Lemon Water : లెమన్ వాటర్ తాగితే బరువు తగ్గరట..ఇలా అస్సలు తాగకూడదట..
Lemon Water : లెమన్ వాటర్ తాగితే బరువు తగ్గిపోతామని, బాడీ మొత్తం డిటాక్స్ అయిపోతుందంటూ వినిపిస్తున్న ప్రచారాలకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు.
Lemon Water
ఉదయం పడుకుని లేచిన వెంటనే అంటే పరగడుపునే చాలామంది గోరువెచ్చని నీటిలో నిమ్మరసం పిండుకుని తాగుతూ ఉంటారు. ఇలా చేయడం వల్ల బాడీకి తగినంత హైడ్రేషన్, విటమిన్- సి లభిస్తాయి. కానీ ఈ అలవాటు అందరికీ సెట్ కాదంటున్నారు ఆరోగ్యనిపుణులు.
ముఖ్యంగా కొన్ని రకాలైన ఆరోగ్య సమస్యలతో బాధపడేవారు ఖాళీ కడుపుతో నిమ్మరసం(Lemon Water) కలిపిన నీరు తాగితే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందట. పైగా లెమన్ వాటర్ తాగితే బరువు తగ్గిపోతామని, బాడీ మొత్తం డిటాక్స్ అయిపోతుందంటూ వినిపిస్తున్న ప్రచారాలకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని నిపుణులు కొట్టిపడేస్తున్నారు.
ఎందుకంటే నిమ్మరసంలో సిట్రిక్ యాసిడ్ మోతాదు చాలా ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల గ్యాస్ట్రిక్ రిఫ్లక్స్ (GERD), అసిడిటీ, గ్యాస్ట్రైటిస్ సమస్యలు ఉన్నవారు పరగడుపున లెమన్ వాటర్ తాగినప్పుడు గుండెల్లో మంట, కడుపులో అసౌకర్యం మరింత ఎక్కువయ్యే ఛాన్స్ ఉంటుంది.
అంతేకాదు డైలీ రెగ్యులర్గా నిమ్మరసం తాగడం వల్ల అందులోని ఆమ్లత్వం వల్ల మన దంతాల పైపొర అయిన ఎనామెల్ మెల్లగా అరిగిపోతుంది. దీంతో దంతాలు చల్లటి, వేడి పదార్థాలకు విపరీతమైన సున్నితత్వానికి (సెన్సిటివిటీ) గురవుతాయి. పైగా తెలుపు రంగును కోల్పోయి గార పట్టినట్లుగా టీత్స్ కనిపిస్తాయి.
అంతేకాదు నోటిలో పుండ్లు, చిన్న చిన్న గాయాలున్నవారు ఎవరైనా సరే నిమ్మరసం తాగితే నోటిలో విపరీతమైన మంట పుడుతుంది. అలాగే సెన్సిటివ్ కడుపు ఉన్నవారికి ఇది తాగిన వెంటనే వికారం, కడుపు ఉబ్బరంగా అనిపించొచ్చు. అలాంటి వారు ఖాళీ కడుపుతో కాకుండా భోజనం చేశాక తీసుకోవడం మంచిది. అంతేకాకుండా బీపీ, షుగర్ వంటి దీర్ఘకాలిక వ్యాధులకు రోజూ మందులు వాడేవారు, రోజూ నిమ్మరసం తీసుకునే ముందు ఒకసారి డాక్టర్ను సంప్రదించడం మంచిది.

ఒకవేళ లెమన్ వాటర్(Lemon Water) డైలీ తాగాలనుకుంటే కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ఒక గ్లాసు నీటిలో అర చెక్క నిమ్మరసం మాత్రమే కలపాలి. అలాగే దంతాలపై యాసిడ్ ప్రభావం పడకుండా ఉండటానికి స్ట్రా ఉపయోగించి తాగడం మంచిది. నిమ్మరసం తాగాక నోటిని సాధారణ నీటితో పుక్కిలించాలి. బ్రష్ చేయాలనుకుంటే.. లెమన్ వాటర్ తాగిన వెంటనే పళ్లను తోముకోకుండా కనీసం ఒక అర గంట ఆగి చేసుకోవాలి.
నిజానికి నిమ్మరసం వల్ల శరీరానికి నీటి శాతంతో పాటు విటమిన్ సి బాగా అందుతుంది. కూల్డ్రింక్స్, షుగర్ ఉన్న డ్రింక్స్ తాగే బదులు దీన్ని తాగడం మంచి ప్రత్యామ్నాయమే. అయితే కేవలం నిమ్మనీరు తాగినంత మాత్రాన బరువు తగ్గిపోవడం, బాడీ శుభ్రపడటం లాంటి అద్భుతాలేమీ జరగవు. అసిడిటీ, నోటి పుండ్లు, దంతాల సమస్యలున్నవారు పరగడుపున కాకుండా వేరే సమయంలో తీసుకుంటే మంచిది.
Samsung Galaxy Z Flip 8 : ట్రెండీ లుక్తో అదుర్స్..మార్కెట్లో క్రేజీగా శాంసంగ్ ఫ్లిప్ ఫోన్లు





