CM Vijay : దక్షిణాది ఐక్యతకు సీఎం విజయ్ పిలుపు..ఒకవేళ ఆ 5 రాష్ట్రాలు ఏకమయితే ఏం జరుగుతుంది.?

CM Vijay : జనాభాను కంట్రోల్ చేశామన్న ఒకే ఒక్క కారణంతో ఫండ్స్‌లో కోత విధించడం సరికాదని, అలాగే జీఎస్టీ వచ్చాక రాష్ట్రాలకు ఉన్న ట్యాక్స్ ఫ్రీడమ్ పోయిందని, దాన్ని మళ్లీ పునరుద్ధరించాలని విజయ్ కోరారు.

CM Vijay

దేశానికి సింహభాగం ట్యాక్స్ కడుతూ ఎకానమీని నడిపిస్తున్న దక్షిణాది రాష్ట్రాలన్నీ కూడా ఇప్పుడు ఒకే తాటిపైకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ దిశగా తమిళనాడు సీఎం విజయ్ చెన్నై సదస్సులో మాట్లాడిన మాటలు నేషనల్ వైడ్‌గా హాట్ టాపిక్‌గా మారాయి. ప్రతి విషయంలో కూడా కేంద్రం ముందు మోకరిల్లకుండా, అంతర్రాష్ట్ర వివాదాలను పక్కనబెట్టి 5 సౌత్ స్టేట్స్ కలిసి ఒకే పవర్ హౌస్‌గా నిలబడాలని.. అలా చేస్తే ఎలాంటి ముప్పునైనా తిప్పికొట్టొచ్చని చెన్నైలో జరిగిన 31వ సదరన్ జోనల్ కౌన్సిల్ మీటింగ్‌లో విజయ్ పిలుపునిచ్చారు.

భారత దేశ జీడీపీలో 30 శాతానికి పైగా కాంట్రిబ్యూషన్ ఇస్తున్నవి దక్షిణాది రాష్ట్రాలే అని చెప్పిన విజయ్..ఇవి కేవలం విడివిడిగా ఉండిపోకూడదని, అంతా కలిసి ఒక ఇంటిగ్రేటెడ్ ఎకనామిక్ క్లస్టర్‌గా రూపాంతరం చెందాలని ప్రతిపాదించారు. మానుఫ్యాక్చరింగ్ సెక్టార్స్, భారీ లాజిస్టిక్స్ పార్కులు, ఫ్రైట్ కారిడార్ల ద్వారా సౌత్ ఇండియాను వరల్డ్ క్లాస్ హబ్‌గా మార్చొచ్చని చెప్పారు. దీనిలో భాగంగానే బెంగళూరులోని బొమ్మసంద్ర నుంచి హోసూర్ వరకు మెట్రో లైన్ పొడిగింపు ప్రాజెక్ట్‌ను ఉదాహరణగా చూపిస్తూ.. రెండు రాష్ట్రాల మధ్య ఇలాంటి ప్రాజెక్టులు స్పీడప్ కావాలన్నారు.

మరోవైపు యూత్‌ను నాశనం చేస్తున్న డ్రగ్స్ వ్యవహారంపై డ్రగ్ ఫ్రీ సౌత్ ఇండియా మిషన్‌ను కూడా విజయ్ తెరపైకి తెచ్చారు. రాష్ట్రాల మధ్య ఇంటెలిజెన్స్ షేరింగ్ పెంచి, ట్రాఫికింగ్‌ను ఉక్కుపాదంతో అణచివేయాలని పిలుపునిచ్చారు. అంతేకాదు, ఇంటర్నెట్‌లో విచ్చలవిడిగా సాగుతున్న ఆన్‌లైన్ మెడిసిన్ సేల్స్, అనాథరైజ్‌డ్ డ్రగ్ సప్లైపై కఠినమైన రెగ్యులేషన్స్ తేవాలని స్పష్టం చేశారు.

