Central Cabinet : 20 మంది ఔట్ ?..కేంద్ర కేబినెట్ లో మార్పులు

Central Cabinet : గురువారం సుధీర్ఘంగా జరిగిన మంత్రివర్గ భేటీలో పలు కీలక అంశాలతో పాటు దీనిపైనా చర్చ జరిగింది

Central Cabinet

కేంద్ర కేబినెట్(Central Cabinet) లో కీలక మార్పులు జరగబోతున్నాయి. పనితీరు ఆధారంగా 20 మందికి పైగా మంత్రులకు ఉద్వాసన పలకబోతున్నట్టు తెలుస్తోంది. అదే సమయంలో కేబినెట్ నుంచి తప్పించిన వారందరికీ పార్టీలో కీలక బాధ్యతలు అప్పగించబోతున్నారు. గురువారం సుధీర్ఘంగా జరిగిన మంత్రివర్గ భేటీలో పలు కీలక అంశాలతో పాటు దీనిపైనా చర్చ జరిగింది.

వచ్చే నెలతో మోదీ ప్రభుత్వం కొలువుదీరి రెండేళ్లు పూర్తవుతున్న సందర్భంగా కేబినెట్(Central Cabinet) విస్తరణకు నిర్ణయించారు. ఈ సారి మంత్రి వర్గ విస్తరణలో దక్షిణాది రాష్ట్రాలకు ఎక్కువ ప్రాధాన్యత లభించనుంది. నితీష్ కుమార్ , అన్నామలైకు మంత్రి పదవులు దక్కనున్నాయి. ఈ క్రమంలో తెలంగాణకు కూడా ప్రాధాన్యత దక్కనుంది.

ప్రస్తుతం తెలంగాణ నుంచి కిషన్ రెడ్డి, బండి సంజయ్ మంత్రివర్గంలో ఉన్నారు. కేబినెట్ విస్తరణలో ఈటల రాజేందర్, లక్ష్మణ్ లకు చోటు దక్కనుందని సమాచారం. అదే సమయంలో కిషన్ రెడ్డి శాఖ మార్చే అవకాశముందని తెలుస్తోంది. అదే సమయంలో మహిళల కోటాలో డీకే అరుణ పేరు కూడా వినిపిస్తోంది.

వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో అధికారంలోకి రావాలనుకుంటున్న బీజేపీ ఆ దిశగా మంత్రివర్గంలో ఈ రాష్ట్రానికి ప్రాధాన్యత పెంచేందుకు నిర్ణయించుకుంది. ప్రధాని మోదీ తెలంగాణ పైన ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. అయితే మంత్రిగా బండి సంజయ్ ను కొనసాగించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. బండి సంజయ్ కు పార్టీ బాధ్యతలు అప్పగిస్తే కలిసొస్తుందని భావిస్తోంది.

Central Cabinet

ఇటీవల జరిగిన కొన్ని ఘటనలు ఎలాంటి ప్రభావం చూపవని భావిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ప్రస్తుతం ఇద్దరు సహాయ మంత్రులు, ఒక కేంద్ర మంత్రి ఉన్నారు. విస్తరణలో కొన్ని మార్పులు చోటు చేసుకోవడం ఖాయమైంది. పురంధేశ్వరిని కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకుంటారని వార్తలు వస్తున్నాయి. ఇక, ఎన్డీయే భాగస్వామ్య పక్షాలను కూడా మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశం ఉందని సమాచారం.

అయితే ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి బీజేపీలో చేరిన రాఘవ్ చద్దాను మంత్రివర్గంలోకి తీసుకోవడంపై బీజేపీ అధిష్టానం సానుకూలంగానే ఉన్నట్టు తెలుస్తోంది.మరోవైపు నీట్ పేపర్ లీక్ నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ను ఈ శాఖ నుంచి తప్పిస్తారా అనేది చూడాలి.

Cockroach Janta Party : కాక్రోచ్ పార్టీ ఎక్స్ ఖాతా బ్లాక్..తగ్గేదే లేదంటూ మరో అకౌంట్

Exit mobile version