EPF : పీఎఫ్ ఖాతాదారులకు 2 శుభవార్తలు.. రూ.5 లక్షల వరకు ఆటోమేటిక్ క్లెయిమ్ సెటిల్​మెంట్..

EPF : జూలై 15 నాటికి దేశవ్యాప్తంగా ఉన్న దాదాపు 34 కోట్ల మంది పీఎఫ్ అకౌంట్ హోల్డర్ల ఖాతాల్లో 8.25 శాతం మేర వడ్డీ సొమ్ము జమ అవుతుంది.

EPF

కోట్లాది మంది ప్రావిడెంట్ ఫండ్ ఖాతాదారులకు కేంద్ర ప్రభుత్వం ఒకేసారి 2 శుభవార్తలను అందించింది. ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ సంస్థ తన సేవలను మరింత వేగవంతం చేస్తూ సరికొత్త డిజిటల్ వ్యవస్థను అఫీషియల్‌గా ప్రారంభించింది.

దీనిలో భాగంగా పీఎఫ్(EPF) అకౌంట్ హోల్డర్స్‌కు అత్యంత ప్రయోజనకరంగా ఉండే ఆటోమేటిక్ క్లెయిమ్ సెటిల్​మెంట్ పరిమితిని ఏకంగా రూ. 5 లక్షల వరకు పెంచుతూ ఈపీఎఫ్ఓ ఒక చారిత్రాత్మక నిర్ణయాన్ని తీసుకుంది.

దీంతో పాటు ఈ నెల 15వ తేదీ నాటికే ఖాతాదారుల ఖాతాల్లో వడ్డీ డబ్బులను నేరుగా జమ చేయనున్నట్లు ఈపీఎఫ్ఓ స్పష్టం చేసింది. గతంలో ఖాతాదారులు తమ ఖాతాల్లో ఈ వడ్డీ క్రెడిట్ కావడం కోసం సెప్టెంబర్ లేదా అక్టోబర్ నెలల వరకు వెయిట్ చేయాల్సి వచ్చేది, కానీ ఇప్పుడు ఆ తిప్పలు పూర్తిగా తప్పబోతున్నాయి.

కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ ఈ విప్లవాత్మక మార్పులకు సంబంధించి ఒక కీలకమైన అధికారిక ప్రకటన చేశారు. కొత్తగా అందుబాటులోకి వచ్చిన కేంద్రీకృత ఐటీ ప్లాట్‌ఫామ్ కారణంగానే పీఎఫ్ వడ్డీ జమ ప్రక్రియకు పట్టే టైమ్‌ గణనీయంగా తగ్గిందని మంత్రి వివరించారు.

ఈ జూలై 15 నాటికి దేశవ్యాప్తంగా ఉన్న దాదాపు 34 కోట్ల మంది పీఎఫ్ అకౌంట్ హోల్డర్ల ఖాతాల్లో 8.25 శాతం మేర వడ్డీ సొమ్ము విజయవంతంగా జమ అవుతుందని వెల్లడించారు. ఈ విడతలో మొత్తం రూ.1.44 లక్షల కోట్ల ఈపీఎఫ్ ఇంట్రస్ట్ మొత్తాన్ని ఖాతాదారుల అకౌంట్లలో వేయనున్నారు.

గతంలో ఇదే భారీ మొత్తాన్ని సెప్టెంబర్‌లో కానీ అక్టోబర్ నెలల్లో కానీ వేసేవారమని, ప్రస్తుతం ఈ ప్రక్రియ అంతా డిజిటల్ రూపంలో ఆటోమేటిక్ కావడం వల్ల..ఈ ప్రాసెసింగ్ సమయం భారీగా తగ్గిందని కేంద్రమంత్రి సంతోషం వ్యక్తం చేశారు.

ఈపీఎఫ్ఓ తన ప్రతిష్టాత్మకమైన సెంట్రలైజ్డ్ ఐటీ ఎనేబుల్డ్ సర్వీసెస్ ప్రాజెక్టులో భాగంగా అకౌంట్ హోల్డర్ల రికార్డులన్నింటినీ ఒకే ఒక సెంట్రలైజ్డ్ నేషనల్ డేటాబేస్‌కు విజయవంతంగా ట్రాన్స్‌ఫర్ చేసింది. ఈపీఎఫ్ఓ అందించే సర్వీసులను ఆధునికీకరించడం, పూర్తిస్థాయి ఆటోమేషన్, నిబంధనల ఆధారిత ప్రాసెసింగ్, పారదర్శకత , పనితీరులో సమర్థతను పెంచే లక్ష్యంతో ఈ ఏకీకృత ప్లాట్‌ఫారమ్‌ను తీసుకువచ్చారు.

