Women Midlife Crisis
కొంతమంది మహిళలు 45- 50 ఏళ్ల వయసు దాటిన తర్వాత తమ బిహేవియర్, డ్రెస్సింగ్, అలాగే ఇతరులతో మెలిగే తీరులో ఊహించని మార్పులు చూపిస్తుంటారు. అంతవరకు ఎంతో రిజర్వ్డ్గా ఉన్నవారు కూడా ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించాలని (Attention Seeking) చూడటం, ఏజ్‌కు లేదా బాడీ షేప్‌కి సూట్ అవని డ్రెస్సులు వేసుకోవడం, హెవీ మేకప్‌తో అందరిలో స్పెషల్‌గా కనిపించాలని ప్రయత్నించడం గమనిస్తుంటాం. బయటి ప్రపంచానికి ఇది ఓవర్ యాక్షన్‌లాగా లేదా విమర్శలకు తావిచ్చే విషయంగా అనిపించినా.. దీని వెనుక లోతైన సైకలాజికల్, హార్మోనల్ కారణాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.
దీనికి మెయిర్ రీజన్ మిడ్ లైఫ్ క్రైసిస్ (Midlife Crisis) అలాగే ఎమ్టీ నెస్ట్ సిండ్రోమ్ (Empty Nest Syndrome) అని సైకాలజిస్టులు చెబుతున్నారు. సాధారణంగా 45-50 ఏళ్ల సమయానికి పిల్లల చదువులతో పాటు కొందరి పిల్లలకు పెళ్లిళ్లు కూడా పూర్తయి వాళ్లు దూరంగా వెళ్లిపోతుంటారు.
దీనికి తోడు భర్త, పిల్లలు వారి వారి పనుల్లో బిజీగా ఉండటంతో ఇన్నాళ్లూ ఫ్యామిలీ చుట్టూ తిరిగిన మహిళలు ఒక్కసారిగా ఒంటరితనానికి గురవుతారు. తమ ఉనికిని, ఇంపార్టెన్స్‌ను కోల్పోతున్నామనే భయం వారిలో మొదలవుతుంది. ఈ ఒంటరితనాన్ని భర్తీ చేసుకోవడానికి అలాగే తమను అందరూ గుర్తించాలనే ఉద్దేశంతోనే ఇతరులతో ఎక్కువగా కలవడం, అటెన్షన్ గ్రాబ్ చేయడానికి ప్రయత్నించడం వంటివి చేస్తారు.
రెండోది లాస్ట్ యూత్ (Lost Youth) ఫీలింగ్ అండ్ హార్మోనల్ ఛేంజెస్ కూడా ఈ ఏజ్‌లో వీరికి ఎక్కువగా ఉంటాయని సైకాలజిస్టులు చెబుతున్నారు. ఈ వయసులో మెనోపాజ్ (Menopause) స్టేజ్ దగ్గర పడుతుండటంతో బాడీలో ఈస్ట్రోజెన్ హార్మోన్ లెవెల్స్ తగ్గి మానసిక ఆందోళన పెరుగుతుంది.
నా అందం, నా యవ్వనం అయిపోతోందనే ఇన్ సెక్యూరిటీ (Insecurity) ఫీలింగ్ వారిని వెంటాడుతుంది. అందుకే తమకు తాము ఇంకా యంగ్‌గానే ఉన్నామని ప్రూవ్ చేసుకోడానికి, అలాగే కోల్పోయిన యవ్వనాన్ని మళ్లీ అనుభవించాలనే తపనతో ట్రెండీ డ్రెస్సింగ్, బ్రైట్ మేకప్‌ల వైపు ఇంట్రస్ట్ చూపిస్తుంటారు. అయితే సరైన ఫ్యాషన్ సెన్స్ , మంచి సజెషన్స్ లేకపోవడం వల్ల అది అట్రాక్టివ్‌గా మారే బదులు ఓవర్‌గా కనిపిస్తుంది.
సప్రెస్డ్ డిజైర్స్ (Suppressed Desires)ఈ ఏజ్‌లో బయటకు రావడం కూడా దీనికి కారణమే. పాతికేళ్ల వయసు నుంచి బాధ్యతలు, సంప్రదాయాలు, సొసైటీ ఏమనుకుంటుందో అనే భయంతో తమ ఇష్టాలను అణచివేసుకున్న కొంతమంది మహిళలు.. 50 ఇయర్స్ రాగానే ..నా జీవితం నా ఇష్టం, ఇన్నాళ్లూ అందరి కోసం బతికాను, ఇకపై నాకోసం బతుకుతాననే స్వేచ్ఛా భావనకు వస్తారు. పక్క వాళ్ల జడ్జిమెంట్లను కేర్ చేయడం మానేస్తుంటారు.
కాకపోతే సొసైటీ ఇంకా మహిళలను ఏజ్ లిమిట్ చట్రంలోనే చూస్తుంది కాబట్టి, వారి ఈ ప్రయత్నం ఒక్కోసారి నెగిటివ్ కామెంట్లకు దారి తీస్తుంది. ఇది కేవలం తమ వయసును, ఒంటరితనాన్ని జయించడానికి వారికి వారు చేసుకునే ఒక మానసిక పోరాటమని అర్థం చేసుకోవాల్సి ఉంటుందని మానసిక నిపుణులు వివరిస్తున్నారు.
