India Nutrition : కడుపు నిండుతోంది కానీ పోషకాలు ఉన్నాయా? .. ఐక్యరాజ్యసమితి నివేదికలో షాకింగ్ నిజాలు

India Nutrition : గతేడాది 645 మిలియన్ల మంది అంటే 64 కోట్ల 50 లక్షల మంది ఆకలితో అలమటించగా, ఆసియా ప్రాంతంలో భారతదేశం సాధించిన ప్రగతే ఈ మార్పుకు ప్రధాన కారణంగా చెప్పొచ్చు

India Nutrition

భారత్‌లో కోట్లాది మంది కడుపు నిండా తింటున్నా కూడా.. వారి పళ్లెంలో మాత్రం తగినన్ని పోషకాలు ఉండటం లేదని.. ఐక్యరాజ్యసమితి రిలీజ్ చేసిన స్టేట్ ఆఫ్ ఫుడ్ సెక్యూరిటీ అండ్ న్యూట్రిషన్ ఇన్ ది వరల్డ్ (SOFI) 2026 నివేదిక తెలియజేసింది. రెండు దశాబ్దాల్లో ఆకలి కేకలను తగ్గించడంలో భారత్ మైండ్ బ్లోయింగ్ ప్రోగ్రెస్‌ను సాధించింది. కానీ, విపరీతంగా పెరిగిపోయిన ఆహార వ్యయం వల్ల ఇప్పటికీ కూడా సగానికి పైగా జనాభాకు హెల్దీ డైట్ అందుబాటులోకి రావడం లేదని వివరించింది.

ఈ రిపోర్ట్‌లోని లెక్కలు చూస్తే 2 వేర్వేరు చిత్రాలు కనిపిస్తాయి. 20 ఏళ్లలో భారత దేశంలో పోషకాహార లోపంతో బాధపడుతున్న వారి సంఖ్య సుమారు 42 శాతం పడిపోయింది. ప్రభుత్వ సంక్షేమ పథకాలే దీనికి ముఖ్య కారణం. అలాగే, 2019 నుంచి 2025 మధ్య కాలంలో పౌష్టికాహారాన్ని కొనలేనివారి సంఖ్య 29 శాతం తగ్గింది. అయినా సరే ఇప్పటికీ ఏకంగా 520 మిలియన్ల మంది అంటే 52 కోట్ల మంది రోజూ తగినన్ని పోషకాలున్న ఆహారాన్ని కొనుక్కుని తినలేకపోతున్నారు. .

ఇక్కడ సమస్య ఆకలి తీరకపోవడం కాదు, పోషకాలు(India Nutrition) దక్కకపోవడమేనని రిపోర్ట్ వివరిస్తోంది. ఈ ఆరేళ్లలో భారత్‌లో హెల్దీ ఫుడ్ కాస్ట్ ఏకంగా ఒక మూడో వంతుకు పైగా పెరిగింది. కొనుగోలు శక్తి ప్రకారం రోజుకు ఒక వ్యక్తికి సుమారు 4.11 డాలర్లు అంటే దాదాపు రూ. 340 నుంచి రూ. 350 రూపాయలు ఖర్చవుతోంది. దీంతో సామాన్యులు కేవలం బియ్యం, గోధుమలతోనే కడుపు నింపుకుంటున్నారు తప్ప పండ్లు, కూరగాయలు, పప్పుధాన్యాలు, ప్రొటీన్ ఉండే ఆహారానికి ఖర్చు చేయలేకపోతున్నారు. మార్కెట్‌లో ఊహించని రేట్లతో లభించే పోషకాహారానికి బదులు తక్కువ ధరకు వచ్చే సాధారణ తిండికే ఓటేస్తున్నారు.

మరోవైపు భారత్‌ను(India Nutrition) మరో వింత సమస్య వేధిస్తోంది. ఒకవైపు ఇంకా పోషకాహార లోపంతో చాలామంది బాధపడుతుంటే.. మరోవైపు జంక్ ఫుడ్ సంస్కృతితో పెరిగే ఊబకాయంతో మరికొంతమంది సఫర్ అవుతున్నారు. 2024 నాటికి ఐదేళ్లలోపు ఉన్న చిన్న పిల్లలలో ఎదుగుదల లోపం 32.9 శాతానికి తగ్గడం ఊరటనిచ్చే విషయమే. అయితే, అదే సమయంలో ఓవర్ వెయిట్ ఉన్న పిల్లల శాతం 2.1 నుంచి 3.7 శాతానికి పెరిగింది. ఇక పెద్దవారిలో అయితే ఈ స్థూలకాయం శాతం ఏకంగా రెట్టింపు అయింది.

వరల్డ్ వైడ్‌గా చూస్తే భారత్ సాధించిన ఈ రిజల్ట్ గ్లోబల్ ట్రెండ్‌ను మార్చేశాయి. మూడేళ్లుగా ప్రపంచవ్యాప్తంగా ఆకలి సమస్య మెల్లగా తగ్గుతూ వస్తోంది. గతేడాది 645 మిలియన్ల మంది అంటే 64 కోట్ల 50 లక్షల మంది ఆకలితో అలమటించగా, ఆసియా ప్రాంతంలో భారతదేశం సాధించిన ప్రగతే ఈ మార్పుకు ప్రధాన కారణంగా చెప్పొచ్చు.

India Nutrition

అయినా సరే, 2030 నాటికి ‘జీరో హంగర్’ టార్గెట్ సాధించడం అంత ఈజీ అయిన విషయం కాదు. గ్లోబల్‌గా ఇంకా 2.69 బిలియన్ల మందికి హెల్దీ డైట్ అందుబాటులో లేదు. దీనికితోడు అకాల వర్షాలు, ఎల్‌నినో భయాలు, ప్రపంచ యుద్ధాలు వంటివి ఆహార భద్రతను దెబ్బతీసేలా కనిపిస్తూనే ఉన్నాయి. ప్రభుత్వాలు ఇప్పటి నుంచే ప్లానింగ్ చేయకపోతే పరిస్థితి మొదటికి వచ్చే ప్రమాదం ఉంది.

Lemon Water : లెమన్ వాటర్ తాగితే బరువు తగ్గరట..ఇలా అస్సలు తాగకూడదట..

Exit mobile version