గతంలో వేర్వేరు లోకల్ ఆఫీసులు తమ పరిధిలోని డేటాబేస్‌లను విడివిడిగా నిర్వహించడం వల్ల ఈ వడ్డీ జమ ప్రాసెస్ చాలా ఆలస్యమయ్యేది. కానీ ఇప్పుడు నేషనల్ లెవెల్ సెంట్రలైజ్డ్ డేటాబేస్ అందుబాటులోకి రావడంతో సభ్యుల సర్వీస్ రిక్వెస్ట్‌లను కేవలం ఆ అకౌంట్ ఉన్న ప్రాంతీయ కార్యాలయం నుంచే కాకుండా, దేశవ్యాప్తంగా ఉన్న ఏ ఈపీఎఫ్ఓ అఫీషియల్ ఆఫీస్‌ నుంచైనా చాలా ఈజీగా ప్రాసెస్ చేసే వీలుంటుంది.

ఈ కొత్త యూనిఫైడ్ పోర్టల్‌లో ఖాతాదారులు తమ ప్రావిడెంట్ ఫండ్ బ్యాలెన్స్, తాజా క్లెయిమ్ స్థితి, పెన్షన్ రికార్డులు , తాము పొందిన కొన్ని రకాల బెనిఫిట్స్ గురించిన వివరాలను ఒకే చోట ఈజీగా చూసుకోవచ్చు. అంతేకాకుండా, తమ క్లెయిమ్‌లను ఫైనల్ ప్రాసెస్ చేయడానికి ముందే, వాటిలో ఏవైనా లోపాలుంటే గుర్తించడానికి సరికొత్తగా ఆటోమేటెడ్ ప్రీ-వ్యాలిడేషన్ విధానాన్ని కూడా నిర్వహిస్తారు.

ఇది పీఎఫ్ అప్లికేషన్ల రిజెక్షన్ రేటును స్లోగా తగ్గించి, ఖాతాదారులు అప్లై చేసిన మొదటిసారికే క్లెయిమ్ ఆమోదం పొందడానికి హండ్రెడ్ పర్సెంట్‌ తోడ్పడుతుంది.

మరోవైపు కేవైసీ పూర్తి చేసిన ఖాతాదారులకు ఈపీఎఫ్ఓ అడ్వాన్స్ క్లెయిమ్‌లను మనుషుల ప్రమేయం లేకుండా ఆటో-సెటిల్మెంట్ చేస్తోంది. కాగా, ఈ ఆటో-సెటిల్మెంట్ లిమిట్‌ను తాజాగా ఒక రూ. లక్ష నుంచి ఏకంగా రూ. 5 లక్షలకు పెంచడం పీఎఫ్ సభ్యులకు లభించిన అతిపెద్ద ఊరట అనే చెప్పాలి.

EPF

క్లెయిమ్ ప్రాసెసింగ్ సమయంలో అధికారులకు ఏవైనా వివరాలు లేదా ఇన్ఫో కావాల్సి వస్తే, ఆఫీసుల చుట్టూ తిరగకుండా డైరెక్టుగా ఆన్‌లైన్ ద్వారానే తమ సమాధానాలను ఖాతాదారులు అప్‌లోడ్ చేయొచ్చు. ఇకపై ఉద్యోగులు ఒక కంపెనీ నుంచి మరో కంపెనీకి జాబ్ మారినప్పుడు, వారి ఆధార్ కార్డుతో అనుసంధానమైన పీఎఫ్ అకౌంట్లు ఎటువంటి అభ్యర్థనలు లేకుండా ఆటోమేటిక్‌గానే కొత్త కంపెనీకి బదిలీ అయిపోతాయి.

దీంతో పాటు పాక్షిక విత్‌డ్రావల్ కండీషన్లను కూడా ప్రభుత్వం ఎంతో సరళీకరించింది. మీ పీఎఫ్(EPF) అకౌంట్ ఎక్కడ ఉన్నా కూడా దేశవ్యాప్తంగా ఎక్కడి నుంచైనా ఈపీఎఫ్ఓ అందించే డిజిటల్ సర్వీసులను క్లిక్‌తో పొందే అద్భుతమైన సదుపాయం ఇప్పుడు అందుబాటులోకి రావడం ఖాతాదారులకు నిజంగా పెద్ద శభవార్తే అవుతుంది.

Vitamin C : జామకాయ,ఆరెంజ్‌లో విటమిన్ సీ దేనిలో ఎక్కువ? ఈ రెండింటిలో అసలైన విన్నర్ ఎవరు?

Exit mobile version