Petrol : నెల రోజుల్లోనే మూడోసారి పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు..ధరల అదుపులో ప్రభుత్వ బాధ్యత లేదా?
Petrol : దేశానికి కావలసిన ముడిచమురులో సుమారు 85 శాతం విదేశాల నుంచే దిగుమతి చేసుకుంటాం కాబట్టి, అక్కడ రూపాయి పెరిగినా ఆ ప్రభావం డైరెక్టుగా మన బంకులపై పడుతుంది.
Petrol
దేశంలో వాహనదారులకు మరోసారి గట్టి చిల్లు పడింది. సామాన్య ప్రజలను బెంబేలెత్తిస్తూ పెట్రోల్(Petrol ), డీజిల్ ధరలు శనివారం ఉదయం నుంచే మళ్లీ పెరిగాయి. ఈసారి పెట్రోల్ లీటర్‌పై 94 పైసలు పెంచగా, డీజిల్ లీటర్‌పై 96 పైసల వరకూ పెంచారు.
ఈ నెల ప్రారంభమైనప్పటి నుంచి ఇంధన ధరలు పెరగడం దీంతో మూడోసారి కావడంతో జనాలు లబోదిబోమంటున్నారు. ఒకేసారి కాకుండా ఇలా విడతల వారీగా రేట్లు పెంచుకుంటూ పోతుండటంతో నెల తిరిగేసరికి లీటర్ పై సుమారు 5 రూపాయల వరకు అదనపు భారం పడిందని వాహనదారులు ఆందోళన చెందుతున్నారు.
కాగా పశ్చిమాసియా దేశాలలో యుద్ధ వాతావరణం వల్ల ఏర్పడిన ఉద్రిక్తతలతో ప్రపంచవ్యాప్తంగా ముడిచమురు క్రూడ్ ఆయిల్ రేట్లు విపరీతంగా పెరుగుతున్నాయి. భారత దేశానికి కావలసిన ముడిచమురులో సుమారు 85 శాతం విదేశాల నుంచే దిగుమతి చేసుకుంటాం కాబట్టి, అక్కడ రూపాయి పెరిగినా ఆ ప్రభావం డైరెక్టుగా మన బంకులపై పడుతుంది.
దీనికి తోడు అంతర్జాతీయంగా రేట్లు పెరగడంతో మన దేశీయ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు నెలకు సుమారు వెయ్యి కోట్ల రూపాయల వరకు నష్టాలు వస్తున్నట్లు తెలుస్తోంది. ఆ నష్టాన్ని ఇప్పుడు పూడ్చుకోవడానికే ఆయిల్ కంపెనీలన్నీ ఇలా ధరలను సవరిస్తున్నాయి. ఈ నెల మొదట్లో లీటర్‌కు 3 రూపాయలు పెంచిన కంపెనీలు, ఆ తర్వాత మే 19న మరో 90 పైసలు, ఇప్పుడు తాజాగా మరో 95 పైసల వరకు పెంచి సామాన్యుడిపై భారాన్ని మోపుతున్నాయి.
పెంచిన భారంతో హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్(Petrol) ధర రూ.112.84 కు చేరగా, డీజిల్ ధర రూ.100.94కు పెరిగింది. అయితే కొన్ని ప్రాంతాలు, బంకులను బట్టి పెట్రోల్ ధర రూ.111.84గా కూడా చూపిస్తోంది. ఏది ఏమైనా పెట్రోల్ 110 దాటి, డీజిల్ వంద మార్కును దాటడం అనేది సామాన్యుడి బడ్జెట్‌ను పూర్తిగా తలకిందులు చేసే విషయమే.
కేవలం పెట్రోల్(Petrol), డీజిల్ మాత్రమే కాకుండా సీఎన్జీ (CNG) ధరను కూడా కిలోపై రూపాయి చొప్పున పెంచేశారు. పది రోజుల్లోనే సీఎన్జీ రేటు పెరగడం కూడా ఇది మూడోసారి . దీనివల్ల సీఎన్‌జీనే నమ్ముకుని బతికే ఆటోలు, క్యాబ్‌లు, డెలివరీ వాహనాల యజమానులు నష్టపోతున్నారు.

నిజానికి ఇంధన ధరలు పెరగడమంటే కేవలం బండిలో పోయించే పెట్రోల్, డీజిల్ ఖర్చు పెరగడం మాత్రమే కాదు. డీజిల్ రేట్లు పెరిగితే సరుకు రవాణా చార్జీలు కూడా భారీగా పెరుగుతాయి. దాంతో మార్కెట్లో కూరగాయలు, పప్పులు, నిత్యావసర సరుకుల ధరలన్నీ కూడా ఆటోమేటిక్‌గా ఆకాశాన్ని తాకుతాయి. ఆఫీసులకు వెళ్లే వాళ్లకు ఆటో, క్యాబ్ చార్జీల భారం కూడా తోడవుతుంది.
ఇలాంటి పరిస్థితుల్లో ఇంధన ధరల ప్రభావం.. నిత్యావసర వస్తువులపై పడకముందే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పన్నుల విధానాన్ని సమీక్షించాల్సిన అవసరం ఉంది. అలాగే ట్రాన్స్పోర్ట్ రంగాన్ని ఆదుకోవడానికి, పర్యావరణాన్ని కాపాడటానికి ఈవీ (ఎలక్ట్రిక్), హైబ్రిడ్ వెహికల్స్‌కు ఇచ్చే ప్రోత్సాహకాలను పెంచాలి. మెట్రో, సిటీ బస్సులు, రైలు వంటి ప్రజా రవాణా వ్యవస్థలను పెంచితే సామాన్యుడికి కొంత ఊరట దొరుకుతుంది.
Water:వెయిట్ తగ్గాలంటే వేడినీళ్లు తాగాలా? చన్నీళ్లు తాగాలా? దీని గురించి నిపుణులు ఏమంటున్నారు.





