Mamata Banerjee
పశ్చిమ బెంగాల్ పాలిటిక్స్‌లో మరోసారి తీవ్ర ఉత్కంఠను రేపుతూ తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఎమ్మెల్యేల సంతకాల ఫోర్జరీ ఇష్యూ ఇప్పుడు జాతీయ స్థాయిలో పెద్ద చర్చకు దారితీస్తోంది. శాసనసభలో ప్రతిపక్ష నేత గుర్తింపు కోసం టీఎంసీ సమర్పించిన ప్రతిపాదనల్లో.. కొందరు ఎమ్మెల్యేల సంతకాలను నకిలీవిగా మార్చారన్న ఆరోపణలపై దర్యాప్తు ముదురుతోంది.
అయితే ఏకంగా సీఐడీ అధికారులు మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ(Mamata Banerjee) నివాసానికి చేరుకోవడం బెంగాల్ రాజకీయాలలోనే కాదు యావత్ దేశ రాజకీయాల్లో ఒక్కసారిగా కాక రేపింది. అంతేకాదు ఇది ఇటు అధికార టీఎంసీ, అటు ప్రతిపక్షాల మధ్య ఇదొక పెద్ద ఘర్షణగా మారింది. దీంతో సాధారణంగా పరిపాలనా పరంగా చూసే ఈ వ్యవహారం.. రాష్ట్ర రాజకీయాలను కుదిపేసే స్థాయికి చేరుకుంది.
శాసన వ్యవస్థ నమ్మకాన్ని ప్రశ్నించేలా కొంతమంది ఎమ్మెల్యేల సంతకాలను ఫోర్జరీ చేయడం అసలు ఈ గొడవకు ప్రధాన కారణంగా నిలిచింది. శాసనసభలో ప్రతిపక్ష హోదాను దక్కించుకోవడానికి సమర్పించిన పత్రాల్లో అసలైన ప్రజాప్రతినిధుల సంతకాలు కాకుండా నకిలీవి వాడారనే అనుమానంతో అధికారులు సీఐడీ విచారణను ప్రారంభించారు.
ఆ పేపర్లు ఎక్కడ తయారయ్యాయి, సంతకాల సేకరణ వెనుక అసలు ఎవరెవరి పాత్ర ఉందనే విషయాలను తేల్చడానికి సీఐడీ ఇప్పుడు రంగంలోకి దిగింది. అయితే మమతా బెనర్జీ(Mamata Banerjee), అభిషేక్ బెనర్జీలు ఢిల్లీ పర్యటనలో ఉన్న సమయంలోనే సీఐడీ అధికారులు మమతా నివాసానికి రావడం అలాగే అదే భవనాన్ని పార్టీ కేంద్ర కార్యాలయంగా కూడా వాడుతుండటంతో టీఎంసీ నేతల్లో తీవ్ర అసంతృప్తి చెలరేగడంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. దీంతో పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపు చేయాల్సిన పరిస్థితి వచ్చింది.
నిజానికి రాజకీయాల్లో ఇలాంటి పెద్ద లీడర్లు , మాజీ సీఎంలపై దర్యాప్తులు జరగడం దేశంలో కొత్తేమీ కాదు. గతంలోనూ అవినీతి, అధికార దుర్వినియోగం, అక్రమ లావాదేవీలు, మనీలాండరింగ్ వంటి తీవ్రమైన ఆరోపణలు వచ్చినప్పుడు రాష్ట్ర, కేంద్ర దర్యాప్తు సంస్థలు మాజీ ముఖ్యమంత్రులను విచారించిన రికార్డులు ఉన్నాయి.
చట్టం ముందు అందరూ సమానమే కాబట్టి ప్రజాప్రతినిధులెవరైనా సరే అలాగే మాజీ సీఎంలు అయినా సరే విచారణను ఎదుర్కోవాల్సిందేనని, కొన్ని కేసుల్లో అరెస్టులు కూడా జరిగాయని విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. అయితే ఇవి చట్టప్రకారం జరుగుతున్న విచారణలని అధికార పార్టీలు అంటుంటే, ప్రతిపక్షాలు మాత్రం ఇవి రాజకీయ ప్రతీకార చర్యలని, వేధింపులని ఆరోపిస్తుంటాయి.
#WATCH | A team of CID at the residence of Former Chief Minister of West Bengal, Mamata Banerjee, in Kolkata pic.twitter.com/uQg0cGLIDr
— ANI (@ANI) June 9, 2026
ప్రస్తుతం ఈ ఫోర్జరీ కేసు కేవలం ఒక క్రిమినల్ ఇన్వెస్టిగేషన్‌గా కాకుండా బెంగాల్‌లోని టీఎంసీ-బీజేపీ రాజకీయ విభేదాలకు మరింత పదును పెట్టే అంశంగా మారిపోయింది. అయితే చివరకు కోర్టు విచారణ, న్యాయస్థానాల నివేదికలే ఈ ఫోర్జరీ కేసులో అసలు నిజాన్ని తేల్చనున్నాయి. అప్పటివరకు కూడా ఈ పొలిటికల్ యుద్ధం.. మీడియా వేదికలపై, న్యాయస్థానాల్లో హాట్ టాపిక్‌గా నిలవడం ఖాయంగా కనిపిస్తోంది.
VIDEO | Kolkata, West Bengal: Visuals show a CID team inside TMC chief Mamata Banerjee's Kalighat residence-cum-office as part of the probe into the 'forged-signature' case.
— Press Trust of India (@PTI_News) June 9, 2026
(Full video available on PTI Videos – https://t.co/n147TvrpG7)#Kolkata pic.twitter.com/LIfFPTEnEU
Ebola Virus: సరిహద్దులు దాటుతున్న ఎబోలా వైరస్..550 కి పైగా కేసులు నమోదు
