Anirudh – Kavya Maran Wedding Invitation
టాలీవుడ్, కోలీవుడ్, స్పోర్ట్స్ సర్కిల్స్‌లో ఇప్పుడు హాటెస్ట్ టాపిక్ ఏదైనా ఉందంటే అది రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ సీఈఓ కావ్య మారన్(Anirudh – Kavya Maran Wedding Invitation) పెళ్లి ముచ్చటే అవుతుంది. తాజాగా ఈ హై-ప్రొఫైల్ కపుల్ వెడ్డింగ్ రిసెప్షన్ ఇన్విటేషన్ కార్డ్‌కు సంబంధించిన పిక్స్, వీడియోలు నెట్టింట విపరీతంగా చక్కర్లు కొడుతూ తెగ ట్రెండ్ అవుతున్నాయి. ఐవరీ కలర్, లైట్ బ్లూ షేడ్స్ కాంబినేషన్‌లో బరోక్ స్టైల్‌లో డిజైన్ చేసిన ఈ ఆహ్వాన పత్రికను చూడటానికి చాలా రాయల్‌గా, ఆర్టిస్టిక్‌గా ఉంటూ అందరి దృష్టిని తెగ అట్రాక్ట్ చేస్తోంది.
ఈ ఇన్విటేషన్ కార్డ్(Anirudh – Kavya Maran Wedding Invitation)ను ఓ బ్యూటిఫుల్ ప్రీమియం బాక్స్‌లో ప్యాక్ చేయగా, దానిపై లైట్ బ్లూ కలర్ డిజైన్లు, గోల్డెన్ కలర్ ఎంబెల్లిమెంట్స్ వావ్ అనిపించేలా ఉన్నాయి. వాటిపై చేసిన ఎంబోస్డ్ వర్క్, వింటేజ్ వైబ్స్‌తో ఉన్న క్లాసిక్ ముద్రలు ఈ డిజైన్‌కు నెక్స్ట్ లెవెల్ లుక్‌ను తెచ్చిపెట్టాయి. ఈ వండర్‌ఫుల్ ఇన్విటేషన్ కార్డును డిజైన్ చేసిన ‘పింక్ విసిల్ మ్యాన్’ సంస్థకు చెందిన రంజని అయ్యంగార్ సోషల్ మీడియా వేదికగా ..ఈ ప్రాజెక్ట్‌లో భాగం కావడం పట్ల తన ఆనందాన్ని పంచుకున్నారు.
నవంబర్ 10, 11 తేదీల్లో గ్రీస్ దేశంలోని ఓ క్రేజీ లొకేషన్‌లో ఈ డెస్టినేషన్ వెడ్డింగ్ జరగబోతున్నట్లు తెలుస్తోంది. ఎలాంటి హడావుడి లేకుండా అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలోనే ఈ పెళ్లిని చాలా ప్రైవేట్‌గా ప్లాన్ చేసినట్లు సమాచారం. అయితే పెళ్లి తేదీలు, లొకేషన్‌పై ఇప్పటివరకు ఎలాంటి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రాలేదు.
కాగా వెడ్డింగ్ రిసెప్షన్ డేట్ కూడా ఫిక్స్ అయిపోయింది. నవంబర్ 21వ తేదీన చెన్నై వేదికగా ఈ మెగా రిసెప్షన్ జరగబోతోంది. మరోవైపు అనిరుధ్, కావ్య పాప క్రేజీ జోడీ పెళ్లికి సంబంధించిన అప్డేట్స్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Unstoppable With NBK Season 5 : ఆహా ప్లాన్ అదిరింది.. అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకేలో మెగాస్టార్?
