CM Vijay
తమిళనాడు సీఎం, తమిళ వెట్రి కళగం అధినేత విజయ్ సినీ ఇండస్ట్రీకి సంబంధించి అత్యంత ప్రతిష్టాత్మకమైన, చారిత్రాత్మకమైన నిర్ణయాన్ని తీసుకోవడం హాట్ టాపిక్ అయింది. సినిమా ఇండస్ట్రీ ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని కోలీవుడ్ ఇండస్ట్రీకి భారీ ఊరటనిచ్చేలా సరికొత్త నిబంధనలను ప్రవేశపెట్టారు.
తమిళనాడులో విడుదలయ్యే అన్ని తమిళ మూవీలకు, అవి చిన్నవైనా పెద్దవైనా సరే, మొదటి వారం రోజుల పాటు రోజుకు ఐదు షోలు ప్రదర్శించుకునేలా ప్రభుత్వం అఫీషియల్‌గా జీవో జారీ చేసింది. సీఎం విజయ్(CM Vijay) తీసుకున్న ఈ విప్లవాత్మక నిర్ణయంపై తమిళ సినీ ఇండస్ట్రీ నలుమూలల నుంచి హర్షం వ్యక్తమవుతుంది. థియేటర్ల యజమానులు, నిర్మాతలు, పంపిణీదారులు ఈ నిర్ణయాన్ని సాదరంగా స్వాగతిస్తున్నారు.
ఈ కొత్త నిబంధనల వల్ల తమిళ సినీ ఇండస్ట్రీకి ఎన్నో అదనపు ప్రయోజనాలు కలగబోతున్నాయి. గతంలో పెద్ద స్టార్ హీరోల మూవీలు విడుదలైనప్పుడు తెల్లవారుజామున ప్రదర్శించే బెనిఫిట్ షోల కోసం నిర్మాతలు, ఎగ్జిబిటర్లు ప్రభుత్వాల చుట్టూ తిరగాల్సి వచ్చేది. అనుమతులు రావడంపై ఎప్పుడూ ఒక రకమైన సస్పెన్స్ కొనసాగేది.
కానీ ఇప్పటి నుంచి అలాంటి స్పెషల్ షోలకు ఎలాంటి అభ్యంతరాలుండవని విజయ్(CM Vijay) సర్కార్ క్లారిటీ ఇచ్చింది. అంతేకాకుండా, మూవీ రిలీజయిన మొదటి వారం రోజులలో ప్రొడ్యూసర్లు తమ పెట్టుబడిని వీలైనంత త్వరగా రికవరీ చేసుకోవడానికి వీలుగా టికెట్ల ధరలను కొంత వరకూ పెంచుకోవడానికి కూడా ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనివల్ల ప్రొడ్యూసర్లు నష్టాల బారిన పడకుండా సేఫ్ జోన్‌కు వచ్చే ఛాన్స్ చాలా త్వరగా లభిస్తుంది.
ఇది వరకు కేవలం టాప్ హీరోల సినిమాలకు లేదా భారీ బడ్జెట్ మూవీలకు మాత్రమే స్పెషల్ షోలు వేసుకునే వెసులుబాటు ఉండేది. దీనివల్ల చిన్న మూవీలు, కొత్త యాక్టర్స్ మూవీలు థియేటర్ల కొరతతో పాటు కలెక్షన్ల పరంగా తీవ్రంగా నష్టపోయేవి. ఇప్పుడు కొత్త జీవో ప్రకారం చిన్న, పెద్ద అనే తేడా లేకుండా అన్ని చిత్రాలకు సమానంగా మొదటి వారం పాటు రోజులకు ఐదు షోల వెసులుబాటు కల్పించడంతో ఇది చిన్న సినిమాల ప్రొడ్యూసర్లకు ఒక పెద్ద వరంలా మారింది.
సీఎం విజయ్ తీసుకున్న నిర్ణయం వల్ల తమిళ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల స్పీడ్ పెరగడమే కాకుండా.. పైరసీ మహమ్మారి కంటే ముందే ఆడియన్స్ థియేటర్లకు వచ్చి మూవీ చూసే అవకాశం లభిస్తుందని సినీ విశ్లేషకులు గట్టిగా నమ్ముతున్నారు
సినీ రంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చి సీఎం అయిన విజయ్, ఇండస్ట్రీ కష్టాలను స్వయంగా చూసిన వ్యక్తి కావడం వల్లే ఇలాంటి డేరింగ్ అండ్ సినీ ఇండస్ట్రీకి మేలు చేసే నిర్ణయాన్ని తీసుకోగలిగారని కోలీవుడ్ వర్గాలు ప్రశంసలు కురిపిస్తున్నాయి. ఈ కొత్త సినిమా రూల్స్ తమిళనాడులో మూవీ నిర్మాణ రంగానికి కొత్త ఊపిరి పోయడమే కాకుండా.. రాబోయే రోజుల్లో ఇతర రాష్ట్రాలు కూడా ఇలాంటి విధానాలను పరిశీలించే అవకాశం ఉంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
Urine : నీళ్లు ఎక్కువ తాగుతున్నా మూత్రం తక్కువ వస్తుందా? అర్జంటుగా కారణం తెలుసుకోండి..
