TVK Chief C.Joseph Vijay : విజయ్ విజిల్ హోరుతో వాడిపోయిన డీఎంకే, ఏఐఏడీఎంకే.. ఉపఎన్నికల్లో ఊరట లభించినా వీడని మైనారిటీ గండం ..

TVK Chief C.Joseph Vijay : కోర్టు కేసుల వల్ల మరో 5 స్థానాలు ఖాళీగా ఉన్నా కూడా, రాబోయే రోజుల్లో ఆ ఐదింటిని టీవీకే గెలుచుకున్నా కూడా సీట్ల సంఖ్య 114 దాటదు.

TVK Chief C.Joseph Vijay

సినీ గ్లామర్‌తోనే రాజకీయ అరంగేట్రం చేసినా కూడా ..కొద్ది కాలంలోనే ఏకంగా సీఎం పీఠాన్ని దక్కించుకున్న తమిళ వెట్రి కళగం (టీవీకే) అధినేత సి. జోసెఫ్ విజయ్(TVK Chief C.Joseph Vijay) సర్కార్‌కు రీసెంట్‌గా జరిగిన అసెంబ్లీ ఉపఎన్నికలు భారీ ఊరటను ఇచ్చాయి. హోరాహోరీగా సాగిన ధారాపురం, మధురాంతకం అసెంబ్లీ నియోజకవర్గాల బై పోల్ ఎలక్షన్‌లో టీవీకే అభ్యర్థులు తిరుగులేని విజయాన్ని నమోదు చేసి తమ జెండాను ఎగిరించారు.

ఈ విక్టరీతో 234 స్థానాలున్న తమిళనాడు శాసనసభలో టీవీకే సంఖ్యాబలం 107 నుంచి 109కి చేరుకుంది. అయినా కూడా ప్రభుత్వం ఎలాంటి ఇబ్బంది లేకుండా నిలబడటానికి కావలసిన మ్యాజిక్ ఫిగర్ 118కి మాత్రం ఇంకా తొమ్మిది సీట్ల దూరంలోనే నిలబడిపోయింది. దీంతో విజయ్ గవర్నమెంట్ మనుగడకు ప్రధాన మిత్రపక్షమైన కాంగ్రెస్ పార్టీ సపోర్ట్‌ మాత్రం ఇప్పటికీ చాలా కీలకంగా మారింది.

గతంలో ఏఐఏడీఎంకే గుర్తుపై గెలిచిన ఎమ్మెల్యేలు.. మరగతం కుమారవేల్ (మధురాంతకం), పి. సత్యభామ (ధారాపురం) తమ పదవులకు రిజైన్ చేసి టీవీకే తీర్థం పుచ్చుకోవడంతో ఈ ఎన్నికలు జరిగాయి. తాజాగా జరిగిన ఎన్నికల్లో వీరిద్దరూ టీవీకే గుర్తు విజిల్‌తో బరిలోకి దిగి మళ్లీ విజయాన్ని ముద్దాడారు.

మధురాంతకం నియోజకవర్గంలో మరగతం కుమారవేల్ అక్కడి డీఎంకే ప్రత్యర్థిపై ఏకంగా 20వేల40 ఓట్ల భారీ మెజారిటీ సాధించగా, ధారాపురంలో సత్యభామ 9వేల471 ఓట్ల ఆధిక్యంతో విజయకేతనాన్ని ఎగరవేశారు. ఇక ఈ రెండు స్థానాల్లోనూ మెయిన్ ప్రతిపక్షంగా భావించిన ఏఐఏడీఎంకే థర్డ్ ప్లేస్‌కే పరిమితమై దారుణ పరాజయాన్ని మూటగట్టుకోవడం విశ్లేషకులను సైతం ఆశ్చర్యపరిచింది.

2026 ఏప్రిల్‌ నెలలో జరిగిన అసెంబ్లీ సాధారణ ఎన్నికల్లో 108 స్థానాలను సాధించి టీవీకే అతిపెద్ద పార్టీగా వెలిగిన విషయం తెలిసిందే. కానీ సీఎం విజయ్ పోటీ చేసిన రెండు చోట్లా కూడా గెలవడంతో, ఒక స్థానానికి రిజైన్ చేయాల్సి రావడంతో పార్టీ బలం 107కి పడిపోయింది. ప్రస్తుతం కాంగ్రెస్‌కు చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలతో పాటు వీసీకే, ఐయూఎంఎల్ ,వామపక్షాల బయటి మద్దతుతో విజయ్ మైనారిటీ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు.

కోర్టు కేసుల వల్ల మరో 5 స్థానాలు ఖాళీగా ఉన్నా కూడా, రాబోయే రోజుల్లో ఆ ఐదింటిని టీవీకే గెలుచుకున్నా కూడా సీట్ల సంఖ్య 114 దాటదు. అందుకే విజయ్ తన ప్రభుత్వాన్ని కాపాడుకోవాలంటే మిత్రపక్షాలను,మరీ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీని మచ్చిక చేసుకోవడం తప్పనిసరిగా మారింది.

TVK Chief C.Joseph Vijay

మరోవైపు ఈ ఫలితాలపై పొలిటికల్ వర్గాల్లో తీవ్రస్థాయిలో వాగ్వాదం నడుస్తోంది. ఈ విజయం ముఖ్యమంత్రి విజయ్ నాలుగు నెలల పాలనకు ప్రజలు ఇచ్చిన తిరుగులేని తీర్పు అని కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు మాణికం ఠాగోర్ చెప్పగా.. ఇది కేవలం ద్రోహ రాజకీయాలతో సాధించిన టెంపరరీ విజయమని డీఎంకే అధినేత ఎం.కే. స్టాలిన్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

అటు ఏఐఏడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి కె. పళనిస్వామి కూడా ఈ విజయం అధికార దుర్వినియోగం, విచ్చలవిడి డబ్బు పంపిణీ వల్ల మాత్రమే వచ్చిందేనని, మైనారిటీ సర్కార్‌ను మెజారిటీగా మార్చుకోవడానికే ఈ ఉపఎన్నికలను కొని తెచ్చుకున్నారని విమర్శించారు. అయితే ఈ విమర్శలన్నిటిని తిప్పికొట్టిన ముఖ్యమంత్రి విజయ్(TVK Chief C.Joseph Vijay).. ఇది ధనబలానికి , తనపై చేసిన వ్యక్తిగత విమర్శలకు గుణపాఠంగా ప్రజలు ఇచ్చిన స్వచ్ఛమైన తీర్పు అని కౌంటర్ ఇచ్చారు.

Red Flags In A Relationship : ఒకే రాత్రిలో బంధాలు తెగిపోవు..పచ్చని కాపురాన్ని కూల్చేసే 10 సైలెంట్ రెడ్ ఫ్లాగ్స్..

↑
Exit mobile version