CM Vijay
భారత రాజ్యాంగం ప్రకారం చూస్తే.. చట్టం ముందు ఎవరైనా సమానమే. అది ముఖ్యమంత్రి అయినా, సెలబ్రిటీ అయినా, సామాన్య పౌరుడైనా ఎవరికైనా సరే చట్టం ఒక్కటే అనేది ప్రాథమిక సూత్రం. కానీ రియల్ లైఫ్‌లో మాత్రం ఈ రూల్స్ పక్కాగా ఫాలో అవుతున్నారా అనే డౌట్ చాలామందికి వస్తూనే ఉంటుంది.
పొలిటికల్ లీడర్లు, సెలబ్రిటీల పబ్లిక్ మీటింగ్స్‌లో సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ రావడం, తొక్కిసలాట జరగడం వంటివి అయిన ప్రతిసారీ పోలీసుల రోల్ ఏంటి, వారు ఎవరి మాట వింటున్నారనే చర్చ నడుస్తుంది. తాజాగా తమిళనాడులోని కరూర్‌లో జరిగిన దారుణమైన తొక్కిసలాట ఘటన గురించి టీవీకే లీడర్, సీఎం జోసెఫ్ విజయ్(CM Vijay) చేసిన కామెంట్స్ ఈ టాపిక్‌ను మళ్లీ తెరపైకి తెచ్చాయి.
కరూర్‌లో జరిగిన ఈ ఇన్సిడెంట్‌లో 40 మంది చనిపోగా, తాజాగా బాధిత ఫ్యామిలీలను కలిసి పరామర్శించిన సీఎం విజయ్(CM Vijay )వారికి ఉద్యోగ నియామక పత్రాలను ఇచ్చారు. ఈ టైమ్‌లోనే ఆయన మాట్లాడుతూ.. ఈ ఘోరం తనను బాగా హర్ట్ చేసిందని ఎమోషనల్ అయ్యారు. ఈ తప్పు మొత్తాన్ని తనపై నెట్టేసి పొలిటికల్‌గా వాడుకోవాలని అపోజిషన్ పార్టీలు, అధికారంలో ఉన్నవాళ్లు స్కెచ్ వేశారని సెన్సేషన్ కామెంట్లు చేశారు.
అసలు ఆ రోజు మీటింగ్‌లో ఎవరు ఆర్డర్స్ ఇచ్చారు. దానికి ఎవరు రెస్పాన్సిబుల్ అని విజయ్(CM Vijay )నిలదీశారు. తాను కరూర్ పోలీసులను ఫుల్‌గా నమ్మానని, ఆ నమ్మకం వల్లే తనను ప్రాణంగా ప్రేమించే వాళ్లను మిస్ అయ్యానని బాధపడ్డారు. క్రౌడ్ కంట్రోల్ అవ్వనప్పుడు లేదా ఏదైనా ప్రాబ్లం వస్తుందని తెలిసినపుడు .. పోలీసులకు ఆ మీటింగ్‌ను క్యాన్సిల్ చేసే పవర్స్ ఉన్నా ఎందుకు ఆపలేదని..తనను కరూర్‌లోకి ఎలా రానిచ్చారని సూటిగా ప్రశ్నించారు.
విజయ్ అడిగిన ఈ ప్రశ్నలు కేవలం తమిళనాడు గురించే కాదు, భారత దేశంలో పోలీస్ డిపార్ట్‌మెంట్ ఎలా పనిచేస్తుందనే దానిపైన మరోసారి ఆలోచించేలా చేశాయి. ఇలాంటి సీన్లు గతంలో తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలా చూశాం. చంద్రబాబు నాయుడు అపోజిషన్‌లో ఉన్నప్పుడు పోలీసులు పర్మిషన్లు ఇవ్వకపోవడం, కావాలనే రూల్స్ పెట్టడం వంటివాటిపై చాలాసార్లు ఆరోపించారు. పవన్ కళ్యాణ్ కూడా తన మీటింగ్స్, వారాహి యాత్రల టైమ్‌లో పోలీసుల ప్రవర్తన బాలేదని, అప్పటి గవర్నమెంట్ పోలీసులను వాడుకుంటోందని విమర్శించారు.
ఇవన్నీ చూస్తే పోలీసులు ఎవరైనా అధికారంలో ఉన్నప్పుడు ఒకలా, పవర్ లేనప్పుడు ఇంకోలా బిహేవ్ చేస్తారా అనే డౌట్ కామన్ పీపుల్‌కు వస్తుంది. చట్టం ప్రకారం పోలీసులు కేవలం రాజ్యాంగానికి, రూల్స్‌కే జవాబుదారులుగా ఉండాలి. కానీ, రియాలిటీలో మాత్రం రూలింగ్ పార్టీ మీటింగ్స్‌కి ఈజీగా పర్మిషన్ ఇవ్వడం, అపోజిషన్ పార్టీ సభలపై ఆంక్షలు పెట్టడం వంటి పార్షియాలిటీ జరుగుతోందనే టాక్ ఎప్పటి నుంచో వినిపిస్తోంది.
అయితే ఈ మొత్తం పోలీసుల విషయంలో ఒక మానవీయ కోణంతో పాటు పొలిటికల్ బ్లేమ్ గేమ్, మేనేజ్‌మెంట్ ఫెయిల్యూర్ క్లియర్ గా కనిపిస్తున్నాయన్నది నిపుణుల మాట. ఒక కామన్ మ్యాన్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లడానికే భయపడే రోజులు ఇవి. అటుంవంటప్పుడు సెలబ్రిటీలు పొలిటికల్ లీడర్ల సభల్లో ఇలాంటి ప్రమాదాలు జరిగినపుడు ఒకరిపై ఒకరు నిందలు వేసుకోవడం కరెక్ట్ కాదు.
మీటింగ్స్ పెట్టే నిర్వాహకులకు ఇలాంటి సభల విషయంలో ఎంత రెస్పాన్సిబిలిటీ ఉంటుందో..అంటే ఎంత క్రౌడ్ వస్తుంది, బారికేడ్లు ఎలా పెట్టాలి, ఎమర్జెన్సీ రూట్స్ ఏంటి అని చూసుకోవడంలో పోలీసులకూ అంతే సమానమైన రోల్ ఉంటుంది. కాకపోతే ట్రాన్స్‌ఫర్స్ అవుతాయనే భయం, పొలిటికల్ ప్రెజర్స్, లోకల్ లీడర్ల ఇంటర్ఫియరెన్స్ వల్ల పోలీసులు చాలాసార్లు సొంతంగా డెసిషన్స్ తీసుకోలేకపోతున్నారనేది కాదనలేని నిజం.
డెమోక్రసీలో పోలీస్ సిస్టమ్‌పై జనాలకు నమ్మకం పెరగాలంటే చట్టం అందరికీ ఒకేలా వర్తిస్తుందన్న నమ్మకాన్ని కలిగించాలి. రూల్స్ అందరికీ ఒకటే అనే నమ్మకం వచ్చినప్పుడే పోలీస్ డిపార్ట్‌మెంట్‌పై పబ్లిక్‌కు కూడా రెస్పెక్ట్ పెరుగుతుంది.
Banana with Curd Rice : పెరుగన్నంలో అరటి పండు కలిపి తింటున్నారా? అయితే ఇది తెలుసుకోవాల్సిందే..
