Gold Prices
గోల్డ్ కొనాలని ప్లాన్ చేసుకుంటున్న వాళ్లకు ఈరోజు అంటే మే 23న కూడా శుభవార్త అందింది. శుక్రవారం రోజు తగ్గుదలతో హ్యాపీగా ఉన్న కొనుగోలుదారులు.. ఈరోజు కూడా మార్కెట్‌లో పసిడి రేట్లు(Gold Prices) భారీగా పడిపోవడంతో ఖుషీ అవుతున్నారు.
అంతర్జాతీయ బులియన్ మార్కెట్‌లో ఒడిదొడుకులు ఉన్నా సరే.. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ బాగా పుంజుకోవడంతోనే.. దేశీయంగా పసిడి ధరలు ఇలా కుప్పకూలడానికి ప్రధాన కారణమని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. బంగారం కొనాలనుకున్నవారికి ఇది ఒక పర్ఫెక్ట్ టైమ్ అనే చెప్పాలి.
హైదరాబాద్, అలాగే బెంగళూరు నగరాల విషయానికి వస్తే.. ఇవాళ ఈ రెండు చోట్లా ధరలు ఒకేలా ఉన్నాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ ధర రూ. 430 పతనమై ప్రస్తుతం రూ. 1లక్ష 59వేల 060 దగ్గర నడుస్తోంది. అలాగే సామాన్యులు ఎక్కువగా కొనుగోలు చేసే 22 క్యారెట్ల ఆర్నమెంట్ గోల్డ్ రేటు కూడా తులంపై రూ.400 తగ్గి రూ.1లక్ష 45వేల 800 వద్ద ట్రేడ్ అవుతోంది. నిన్నటితో పోలిస్తే ఈ రెండు నగరాల్లోనూ బంగారం కొద్దిగా చౌకైందని చెప్పొచ్చు.
ఇక ఎప్పుడూ రేట్లు ఎక్కువగా ఉండే చెన్నైలో అయితే ఈరోజు బంగారం ధరలు ఇంకా భారీగా పడిపోయాయి. అక్కడ 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర ఏకంగా రూ. 550 పతనమై ఇప్పుడు రూ. 1లక్ష 60వేల 690 కి చేరుకుంది. అలాగే 22 క్యారెట్ల గోల్డ్ ధర కూడా శుక్రవారం కంటే రూ. 500 తగ్గి రూ. 1లక్ష 47వేల300 వద్ద కొనసాగుతోంది. దేశ రాజధాని ఢిల్లీలో కూడా ఇదే ట్రెండ్ నడిచింది. అక్కడ 24 క్యారెట్ల పుత్తడి ధర రూ. 430 తగ్గి రూ. 1లక్ష 59వేల210 కి పడిపోగా..22 క్యారెట్ల బంగారం రేటు రూ. 300 మేర తగ్గి రూ. 1లక్ష 45వేల 950 వద్ద కొనసాగుతోంది.
గోల్డ్ ధరలు ఇలా వరుసగా తగ్గుతుంటే .. సిల్వర్ మాత్రం ఈరోజు ఎలాంటి మార్పు లేకుండా శుక్రవారం ధరల వద్దే స్థిరంగా కొనసాగుతోంది. హైదరాబాద్, చెన్నైలో కిలో సిల్వర్ ధర రూ. 2 లక్షల 95 వేల మార్కు వద్ద కొనసాగుతుంది. ఇక దేశ రాజధాని ఢిల్లీ, అలాగే బెంగళూరులో కేజీ వెండి ధర రూ. 2 లక్షల 85వేల వద్ద స్థిరంగా ఉంది. బంగారం రేట్లు ఇలా వరుసగా తగ్గడంతో జనాలు జ్యువెలరీ షాపులకు వెళ్లడానికి ఆసక్తి చూపిస్తున్నారు.
Petrol : నెల రోజుల్లోనే మూడోసారి పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు..ధరల అదుపులో ప్రభుత్వ బాధ్యత లేదా?
