Placebo Effect : ప్రశంసలు, ప్రేమపూర్వక మాటలు అంత ఎఫెక్ట్ చూపిస్తాయా? బ్రెయిన్ కెమిస్ట్రీని మార్చే మ్యాజిక్ తెలుసుకోండి..

Placebo Effect : ఒక నార్మల్ పిల్ ఇచ్చి, ఇది నీ ప్రాబ్లమ్‌ను వెంటనే తగ్గించే మంచి టాబ్లెట్ అని ఒక డాక్టర్ నమ్మకంగా చెబితే, కేవలం ఆ నమ్మకంతోనే పేషెంట్ బాడీలో క్యూర్ అయ్యే ప్రాసెస్ జరుగుతుంది.

Placebo Effect

ఒక చిన్న కాంప్లిమెంట్, ఒక క్యూట్ ఓదార్పు , నేనున్నాననే ఒక నమ్మకం.. మనిషి మైండ్‌నే కాదు బాడీని మార్చేస్తుంది. మెడికల్ ఫీల్డ్‌లో ఒక టాబ్లెట్‌లా పనిచేసి పేషెంట్‌ను నయం చేసే ప్లాసిబో ఎఫెక్ట్(Placebo Effect )లాగే, రిలేషన్‌షిప్స్‌లో కూడా మనకు నచ్చిన వ్యక్తుల ప్రేమానురాగాలు, పాజిటివ్ వర్డ్స్ కూడా బ్రెయిన్‌పై ఒక బెస్ట్ మెడిసిన్‌లా పని చేస్తుంటాయి. దాన్నే బంధాల్లో ఉండే ప్లాసిబో ఎఫెక్ట్ అంటారు.

సైకాలజీ అండ్ మెడికల్ వరల్డ్‌లో ప్లాసిబో ఎఫెక్ట్(Placebo Effect )అనేది ఒక వండర్‌ఫుల్ కాన్సెప్ట్ అనే చెప్పొచ్చు. ఒక నార్మల్ పిల్ ఇచ్చి, ఇది నీ ప్రాబ్లమ్‌ను వెంటనే తగ్గించే మంచి టాబ్లెట్ అని ఒక డాక్టర్ నమ్మకంగా చెబితే, కేవలం ఆ నమ్మకంతోనే పేషెంట్ బాడీలో క్యూర్ అయ్యే ప్రాసెస్ జరుగుతుంది. అంటే రోగి మైండ్‌సెట్ మాత్రమే అక్కడ మెయిన్ రోల్ ప్లే చేస్తుంది.

సరిగ్గా ఇదే ప్లాసిబో ఎఫెక్ట్(Placebo Effect) డైలీ రిలేషన్‌షిప్స్‌లో, ముఖ్యంగా మనం బాగా ఇష్టపడే బంధాలలో చాలా పవర్‌ఫుల్‌గా పని చేస్తుందని సైకాలజిస్టులు చెబుతున్నారు. మనం ప్రేమించే పర్సన్ లేదా రెస్పెక్ట్ ఇచ్చే బంధం మన గురించి చెప్పే ప్రతీ పాజిటివ్ మాట కూడా మన బ్రెయిన్‌పై ఒక మంచి ఎనర్జీ డ్రింక్‌లా, పెయిన్ కిల్లర్‌లా ఇంపాక్ట్ చూపిస్తుందట.

మనం బాగా ఇష్టపడే పర్సన్ మనల్ని చూసి నువ్వు ఈరోజు ఇంకా చాలా బాగున్నావ్ అని కాంప్లిమెంట్ ఇచ్చినా, లేదా ఏదైనా టఫ్ కాంటెక్స్ట్‌లో నువ్వు ఇది ఈజీగా సాధించగలవంటూ.. మనలో కాన్ఫిడెన్స్ నింపినా మన శారీరక, మానసిక స్థితిలో తెలీని చేంజ్ వస్తుంది. ఆ మాట వినగానే బ్రెయిన్‌లోని రివార్డ్ సిస్టమ్ యాక్టివేట్ అయి, డోపమైన్ , ఆక్సిటోసిన్ వంటి హ్యాపీ హార్మోన్లు రిలీజ్ అవుతాయి.

