Polygamy : 2 పెళ్లిళ్లు చేసుకుంటే గవర్నమెంట్ స్కీమ్స్ బంద్.. బహుభార్యత్వాన్ని పాటిస్తే ఉద్యోగం కూడా ఊస్ట్

Polygamy : ఇప్పటికే ఉత్తరాఖండ్ వంటి రాష్ట్రాలు యూనిఫామ్ సివిల్ కోడ్ (UCC) బిల్లును పాస్ చేసి ఇలాంటి పర్సనల్ చట్టాలన్నింటికీ ఒకే రూల్ తెచ్చే పనిలో ఉన్నాయి.

Polygamy

ఒక వైపు దేశమంతా ఒకే దేశం-ఒకే చట్టం అనే చర్చ నడుస్తుంటే.. అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ మాత్రం అస్సలు ఊహించని రేంజ్‌లో స్పీడ్ పెంచేశారు. అక్కడ ఎప్పటి నుంచో ఉన్న బహుభార్యత్వం (పాలీగామి)(Polygamy) ఆచారానికి చెక్ పెట్టడానికి తీసుకున్న సంచలన నిర్ణయం ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారిపోయింది.

దీని ప్రకారం రాష్ట్రంలో ఒకరి కంటే ఎక్కువ మంది భార్యలు ఉన్నవారికి ఇకపై ఎలాంటి ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తించవని బడ్జెట్ సాక్షిగా అస్సాం సీఎం తేల్చి చెప్పేశారు. అంతేకాదు, గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ బహుభార్యత్వాన్ని ఫాలో అయ్యే వారిని జాబ్ నుంచి కూడా తీసేస్తామని హెచ్చరించారు.

తాజాగా అస్సాం ఫైనాన్స్ మినిస్టర్ జయంత మల్లా బారువా ప్రవేశపెట్టిన 2026-27 స్టేట్ బడ్జెట్‌లోనే ఈ ఇంట్రెస్టింగ్ రూల్స్‌ను తీసుకొచ్చారు. ఆల్రెడీ 2025 నవంబర్‌లోనే అస్సాం అసెంబ్లీలో బహుభార్యత్వ(Polygamy) నిషేధ బిల్లును పాస్ చేసి.. ఏడేళ్ల జైలు శిక్ష కండీషన్‌ను కూడా తెచ్చిన సీఎం హిమంత బిశ్వ శర్మ.. ఇప్పుడు ఫైనాన్షియల్ గా, సర్వీస్ పరంగా మరిన్ని కఠిన ఆంక్షలను విధించి ఈ ఆచారానికి కంప్లీట్‌గా ఎండ్ కార్డ్ వేయడానికి డిసైడ్ అయ్యారు.

అసలు అస్సాం ప్రభుత్వం ఇంత పెద్ద నిర్ణయాన్ని ఎందుకు తీసుకుందనేదానికి కొన్ని బలమైన కారణాలు ఉన్నాయని విశ్లేషకులు అంటున్నారు. ముఖ్యంగా ముస్లిం కమ్యూనిటీ అలాగే కొన్ని ఇతర వర్గాల్లో కూడా ఇంకా కొనసాగుతున్న బహుభార్యత్వం వల్ల మహిళల హక్కులు దారుణంగా దెబ్బతింటున్నాయి. దీనికి తోడు ఒక వ్యక్తికి ఎక్కువ మంది భార్యలు ఉండటం వల్ల కుటుంబాలలో ఎకనామిక్ ప్రాబ్లమ్స్ పెరిగి, పిల్లల చదువు, ఆరోగ్యం అశ్రద్ధకు గురవుతున్నాయి.

ఈ వ్యవస్థను మార్చి, సొసైటీలో జెండర్ ఈక్వాలిటీ తీసుకురావడమే ఈ నిర్ణయం వెనుక ఉన్న మెయిన్ రీజన్. దీనివల్ల మహిళలకు కుటుంబంలో రక్షణ, గౌరవం దక్కుతుంది. అలాగే ప్రభుత్వ పథకాలు నిజమైన లబ్ధిదారులకు అందుతాయనేది అక్కడి ప్రభుత్వం ఆలోచన. అయితే దేశవ్యాప్తంగా బీజేపీ రూలింగ్‌లో ఉన్న చాలా రాష్ట్రాలు ఇప్పుడు అస్సాం తీసుకునే నిర్ణయాలను నిశితంగా గమనిస్తున్నాయి.

Polygamy

ఇప్పటికే ఉత్తరాఖండ్ వంటి రాష్ట్రాలు యూనిఫామ్ సివిల్ కోడ్ (UCC) బిల్లును పాస్ చేసి ఇలాంటి పర్సనల్ చట్టాలన్నింటికీ ఒకే రూల్ తెచ్చే పనిలో ఉన్నాయి. ఈ రూల్స్ గనుక అస్సాంలో సక్సెస్ అయితే, ఫ్యూచర్‌లో గుజరాత్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాలు కూడా తమ దగ్గర ఇలాంటి కఠినమైన చట్టాలను తెచ్చే ఛాన్స్ ఉంది.

కేవలం చట్టాలను చేయడమే కాదు.. సంక్షేమ పథకాలు, ఉద్యోగాలను కూడా లింక్ చేయడం వల్ల అస్సాంలోని పబ్లిక్‌కు భయం పెరిగి ఈ ఆచారం చాలా వరకు తగ్గుముఖం పడుతుందని అనలిస్ట్‌లు భావిస్తున్నారు.

Sheikh Hasina : డిసెంబరులో బంగ్లాదేశ్ వెళ్లి లొంగిపోతా..చావడానికైనా రెడీ అంటున్న షేక్ హసీనా

Exit mobile version