Just InternationalHealthLatest News

Ebola Virus: సరిహద్దులు దాటుతున్న ఎబోలా వైరస్..550 కి పైగా కేసులు నమోదు

Ebola Virus : ఎబోలా వైరస్ సరిహద్దులు దాటి పక్క దేశాలకు కూడా వ్యాపిస్తుండటం ప్రపంచవ్యాప్తంగా ఆందోళన రేకెత్తిస్తోంది. ఈ వైరస్ వేగంగా విస్తరిస్తుండటంతో.. ప్రపంచ ఆరోగ్య సంస్థ (W.H.O) కీలకమైన హెచ్చరిక జారీ చేసింది

Ebola Virus

ఆఫ్రికా ఖండంలో ఎబోలా మహమ్మారి మరోసారి విజృంభిస్తూ ప్రపంచ దేశాలను వణుకు పుట్టిస్తోంది. మెయిన్‌గా తూర్పు కాంగోలో ఎబోలా వైరస్(Ebola Virus) కల్లోలం సృష్టిస్తుండటంతో రోజురోజుకూ మరణాల సంఖ్య పెరుగుతోంది.

ప్రస్తుతం ఈ వైరస్ సరిహద్దులు దాటి పక్క దేశాలకు కూడా వ్యాపిస్తుండటం ప్రపంచవ్యాప్తంగా ఆందోళన రేకెత్తిస్తోంది. ఈ వైరస్ వేగంగా విస్తరిస్తుండటంతో.. ప్రపంచ ఆరోగ్య సంస్థ (W.H.O) కీలకమైన హెచ్చరిక జారీ చేసింది. ఈ వైరస్ మరింతగా వ్యాపించే ప్రమాదం పొంచి ఉందని హెచ్చరించింది.

కాగా తూర్పు కాంగోలో ఎబోలా వైరస్‌(Ebola Virus) వల్ల పరిస్థితి చాలా దారుణంగా మారింది. అక్కడ ఇప్పటివరకు మొత్తం 550 కేసులు నమోదు కాగా, వారిలో 100 మంది వరకూ ప్రాణాలు కోల్పోయారని అధికారులు అధికారికంగా ప్రకటించారు.

ఈ వైరస్ బారి నుంచి ఇప్పటివరకు కేవలం 19 మంది మాత్రమే కోలుకోగలిగారు. అలాగే మరో 309 మంది ఎబోలా లక్షణాలతో బాధపడుతూ ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు. దీంతో రోజురోజుకు పెరుగుతున్న కేసులను బట్టి అసలు సంఖ్య ఇంకా చాలా ఎక్కువగానే ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.

ఇక కాంగో సరిహద్దు దాటి ఉగాండాకు కూడా ఈ వైరస్ పాకింది. ఉగాండాలో ఇప్పటివరకు 19 ఎబోలా కేసులు నమోదు కాగా, ఇద్దరు రోగులు కూడా మరణించినట్లు W.H.O స్పష్టం చేసింది. అయితే ఈ వైరస్‌కు పక్కాగా సరిపోయే చికిత్స అందుబాటులో లేకపోవడంతో, దీని వ్యాప్తిని అరికట్టడం డాక్టర్లకు పెద్ద సవాల్‌గా మారింది.

సాధారణంగా ఈ వైరస్ శరీరంలోకి ప్రవేశించిన 2 నుంచి 21 రోజుల లోపు లక్షణాలు బయటపడతాయి. మొదట నార్మల్ ఫీవర్, తీవ్రమైన అలసట, కండరాల నొప్పులు , తలనొప్పితో ఈ వ్యాధి ప్రారంభమవుతుంది. ఆ తర్వాత గొంతు నొప్పి, వాంతులు, విరేచనాలు వంటి లక్షణాలు కనిపిస్తాయి.

వ్యాధి తీవ్రత పెరిగేకొద్దీ అంతర్గతంగా , బాహ్యంగా బ్లీడింగ్ జరగడం ఈ వైరస్ యొక్క అత్యంత ప్రమాదకరమైన లక్షణం. అంతేకాదు కిడ్నీలు, కాలేయం వంటి ముఖ్యమైన అవయవాలు పనిచేయడం మానేయడంతో రోగి చనిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

Ebola Virus
Ebola Virus

అందుకే ఈ వైరస్ బారిన పడకుండా ఉండటానికి కేవలం నివారణ చర్యలు మాత్రమే ఏకైక మార్గం. ఎబోలా సోకినవారి శరీర ద్రవాలు అంటే బ్లడ్, లాలాజలం, చెమట వంటివి తాకడం ద్వారా కానీ.. వారు ఉపయోగించిన బట్టలు, బెడ్ వంటివి ముట్టుకోవడం ద్వారా కూడా ఈ వైరస్ వేగంగా వ్యాపిస్తుంది. కాబట్టి వీరికి దూరంగా ఉండటం చాలా చాలా ముఖ్యం.

అలాగే ఎబోలా ప్రభావిత ప్రాంతాల్లో ఉంటున్నవారు తరచూ చేతులను సబ్బుతో , శానిటైజర్‌తో శుభ్రం చేసుకోవాలి. గబ్బిలాలు , కోతుల ద్వారా కూడా ఈ మహమ్మారి మనుషులకు సోకుతుంది. కాబట్టి, మాంసాన్ని సరిగ్గా ఉడికించకుండా తినకూడదు. ఈ వైరస్ తాలూకా లక్షణాలు కనిపించిన వెంటనే.. రోగిని ఐసోలేషన్‌లో ఉంచి డాక్టర్లను సంప్రదించాలి.

Biryani Controversy : రూ. 370 బిర్యానీ కాంట్రవర్సీ..ఇప్పుడు బాస్‌నూ వదలమంటున్న నెటిజన్లు

Related Articles

Back to top button