Indian Railways : మిడిల్ బెర్త్ బుక్ చేసుకున్నారా ?…ఈ రూల్స్ ఫాలో అవ్వాల్సిందే

Indian Railways : సాధారణ ఖర్చుతో దూరప్రాంతాలకు వెళ్లాలంటే అత్యుత్తమైన మార్గం ట్రైన్ మాత్రమే. దీనిలో అన్ని వర్గాలకు చెందిన వారు ప్రయాణిస్తుంటారు

Indian Railways

సాధారణ ఖర్చుతో దూరప్రాంతాలకు వెళ్లాలంటే అత్యుత్తమైన మార్గం ట్రైన్ మాత్రమే. దీనిలో అన్ని వర్గాలకు చెందిన వారు ప్రయాణిస్తుంటారు. ఫస్ట్ క్లాస్ ఏసీ నుంచి జనరల్ బోగీ వరకూ ఎప్పుడూ కిటకిటలాడుతూనే ఉంటాయి. అధికారిక వర్గాల సమాచారం ప్రకారం ప్రతీరోజూ భారతీయ రైల్వేలో(Indian Railways) సుమారు 2 కోట్ల మంది ప్రయాణిస్తున్నారు.

అయితే దీనిలో ప్రయాణించేటప్పుడు పలు నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. ముఖ్యంగా బెర్తులు, కన్ఫర్మ్ అయినా కూడా రైల్వే శాఖ నియామాలను అనుసరించాల్సిందే. బోగీలో ఉండే అప్పర్ బెర్త్ , మిడిల్ బెర్త్ , లోయర్ బెర్తులకు సంబంధించి కొన్ని రూల్స్ ఉన్నాయి. తాజాగా మిడిల్ బెర్తుకు సంబంధించి నియమాలను ఖచ్చితంగా అమలు చేస్తున్నారు.

ఈ రూల్స్ పాటించకపోతే మీకు కూడా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశముంది. ఎందుకంటే మిడిల్ బెర్త్ ను చాలా మంది ఎంపిక చేసుకుంటారు. బెర్త్ దక్కిన వారు నిద్రపోవడానికి అనువైన బెర్త్ ఇదే. అయితే ఈ బెర్త్ లో రోజు మొత్తం పడుకోవాలనుకుంటే మాత్రం కుదరదు.

ఎందుకంటే ఈ బెర్త్ వరకూ కొన్ని రూల్స్ ఉన్నాయి. దీని ప్రకారం కింది బెర్తులోని ప్రయాణికులు సౌకర్యవంతంగా కూర్చోవడానికి వీలుగా పగటిపూట మిడిల్ బెర్త్ ను మడిచి ఉంచాలి. రైల్వే బోర్డు సర్క్యులర్ నెం. 60, 2017 ప్రకారం రిజర్వ్డ్ కోచ్ లలో నిద్రపోయే సమయం రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకూ మాత్రమే ఉంటుంది.

Indian Railways

మిగిలిన సమయంలో మిడిల్ బెర్త్ మడిచే ఉంచాలి. దీనిపై ఇతర ప్రయాణికులతో వాగ్వాదానికి దిగినా, నిబంధనలు పాటించకున్నా రైల్వే శాఖ(Indian Railways ) అధికారులు సదరు ప్రయాణికులపై చర్యలు తీసుకునేందుకు అధికారం ఉంది. ఒకవేళ మీకు ఇలాంటి పరిస్థితి ఎదురైనా కూడా టీటీఈకి వెళ్లి ఫిర్యాదు చేయొచ్చు.

లేదంటే రైల్వే హెల్ప్ లైన్ 139కు కాల్ చేసి సమస్యను వివరించవచ్చు. దీనిపై అధికారులు కూడా వెంటనే స్పందిస్తారు. మిడిల్ బెర్త్ రూల్స్ అనుసరించని సదరు వ్యక్తిని హెచ్చరించడం, కొన్ని సందర్భాల్లో జరిమానా విధించడం జరుగుతుంది.అయితే గర్భిణీలు, వృద్ధులు , శారీరక సమస్యలతో ఇబ్బందిపడే వారికి అరుదైన పరిస్థితుల్లో మినహాయింపు ఇచ్చే అధికారం కూడా రైల్వే శాఖకు ఉంటుంది. ఇక రాత్రి వేళ 10 గంటల తర్వాత లైట్లు ఆఫ్ చేయాలి.

America Iran War :తీవ్రరూపం దాల్చిన యుద్ధం…అమెరికాకు ఇరాన్ కౌంటర్ కండీషన్లు

Exit mobile version