Bus Rape Case : బస్సుల్లో పరదాలు ఉండవు,పానిక్ బటన్స్ పని చేయాల్సిందే.. సర్కార్ సీరియస్ యాక్షన్

Bus Rape Case : ఆగస్టు 4న రాత్రి సమయంలో గ్రేటర్ నోయిడాలో ఒక మైనర్ బాలిక బస్సు ఎక్కగా.. కామాంధులైన డ్రైవర్, కండక్టర్ కలిసి ఆమెపై అత్యాచారానికి తెగబడ్డారు.

Bus Rape Case

ఇటీవల ఢిల్లీలో కదులుతున్న స్లీపర్ బస్సులో ఓ మైనర్ బాలికపై డ్రైవర్, కండక్టర్ సామూహిక అత్యాచారానికి ఒడిగట్టిన విషయం తెలిసింది. నిజానికి ఈ వార్త వినగానే ప్రయాణికుల రక్షణపై మరోసారి అందరిలోనూ ఆందోళన వ్యక్తమైంది. 2012లో జరిగిన దారుణమైన నిర్భయ ఉదంతాన్ని..ఈ ఘటన మళ్లీ కళ్లముందుకు తెచ్చింది. దీంతో ఈ ఘోరంపై ఢిల్లీ ప్రభుత్వం వెంటనే స్పందించింది.

బస్సుల్లో మహిళలు, ప్రయాణికుల భద్రత కోసం ఏమాత్రం ఆలస్యం చేయకుండా చాలా కఠినమైన రవాణా మార్గదర్శకాలను రంగంలోకి దించింది. లోకల్‌గా నడిచే బస్సులే కాదు ఇతర రాష్ట్రాల నుంచి సరిహద్దులు దాటి ఢిల్లీకి వచ్చే ప్రతి ఒక్క ప్రైవేట్ అండ్ పబ్లిక్ బస్సులోనూ తప్పనిసరిగా అమలు చేయాల్సిన కొన్ని నిబంధనలను రవాణా శాఖ మంగళవారం రిలీజ్ చేసింది.

గత నెల ఆగస్టు 4న రాత్రి సమయంలో గ్రేటర్ నోయిడాలో ఒక మైనర్ బాలిక బస్సు ఎక్కగా.. కామాంధులైన డ్రైవర్, కండక్టర్ కలిసి ఆమెపై అత్యాచారానికి తెగబడ్డారు. తర్వాత కాశ్మీరీ గేట్ సమీపంలో బాధితురాలిని పడేసి పారిపోయారు. నేరస్తులు ఈ దారుణానికి ఒడిగట్టేటపుడు బస్సు కిటికీల నుంచి లోపలి దృశ్యాలు బయటకు కనిపించకుండా అడ్డంగా ఉన్న పరదాలు, అలాగే నిబంధనల ప్రకారం పనిచేయాల్సిన సీసీటీవీ కెమెరా వ్యవస్థ లేకపోవడాన్ని తమకు అనుకూలంగా మార్చుకున్నారు.

ఈ లోపాలను సీరియస్‌గా పరిగణించిన రవాణా శాఖ, విండో పరదాలు, అలాగే నిబంధనలకు విరుద్ధంగా అమర్చే ఫిల్మ్‌లను పూర్తిగా బ్యాన్ చేస్తూ విండ్‌షీల్డ్, వెనుక మిర్రర్స్, పక్క కిటికీలు పూర్తిగా ట్రాన్స్‌పరెంట్‌గా ఉండాలని తేల్చి చెప్పింది.

అంతేకాకుండా ప్రతి బస్సులోనూ వెహికల్ లొకేషన్ ట్రాకింగ్ పరికరాలు, పానిక్ బటన్లు కంటిన్యూగా పని చేసేలా ఉండాలని స్పష్టం చేసింది. ప్రయాణికులు అత్యవసర సమయంలో ఈజీగా నొక్కేలా పానిక్ బటన్లను ఏర్పాటు చేయడంతో పాటు, లైవ్‌లో ఉండే ఫైర్ ఎక్స్‌టింగ్వైషర్లు, ఫస్ట్ ఎయిడ్ కిట్లు ఉండాలని ఆదేశించారు. పగలు సర్వీసు పూర్తయిన తర్వాత కానీ లేదంటే రాత్రి వేళల్లో కానీ వాహనాలను పార్క్ చేసేటప్పుడు చీకటి ప్రదేశాల్లో కాకుండా వెలుతురు ఉండే సేఫ్ జోన్లలో మాత్రమే నిలపాలని తేల్చి చెప్పారు.

Bus Rape Case

అలాగే డ్రైవర్లు, కండక్టర్లు, ఇతర సిబ్బంది ప్రయాణికులతో మర్యాదగా ప్రవర్తించాలని అధికారులు హుకుం జారీ చేసారు. ఆల్కహాల్ లేదా ఎలాంటి మత్తు పదార్థాలయినా సేవించి వాహనాలు నడిపినా కూడా ఉపేక్షించేది లేదని హెచ్చరించింది. డ్యూటీలో ఉన్నప్పుడు పీఎస్వీ బ్యాడ్జీలు, యూనిఫాం, ఒరిజినల్ లైసెన్సులతో ఉండాలని..అంతేకాకుండా సిబ్బందిని ఉద్యోగంలోకి తీసుకునే ముందే యజమానులు వారి క్రిమినల్ బ్యాక్‌గ్రౌండ్ చెక్ చేయాలని ఆదేశించింది.

ప్రయాణంలో ఉన్నప్పుడు బస్సు తలుపులన్నీ మూసి ఉంచాలి. ఒకవేళ ఏ మహిళ పట్ల అయినా ఎవరైనా అభ్యంతరకరంగా ప్రవర్తించినా, వేధింపులకు గురి చేసినా సిబ్బంది వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు లేదా పీసీఆర్ వ్యాన్‌కు ఇన్ఫర్మేషన్ అందించి బస్సును అక్కడికు తరలించాలని రూల్స్ విధించారు.

ఈ కొత్త రూల్స్ కాగితాలకే పరిమితం కాకుండా స్ట్రిక్టుగా అమలు చేస్తామని, ఏ చిన్న నిబంధన ఉల్లంఘించినా వాహనాలను సీజ్ చేయడంతో పాటు బస్సు పర్మిట్లను కేన్సిల్ చేస్తామని రవాణా శాఖ మంత్రి డాక్టర్ పంకజ్ కుమార్ సింగ్ హెచ్చరించారు. కాగా ఢిల్లీ సర్కార్ తీసుకున్న ఈ సెన్సేషన్ డెసిషన్ కచ్చితంగా క్రిమినల్స్‌కి వణుకు పుట్టిస్తుందని చాలామంది హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Babymoon : హనీమూన్,బడ్డీమూన్ తెలుసు.. మరి సమంత చెప్పిన బేబీమూన్ గురించి తెలుసా?

Exit mobile version