసోనెన్స్ (Cognitive Dissonance) అంటారు. అంటే మన నమ్మకాలు,మన మాటలు ఒకలా ఉంటే, మన పనులు మరొకలా ఉండటం అన్నమాట.

ఇలా చాలా మంది రెండు రకాల మనస్తత్వాలతో ఎందుకు సతమతమవుతుంటారనే దానికి ప్రధాన కారణం వారి అంతర్గత సంఘర్షణ అని సైకాలజిస్టులు అంటారు . ఒకవైపు భాగస్వామిని బాధపెట్టకూడదనే కోరిక, మరొకవైపు తన సొంత సౌకర్యాన్ని లేదా పాత వ్యక్తిత్వాన్ని కోల్పోతానేమోనన్న భయం వారిని తెలీకుండానే వెంటాడుతుంటాయి. దీనిని ఆంబివాలెన్స్ (Ambivalence) అంటారు.

అంటే ఒకే విషయంపై రెండు రకాల డిఫరెంట్ అభిప్రాయాలు ఉండటం అన్నమాట. ఎందుకంటే మార్పు అనేది ఎప్పుడూ అసౌకర్యంగా, ఇబ్బందిగానే ఉంటుంది. మనిషి మెదడు ఎప్పుడూ సులువైన దారినే వెతుక్కుంటుంది కాబట్టి.. మార్పు కోసం మళ్లీ కష్టపడటం కంటే పాత పద్ధతిలోనే ఉండటానికి మొగ్గు చూపుతుంది.

ఎవరైనా ఎదుటివ్యక్తికి తనను తాను మార్చుకుంటానని మాటిచ్చి కూడా మార్చుకోలేకపోవడానికి.. ‘గ్రాటిఫికేషన్’ (తక్షణ తృప్తి) అనే సిద్ధాంతం కూడా వర్తిస్తుందని మానసిక శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

తమ ఇద్దరి మధ్య బంధం నిలబడటమనేది భవిష్యత్తులో జరిగే లాభంగా మనిషి మెదడు భావిస్తుంది. కానీ ఆల్కహాల్ తాగడం, ఫ్రెండ్స్‌తో గడపడం అనేవి ఆ క్షణంలో ఆ మనిషికి వచ్చే తృప్తిగా అనుకుంటుంది. మన మెదడు ఎప్పుడూ భవిష్యత్తులో వచ్చే లాభం కంటే, ఇప్పుడు దొరికే ఆనందానికే ఇంపార్టెన్స్ ఇస్తుంది. దీనివల్లే వారు స్ట్రాంగ్‌గా నిర్ణయం తీసుకోలేరు.

దీనికి తోడు పార్టనర్ (Partner)ప్రేమను వారు ఒక హక్కుగా భావిస్తుంటారు. తను ఎక్కడికి పోదు, కాసేపు మాట్లాడితే, లేదా సర్ది చెప్తే మళ్లీ సర్దుకుంటుందనే అశ్రద్ధ (Complacency), భావన వారిలో మొదలవుతుంది. ఇది తెలీకుండానే వారి మధ్య బంధాన్ని బలహీనపరుస్తుందన్న విషయాన్ని వారు తెలుసుకోలేరు.

అంతేకాదు స్ట్రాంగ్‌గా ఉండలేకపోవడానికి విల్ పవర్ లోపించడం, పరిస్థితుల ప్రభావం కూడా కారణాలే అని చెప్పొచ్చు. నిజానికి సంకల్ప శక్తి (Will Power)అనేది ఒక బ్యాటరీ వంటిది, అది రోజంతా పనిచేసి అలసిపోయినప్పుడు తగ్గిపోతుంది. ఆ సమయంలో పాత అలవాట్లు మళ్లీ తలెత్తుతాయి. అలాగే, కొంతమంది తమ పార్టనర్ పైన ఉన్న ప్రేమను ఒక సేఫ్టీ నెట్‌లా భావిస్తారు. తాను మారకపోయినా తను మాత్రం తనను ఎప్పటికీ ప్రేమిస్తుంది/ ప్రేమిస్తాడు కదా అనే ఒక రకమైన అజాగ్రత్త వారిలో తెలియకుండానే ఏర్పడుతుంది. దీనివల్ల వారు మార్పు కోసం పెద్దగా ప్రయత్నించరు.

Partner

ఈ సమస్యను ఓవర్‌కమ్ చేయాలంటే కేవలం మాటలు సరిపోవు, ప్రణాళికాబద్ధమైన ప్రయత్నం ఉండాలి. తమను తాము మార్చుకుంటానని పెద్ద పెద్ద మాటలు చెప్పడం కంటే, చిన్న చిన్న మార్పుల నుంచి తమను తాము మార్చుకునే ప్రయత్నాన్ని గట్టిగా మొదలుపెట్టాలి. పార్టనర్ కూడా వారిని పదేపదే విమర్శించడం, తన మాట వినలేదని బాధపడటం కంటే, వారిలో చిన్న మార్పును గమనించినప్పుడు ప్రోత్సహించడం వల్ల పార్టనర్‌లో కాన్ఫిడెన్స్ పెరుగుతుంది.

మొత్తంగా ప్రేమ అనేది ఒకరిని ఒకరు మార్చడం అనేదానిపైన కంటే, ఒకరి ఎదుగుదల, క్షేమం కోసం ఒకరు తోడవుతూ సాగే ప్రయాణం అని గుర్తు పెట్టుకోవాలి. ఎపుడైనా సరే , ఎవరైనా సరే మారాలి అనుకున్నప్పుడు మార్పు అనేది స్వతాహాగా వారి లోపలి నుంచి రావాలే తప్ప, ఎదుటివారి ఒత్తిడి వల్ల వచ్చే ఎలాంటి మార్పు అయినా ఎక్కువ కాలం నిలవదన్న సంగతి అంగీకరించాలి.

Lalita Parayanam:లలితా పారాయణం చేసేవారు తప్పకుండా వెళ్లాల్సిన దివ్యక్షేత్రం..ఎక్కడో తెలుసా?

Exit mobile version