ఈ హార్మోన్లు మనలో కాన్ఫిడెన్స్ లెవల్స్‌ను పెంచడమే కాకుండా, స్ట్రెస్ కలిగించే కార్టిసోల్ లెవల్స్‌ను పూర్తిగా డౌన్ చేస్తాయి. అంటే మన పార్ట్‌నర్ ఇచ్చే ఒక చిన్న బూస్టప్ కేవలం మనం వినడానికి బాగుండే మాట మాత్రమే కాదు.. అది మన బ్రెయిన్ కెమిస్ట్రీని చేంజ్ చేసే ఒక మైండ్ మ్యాజిక్ అవుతుందని సైకాలజిస్టులు అంటున్నారు.

మన పార్ట్‌నర్ లేదా క్లోజ్ ఫ్రెండ్స్ ఇచ్చే ఇలాంటి సపోర్ట్ మనలో మనకు తెలీని నమ్మకాన్ని క్రియేట్ చేస్తుంది. ఏదైనా కష్టమైన వర్క్ చేసేముందు ఇది నా వల్ల అవుతుందో లేదో అనే డౌట్‌తో ఆగిపోయినపుడు.. మనకు నచ్చిన వ్యక్తి నువ్వు చేయగలవని చెబితే, మన బ్రెయిన్ ఆ మాటను అదే నిజం అనేలా స్వీకరిస్తుంది.

దీనివల్ల మన మైండ్‌లోని ప్రాబ్లమ్ సాల్వింగ్ పార్ట్ యాక్టివేట్ అవడంతో పాటు, ఒకే విషయంపై ఫోకస్ చేసే కేపబిలిటీ పెరుగుతుంది. ప్లాసిబో ట్రీట్‌మెంట్‌లో నమ్మకమే మెడిసిన్‌గా మారినట్లే, అనుబంధాల్లో మనపై ఎదుటివారు ఉంచే నమ్మకమే మన సక్సెస్‌కు, మనలో సంతోషానికి సీక్రెట్ ఎనర్జీగా మారుతుంది.

కేవలం మైండ్‌కు బూస్ట్ ఇవ్వడమే కాకుండా, ఫిజికల్‌గా వచ్చే పెయిన్‌ను కంట్రోల్ చేయడంలో కూడా ఈ ప్లాసిబో ఎఫెక్ట్ కీ రోల్ ప్లే చేస్తుంది. మన స్పెషల్ పర్సన్ పక్కన ఉండి కౌగిలించుకున్నా..కేరింగ్‌గా మాట్లాడినా సరే మన బ్రెయిన్ ఎండోర్ఫిన్స్ అనే నేచురల్ పెయిన్ కిల్లర్లను బయటకు రిలీజ్ చేస్తుంది.

Placebo Effect

దీనివల్ల మన మైండ్ స్ట్రెస్ మాత్రమే కాదు, ఫిజికల్ పెయిన్ తీవ్రత కూడా తగ్గుతుందని రీసెర్చ్‌లలో ప్రూవ్ అయింది. మనం ఇచ్చే ఒక చిన్న అప్రిషియేషన్, చూపించే కొద్దిపాటి ప్రేమ ఎదుటివారి లైఫ్‌లో ఎంత మంచి మందులా పని చేస్తుందో చెప్పడానికి ఇది బెస్ట్ ఎగ్జాంపుల్.

అందుకే, మన బంధాలలో మనం మాట్లాడే మాటలు ఎంత శక్తివంతమో అని అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. మనం లవ్ చేసే వారిపై చేసే చిన్న నెగిటివ్ కామెంట్స్ వారిలో విపరీతమైన స్ట్రెస్ పెంచితే, మనం ఇచ్చే ఒక చిన్న కాంప్లిమెంట్ ఎదుటి వారిలో కొండంత ఆత్మవిశ్వాసాన్ని నింపుతుంది. బంధాల్లో ఈ ప్లాసిబో ఎఫెక్ట్‌ పాజిటివ్‌గా పని చేస్తే, మన మాటలతో మనవారి లైఫ్‌లో హ్యాపీనెస్ , కాన్ఫిడెన్స్ నింపే బెస్ట్ పర్సన్‌గా మనమే ఉంటాం.

Soya Beans : బరువు తగ్గాలనుకుంటున్నారా? ..అయితే మీ డైట్‌లో సోయాబీన్స్ యాడ్ చేసుకోండి..

Exit mobile version