Blueberries : జ్ఞాపకశక్తిని పెంచే సూపర్ ఫ్రూట్..బ్రెయిన్ పవర్, ఇమ్యూనిటీని ఒకేసారి పెరగాలంటే డైలీ తినాల్సిందే

Blueberries : నిజానికి బ్లూబెర్రీలు బాడీకి మేలు చేసే ఒక సూపర్ ఫుడ్‌గా గుర్తింపు పొందాయి. సైన్స్ పరంగా చూస్తే బ్లూబెర్రీలలో పవర్‌ఫుల్ యాంటీఆక్సిడెంట్లు, ముఖ్యంగా ఆంథోసయనిన్స్ అనే ప్రత్యేక మూలకాలు చాలా ఎక్కువగా లభిస్తాయి.

Blueberries

ఈ రోజుల్లో ఏజ్‌తో సంబంధం లేకుండా చాలా మందిలో జ్ఞాపకశక్తి తగ్గడం, ఏకాగ్రత లోపించడం అనేవి పెద్ద సమస్యగా మారాయి. చదువుకునే పిల్లలే కాదు పెద్దవాళ్లూ కూడా తమ బ్రెయిన్ షార్ప్‌గా పనిచేయాలనే అనుకుంటారు. దీనికోసం రకరకాల మందులు వాడాల్సిన అవసరం లేదని.. ప్రకృతి ప్రసాదించిన బ్లూబెర్రీలను రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చని తాజా అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి.

నిజానికి బ్లూబెర్రీలు(Blueberries) బాడీకి మేలు చేసే ఒక సూపర్ ఫుడ్‌గా గుర్తింపు పొందాయి. సైన్స్ పరంగా చూస్తే బ్లూబెర్రీలలో పవర్‌ఫుల్ యాంటీఆక్సిడెంట్లు, ముఖ్యంగా ఆంథోసయనిన్స్ అనే ప్రత్యేక మూలకాలు చాలా ఎక్కువగా లభిస్తాయి.

ఇవి మెదడు కణాలను ఆక్సిడేటివ్ డ్యామేజ్ లేదా ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుంచి ఒక కవచంలా రక్షించి, కణాల పనితీరును స్ట్రాంగ్ చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయి. డైలీ ఆహారంలో బ్లూబెర్రీలను భాగం చేసుకోవడం వల్ల జ్ఞాపకశక్తి పెరగడమే కాకుండా, ఆలోచనా సామర్థ్యం , ఫోకస్ కూడా పెరుగుతాయి.

అంతేకాదు వయసు పెరిగే కొద్దీ నేచురల్‌గా వచ్చే అల్జీమర్స్ లేదా మతిమరుపు వంటి తీవ్రమైన సమస్యలను ముందే అడ్డుకోవడంలో బ్లూబెర్రీస్ ఎఫెక్టివ్‌గా పనిచేస్తాయి. అంతేకాకుండా మెదడులో బ్లడ్ ప్రెషర్‌ను స్పీడప్ చేయడం ద్వారా బ్రెయిన్ ఎప్పుడూ అలసిపోకుండా యాక్టివ్‌గా ఉండేలా చేస్తాయి.

Blueberries

ఈ బ్లూ బెర్రీల(Blueberries) మరో స్పెషాలిటీ ఏంటంటే.. వీటిలో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. అలాగే బాడీకి అవసరమైన ఫైబర్, విటమిన్-సి, విటమిన్-కె వంటి పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి మెదడుకే కాకుండా బాడీలోని రెసిస్టెన్స్ పవర్‌ను పెంచి సీజనల్ వ్యాధుల నుంచి రక్షణ కల్పించడానికి బాగా ఉపయోగపడతాయి.

ఈ బ్లూబెర్రీలను కేవలం డైరెక్టుగా తినడమే కాకుండా స్మూతీలు, యోగర్ట్, ఓట్స్ లేదా ఫ్రూట్ సలాడ్‌లలో కలిపి తినొచ్చు. అయితే కేవలం బ్లూబెర్రీలపైనే పూర్తిగా డిపెండ్ అవకుండా, బ్యాలెన్స్‌డ్ డైట్, రోజూ రెగ్యులర్‌గా వ్యాయామం చేయడం , రాత్రి పూట సరైన నిద్ర వంటి హెల్దీ లైఫ్ స్టైల్‌ను పాటిస్తే మెదడు ఆరోగ్యం మరింత పదిలంగా ఉంటుంది.

Date Of Birth : ఈరోజు ఏ నెంబర్ వారికి కెరీర్‌లో బ్రేక్ త్రూ లభిస్తుంది? ఎవరికి ఖర్చులు పెరుగుతాయి?

Exit mobile version