IMD Report : ఈశాన్య రుతుపవనాలపై ఐఎండీ రిపోర్ట్.. అక్టోబర్ – డిసెంబర్ వరకు పొడి వాతావరణమేనట..

IMD Report : అక్టోబర్ నుంచి డిసెంబర్ కాలానికి ఐఎండీ అధికారులు అందించిన అంచనాలు మరింత ఆందోళనను కలిగిస్తున్నాయి.

IMD Report

నైరుతి రుతుపవనాలు ముగింపునకు వచ్చినా కూడా దేశవ్యాప్తంగా వర్షాలు కురవకపోవడంతో.. రైతన్న తీవ్ర నిరాశలో మునిగిపోయాడు. సరిగ్గా ఇదే సమయంలో భారత వాతావరణ శాఖ (ఐఎండీ)(IMD Report) మరో హెచ్చరిక జారీ చేసింది.

ఈ ఏడాది నైరుతి సీజన్‌లో రికార్డయిన వర్షపాతం 1901 నుంచి చూస్తే ఏకంగా 13వ అత్యల్ప వర్షపాతంగా నమోదయిందని వెల్లడించింది. అంతేకాదు.. ఈ అక్టోబర్ నెలలో కూడా వర్షాభావ పరిస్థితులే కొనసాగుతాయని, రాత్రి, పగలు టెంపరేచర్స్ సాధారణం కంటే భారీగా పెరిగి ఉక్కపోత బాగా పెరుగుతుందని తేల్చి చెప్పింది.

వాతావరణ నిపుణుల విశ్లేషణ ప్రకారం చూస్తే.. పసిఫిక్ మహాసముద్రంలో బలపడుతున్న ఎల్‌నినో ఎఫెక్ట్ పడటమే ఈ దారుణమైన పరిస్థితికి ప్రధాన కారణమని తెలుస్తోంది. జూన్ 1వ తేదీ నుంచి సెప్టెంబర్ 30వ తేదీ వరకు సాగిన నైరుతి కాలంలో.. భారత దేశంలో నమోదైన వర్షపాతం దీర్ఘకాలిక సగటులో కేవలం 87 శాతమేనని వాతావరణ శాఖ తెలిపింది.

మొత్తం 759.4 మిల్లీమీటర్ల వర్షపాతం పడగా, ఇది 2001 తర్వాత 4వ అత్యల్పంగా రికార్డయింది. ఇక తూర్పు, ఈశాన్య భారతంలో కేవలం 1016.3 మిల్లీమీటర్లు పడి 125 ఏళ్ల చరిత్రలోనే ఆల్ టైమ్ లోయెస్ట్ వర్షపాతం నమోదయింది. దక్షిణ భారతదేశంలో 542 మిల్లీమీటర్లు కురిసి 2001 తర్వాత 2వ అత్యల్పంగా నిలిచింది.

మాన్సూన్ కోర్ జోన్‌లో 779.9 మిల్లీమీటర్ల వర్షపాతం మాత్రమే పడగా, దేశంలోని 36 వాతావరణ సబ్ డివిజన్లలో 17 చోట్ల బాగా లోటు ఏర్పడింది. ఒక్క ఒడిశాలో మాత్రమే సాధారణం కంటే కాస్త ఎక్కువ వర్షపాతం నమోదయింది. జూన్ నెలలో ఒక్క అల్పపీడనం కూడా ఏర్పడకపోవడం తొలి దశలోనే కోలుకోలేని దెబ్బ తీసినట్లు వాతావరణ శాఖ తెలిపింది.

అక్టోబర్ నుంచి డిసెంబర్ కాలానికి ఐఎండీ అధికారులు అందించిన అంచనాలు మరింత ఆందోళనను కలిగిస్తున్నాయి. అక్టోబర్‌లో వాయువ్య, దక్షిణ ద్వీపకల్పం, తూర్పు భారతదేశంలోని కొన్ని ప్రాంతాలు తప్ప మిగిలిన దేశమంతా పొడి వాతావరణమే ఉంటుందని తేలింది.

IMD Report

అయితే కోస్తాంధ్ర, రాయలసీమ, తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ, కర్ణాటకలో అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు సాధారణ వర్షపాతం పడే ఛాన్స్ ఉండటం కాస్త ఊరట కలిగించే విషయంగా కనిపిస్తోంది. మిగిలిన భారతదేశంలో మాత్రం రికార్డు స్థాయిలోనే ఉష్ణోగ్రతలు పెరగనున్నాయి.

తెలంగాణలో అక్టోబర్‌తో పాటు ఈ సీజన్ మొత్తంలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదవుతుందని టెర్సైల్ మ్యాప్స్ చెబుతున్నాయి. వర్షాలు లేకపోవడం ఒక్కటే కాదు వీటికి తోడు ఉక్కపోత, ఎండ తీవ్రత పెరగనుంది. దీంతో తాగునీరు, సాగునీటి రంగాలపై చాలా ఎక్కువ ప్రభావం(IMD Report) పడే ప్రమాదం కనిపిస్తోంది.

BC Reservations : బీసీ రిజర్వేషన్లపై లీగల్ వార్..హైకోర్టు తీర్పుపై సుప్రీంకు ఏపీ ప్రభుత్వం..

↑
Exit mobile version