Annamalai
తమిళనాడు రాజకీయాల్లో కొద్ది రోజులుగా నలుగుతున్న అన్నామలై పొలిటికల్ టర్న్‌లో మరో స్టెప్ పడినట్లు అయింది. మాజీ ఐపీఎస్ అధికారి, తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు కె. అన్నామలై(Annamalai) భారతీయ జనతా పార్టీకి అధికారికంగా రాజీనామా చేసి, ఒక సరికొత్త ప్రాంతీయ పార్టీని స్థాపించబోతున్నట్లు ప్రకటించారు.
తమిళనాడు రాష్ట్రంలో ఒక కొత్త రాజకీయ ఉద్యమానికి శ్రీకారం చుడుతున్నానని చెప్పిన అన్నామలై(Annamalai) .. రాబోయే ఎన్నికలలో తమ నూతన పార్టీ కచ్చితంగా పోటీ చేస్తుందని అన్నారు. ఒక భారతీయుడిగా, తమిళుడిగా తాను ఎంతో గర్విస్తున్నానని పేర్కొన్న ఆయన, తమిళనాడు సమగ్రాభివృద్ధే తన ప్రథమ ప్రాధాన్యమని, ఏకైక లక్ష్యమని తేల్చి చెప్పారు.
అన్నామలై(Annamalai) తీసుకున్న నిర్ణయం.. తమిళనాడు రాజకీయ వర్గాల్లో ఒక్కసారిగా పెను మార్పులకు కారణమైంది. క్షేత్రస్థాయిలో ప్రజలతో కనెక్ట్ అయ్యే బలమైన నేత, అలాగే మంచి వాయిస్ ఉన్న అన్నామలై వంటి ఫైర్‌బ్రాండ్ లీడర్‌ను కోల్పోవడం బీజేపీకి పెద్ద షాక్ అనే చెప్పాలి.
అన్నామలై పదునైన ప్రసంగాలు, సోషల్ మీడియా ప్రెజెన్స్, యూత్‌ను ఆకర్షించే శైలి తమిళనాడులో పార్టీని బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించాయి. ఇప్పుడు అలాంటి నాయకుడు వెళ్లిపోవడంతో ఏర్పడిన ఖాళీని వెంటనే పూడ్చడం ఆ పార్టీకి సులభం కాదు.
అయితే ఈ రాజీనామా వెనుక కేవలం ఒకే కారణం లేదన్న వార్తలు వినిపిస్తున్నాయి. పార్టీ కేంద్ర నాయకత్వంతో పొత్తుల వ్యవహారాలు, మెయిన్‌గా అన్నాడీఎంకేతో అలయన్స్ వంటి విషయాలపై అన్నామలై కొంత వరకూ అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. తమిళనాడు రాజకీయాల్లో తనకున్న స్పేస్‌పై పరిమితులు, స్వతంత్ర నిర్ణయాధికారం , వ్యక్తిగత గౌరవం వంటి అంశాల వల్లే అన్నామలై ఈ కొత్త మార్గాన్ని ఎంచుకున్నట్లు కనిపిస్తోంది.
హైకమాండ్ అన్నామలైను పార్టీలో నిలుపుకోవడానికి ప్రయత్నించినా, అవి తాత్కాలిక బుజ్జగింపులుగానే మిగిలిపోయాయి తప్ప ఆయన నిర్ణయాన్ని ఏ మాత్రం మార్చలేకపోయాయి.
ప్రస్తుతానికి ఈ కొత్త పార్టీ పేరును అధికారికంగా ప్రకటించనా పోయినా. “మక్కల్ శక్తి ఇయక్కం” అనే పేరు గట్టిగా వినిపిస్తోంది. దీనిని ఒక సరికొత్త ద్రవిడియన్ 2.0 విజన్‌తో, ఒక సెక్యులర్ ప్రాంతీయ శక్తిగా తీర్చిదిద్దే ప్లాన్‌లో అన్నామలై ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
అయితే ఇప్పుడున్న పరిస్థితులలో అన్నామలై కొత్త పార్టీని నడపడం అంత సులభం కాదు. దీనికి క్షేత్రస్థాయి కేడర్, ఆర్గనైజేషన్, నిధులు వంటి చాలా సవాళ్లు ఎదురవుతాయి. అంతేకాకుండా ఈ కొత్త పార్టీ వల్ల ఓట్లు చీలితే అది ముఖ్యంగా డీఎంకే, అన్నాడీఎంకే, బీజేపీలోనే ఎక్కువ ప్రభావితం చేస్తుంది.
ఏది ఏమైనా తమిళనాడు రాజకీయాలు ఎప్పుడూ ప్రాంతీయ భావోద్వేగాల చుట్టూ తిరుగుతాయి. ఇలాంటి సమయంలో మార్పు కోరుకునే ఓటర్లను, యూత్‌ను అన్నామలై ఎంతవరకు ఆకట్టుకుంటారనేదే ఇక్కడ అసలైన పరీక్ష. బీజేపీకి ఇది పెద్ద నష్టమే అయినా కూడా, అన్నామలై కెరీర్‌కు ఇదొక పెద్ద రిస్క్‌తో కూడిన సరికొత్త కథకు ప్రారంభం అవుతుంది. రాబోయే రోజుల్లో అన్నామలై అధికారిక ప్రకటనతో తమిళనాడు పొలిటికల్ పిక్చర్‌పై మరింత క్లారిటీ రానుంది.
Ram Charan : రామ్ చరణ్ బాక్సాఫీస్ ర్యాంపేజ్.. తొలి రోజే వంద కోట్ల క్లబ్‌లో పెద్ది ఊచకోత
