E20 : త్వరలో గాడీ మార్చ్..ఇ20 జనతా పార్టీ యాక్షన్ ప్లాన్

E20 : ముడి చమురు దిగుమతులు తగ్గించుకోవడం కోసం పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్ కలిపే విధానాన్ని దేశవ్యాప్తంగా ప్రవేశపెట్టింది.

E20

కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో కాక్రోచ్ జనతా పార్టీ అతి పెద్ద విజయం అందుకున్నట్లు అయింది. ఇపుడు సీజేపీ స్పూర్తితో ఇ20(E20) జనతా పార్టీ పేరుతో కొత్త ఉద్యమం మొదలయింది. కోట్లాది మంది వాహనదారుల ఆగ్రహానికి కారణమవుతున్న ఇ20 పెట్రోల్ వివాదం దీనికి కారణం.

ముడి చమురు దిగుమతులు తగ్గించుకోవడం కోసం పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్ కలిపే విధానాన్ని దేశవ్యాప్తంగా ప్రవేశపెట్టింది. కానీ, ఈ ఇ20 పెట్రోల్ వల్ల ప్రస్తుతం దేశంలో ఉన్న కోట్లాది పాత వాహనాల ఇంజన్లు ఘోరంగా పాడైపోతున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇథనాల్ శాతం పెరగడం వల్ల వాహనాల మైలేజ్ దారుణంగా పడిపోతోందని, ఇంజన్లలో తుప్పు పట్టి రిపేర్లు వస్తున్నాయని చాలామంది మండిపడుతున్నారు.

ఈ ఉద్యమం కేవలం సోషల్ మీడియాకే పరిమితం కావడం లేదు. గ్రౌండ్ లెవెల్‌లో ఒక భారీ యాక్షన్ ప్లాన్‌ను సిద్ధం చేశారు. ఢిల్లీలోని చారిత్రాత్మక ఇండియా గేట్ దగ్గర గాడీ మార్చ్ పేరిట ఒక భారీ వాహనాల నిరసన ప్రదర్శనను చేపట్టబోతున్నట్లు ప్రకటించారు. ఇంధన విధానంలో వస్తున్న మార్పులు, పెట్రోల్‌లో ఇథనాల్ 20 కలపడానికి వ్యతిరేకంగా ఈ శాంతియుత వాహన ర్యాలీ నిరసన తెలపబోతున్నారు.

తెహసీన్ పూనావల్లా నేతృత్వంలోని టీమ్ భారత్ ఈ నిరసనకు పిలుపునిచ్చింది. జూలై 31న ఢిల్లీలోని ఇండియా గేట్ జంతర్ మంతర్ నుంచి ప్రారంభమై కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, హర్దీప్ సింగ్ పూరి కార్యాలయాలు, పార్లమెంట్ వైపుగా ఈ గాడీ మార్చ్, గాంధీ మార్చ్ సాగనుంది. దేశంలోని వాహనదారుల హక్కులను కాపాడటం, ఇంధన ఎంపిక హక్కును వినియోగదారులకే వదిలేయాలని డిమాండ్ చేస్తూ ఇది సాగనుంది.

E20

పెట్రోల్‌లో ఇథనాల్‌ను 20 శాతం కలపడం వల్ల పాత వాహనాల ఇంజన్లు పాడవుతున్నాయని, అందుకే ఈ విధానాన్ని ఉపసంహరించుకోవాలనీ డిమాండ్ చేస్తున్నారు. అలాగే 2023 కంటే ముందు కొనుగోలు చేసిన పాత వాహనాల కోసం సాధారణ ఇంధనాన్ని ఇథనాల్ కలపని లేదా తక్కువ కలిపిన అందుబాటులో ఉంచాలనీ కోరుతున్నారు. ఇంధన మార్పుల వల్ల వాహనదారులపై పడుతున్న ఆర్థిక భారం,నష్టాలపై స్పష్టమైన పరిష్కారాలు చూపాలనీ గాడీ మార్చ్ ద్వారా కేంద్ర ప్రభుత్వం పెద్దలకు డిమాండ్ చేయనున్నారు.

Paradox Of Choice : ఎక్కువ ఆప్షన్లు ఉంటే ప్రశాంతతను దూరం చేస్తాయా? ఆప్షన్స్ ఎక్కువైతే డెసిషన్స్ కష్టమేనా?

Exit mobile version