Mahalaya Amavasya : శనివారం,మహాలయ అమావాస్య అరుదైన కలయిక..వేంకటేశ్వర స్వామిని ఇలా కొలిస్తే అదృష్టమే..

Mahalaya Amavasya : శనివారం రోజు శనిదేవుడిని శాంతింపజేయడానికి పూజలు చేస్తుంటారు. కానీ ఈ అరుదైన రోజు శ్రీ వేంకటేశ్వర స్వామిని భక్తిశ్రద్ధలతో కొలిస్తే భక్తులకు ఊహించని శుభ ఫలితాలు కలుగుతాయని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి.

Mahalaya Amavasya

ఈ ఏడాది అక్టోబర్ 10వ తారీఖు శనివారం అమావాస్య రావడం సాధారణమైన విషయమేమీ కాదని జ్యోతిష్యులు చెబుతున్నారు. పితృ దేవతల ఆరాధన చేసే విశిష్టమైన మహాలయ అమావాస్య(Mahalaya Amavasya)తో పాటు శనివారం కూడా కలిసి రావడం వల్ల దీనిని మహా శక్తివంతమైన శని అమావాస్యగా పిలుస్తారు. మామూలు రోజుల్లో శనివారం రోజు శనిదేవుడిని శాంతింపజేయడానికి పూజలు చేస్తుంటారు. కానీ ఈ అరుదైన రోజు శ్రీ వేంకటేశ్వర స్వామిని భక్తిశ్రద్ధలతో కొలిస్తే భక్తులకు ఊహించని శుభ ఫలితాలు కలుగుతాయని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి.

జ్యోతిష్య శాస్త్ర లెక్కల ప్రకారం వేంకటేశ్వర స్వామి జన్మ నక్షత్రం శ్రవణం.. రాశి మకర రాశి. ఈ మకర రాశికి అధిపతి సాక్షాత్తు శని భగవానుడే కావడంతో శ్రీవారికి శనివారం అలాగే శని అమావాస్య రోజు పూజ చేయడం అత్యంత శక్తివంతమైన ఫలితాలను ఇస్తుంది.

ముఖ్యంగా ఏలినాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శని ప్రభావంతో ఎన్నో ఏళ్లుగా సతమతమయ్యేవాళ్లకు ఈ పూజ ఒక దివ్యౌషధంలా పనిచేస్తుంది. ఇవే కాకుండా కుజ దోషం, పితృ శాపాలు అలాగే తీరని ఆర్థిక సమస్యలు, కోర్టు గొడవలు, శత్రు భయాలు, వ్యాపారంలో నష్టాలు అంతేకాకుండా కుటుంబంలో నిత్యం అశాంతితో ఇబ్బంది పడేవారు ఈ పవిత్రమైన రోజు పూజా కార్యక్రమాలను నిర్వహిస్తే మంచి ఫలితం ఉంటుంది.

ఈ శక్తివంతమైన పూజను ఆచరించడానికి అక్టోబర్ 10వ తేదీ శనివారం అద్భుతమైన అవకాశమని పండితులు చెబుతున్నారు. ఈరోజు తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్తం సమయంలో అంటే ఉదయం 4 – 6 గంటల మధ్యలో లేదంటే సాయంత్రం సూర్యాస్తమయం ముగిసిన తర్వాత 12 గంటల లోపు పూజను ముగించాలి.

ఈ పూజ చేసేవారు ముందుగా ఇంటిని మొత్తం శుభ్రం చేసుకుని, తలస్నానం ఆచరించి, ఆ పూటంతా ఉపవాసంతో ఉండాలి. రోజంతా ఎవరి మీద కోపం చూపించకుండా, ఎవరితోనూ గొడవలు పడకుండా, చాలా ప్రశాంతంగా, ప్రేమగా మాట్లాడాలి. పూజా గదిని శుభ్రంగా అలంకరించి శ్రీ శ్రీనివాసుడి ఫోటోను గంధం, పూలు, పవిత్రమైన తులసి ఆకులతో అందంగా అలంకరించాలి. పూజలో ఆవు నెయ్యితోనే దీపం వెలిగించాలి.

Mahalaya Amavasya

ముందుగా భక్తిభావంతో శ్రీ వేంకటేశ్వర స్వామిని మనసారా తలచుకుని.. మంత్రం నేర్చుకున్నవారు శ్రీనివాస బీజాక్షరాలను 108 సార్లు జపించాలి. డబ్బు పరమైన ఇబ్బందులన్నీ తొలగిపోవాలని కోరుకుంటూ అష్టోత్తర శతనామావళిని బయటకు వినిపించేలా పఠించాలి. ఆ తర్వాత టెంకాయ కొట్టి, ఆవుపాలతో చేసిన కమ్మని పాయసాన్ని స్వామివారికి నైవేద్యంగా పెట్టాలి.

చివరగా కర్పూర హారతి ఇచ్చి.. పూజలో ఏవైనా పొరపాట్లు జరిగితే క్షమించమని వెంకన్నను వేడుకుంటూ పూజ ముగించాలి. ఒకవేళ మంత్రాలు రాకపోతే మాత్రం.. ఓం నమో వేంకటేశాయ అనే నామాన్ని 108 సార్లు తలుచుకుంటే సరిపోతుంది. ఈ విధంగా ఈ శని అమావాస్య(Mahalaya Amavasya) రోజు శ్రీవారిని కొలిస్తే అన్ని గ్రహ దోషాలన్నీ తొలిగిపోయి ఇంట్లో సిరిసంపదలు వెల్లివిరుస్తాయి.

Red Flags In A Relationship : ఒకే రాత్రిలో బంధాలు తెగిపోవు..పచ్చని కాపురాన్ని కూల్చేసే 10 సైలెంట్ రెడ్ ఫ్లాగ్స్..

↑
Exit mobile version