ఇక తీరప్రాంతం దక్షిణాదికి ఉన్న అతిపెద్ద ప్లస్ పాయింట్ అని హైలైట్ చేసిన విజయ్.. తమిళనాడులోని 1,076 కిలోమీటర్ల సుదీర్ఘ సముద్ర తీరాన్ని వాడుకుంటూ బ్లూ ఎకానమీ ద్వారా మిగిలిన పొరుగు రాష్ట్రాలతో కలిసి పోర్టులు, షిప్పింగ్, ఫిషరీస్, సీ బేస్డ్ టూరిజంను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లొచ్చని రోడ్‌మ్యాప్ ఇచ్చారు.

ఆర్థికంగా చూస్తే ఫైనాన్స్ కమిషన్ ఫండ్స్ కేటాయింపులో బాగా పనిచేసే రాష్ట్రాలకు అన్యాయం జరగకుండా చూడాలని విజయ్ డిమాండ్ చేశారు. జనాభాను కంట్రోల్ చేశామన్న ఒకే ఒక్క కారణంతో ఫండ్స్‌లో కోత విధించడం సరికాదని, అలాగే జీఎస్టీ వచ్చాక రాష్ట్రాలకు ఉన్న ట్యాక్స్ ఫ్రీడమ్ పోయిందని, దాన్ని మళ్లీ పునరుద్ధరించాలని కోరారు. నీట్ పరీక్ష వల్ల గ్రామీణ, పేద విద్యార్థులు నష్టపోతున్నారని గుర్తు చేసిన తమిళనాడు ముఖ్యమంత్రి.. 12వ తరగతి మార్కుల ఆధారంగానే స్టేట్ కోటా మెడికల్ సీట్లు భర్తీ చేసుకునే వెసులుబాటు ఇవ్వాలని డిమాండ్ చేశారు

రాబోయే డీలిమిటేషన్ ప్రాసెస్‌లో జనాభా ప్రాతిపదికన పార్లమెంట్ సీట్లు తగ్గిపోకుండా లీగల్ గ్యారెంటీ ఇవ్వాలని, కావేరి, ముల్లపెరియార్ నదీ జలాల విషయంలో కోర్టుల తీర్పుల ప్రకారం.. దిగువన ఉన్న రాష్ట్రాల హక్కులను కాపాడాలని కోరారు. రాష్ట్రాలు బలంగా ఉంటేనే దేశం స్ట్రాంగ్‌గా ఉంటుందంటూ.. వివాదాలను పక్కనబెట్టి చర్చల ద్వారా ముందుకెళ్లడానికి తమిళనాడు ఎప్పుడూ సిద్ధంగానే ఉందని ముగించారు.

CM Vijay

ఒకవేళ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాలు ఈ ఐక్యతకు ఓకే చెబితే.. కేంద్రం వద్ద మన వాటా ఫండ్స్ రాబట్టుకోవడంలో తిరుగులేని బలం వస్తుంది. గ్రీన్ ఎనర్జీ, టెక్నాలజీ, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ రంగాల్లో ఇంటర్-స్టేట్ ప్రాజెక్ట్‌లు స్పీడప్ అయి కోట్లాది మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు లభిస్తాయి.

డ్రగ్స్, సైబర్ క్రైమ్స్ వంటి సమస్యలను బోర్డర్స్ దాటకుండానే ముందే అడ్డుకోవచ్చు. అంతేకాకుండా విభేదాలు పక్కనబెట్టి ఆర్థికంగా, సామాజికంగా ఐక్యమైతే కనుక.. దక్షిణాది కేవలం భారత దేశంలోనే కాదు ఆసియా ఖండంలోనే అతిపెద్ద ఎకనామిక్ పవర్ హౌస్‌గా మారడం గ్యారంటీ అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Milad Un Nabi Holiday : మిలాద్‌ ఉన్‌ నబీ హాలీడే డేట్‌ను మార్చిన ఏపీ ప్రభుత్వం.. కొత్త డేట్ ఇదే!

Exit mobile version