ITR Filling
ఇన్కమ్ టాక్స్ పేయర్స్‌కు ఆదాయపు పన్ను డిపార్ట్‌మెంట్ ఒక ముఖ్యమైన అలర్ట్ ఇచ్చింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి అంటే అసెస్మెంట్ ఇయర్ 2026-27 సంబంధించి.. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 1.7 కోట్లకు పైగా ఆదాయపు పన్ను రిటర్న్స్ (ITR) ఫైల్ అయినట్లు ఐటీ శాఖ వెల్లడించింది.
రోజురోజుకూ ఐటీఆర్ ఫైల్ చేసే వారి సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. కేవలం ఒక్క శుక్రవారం రోజే 10 లక్షల మందికి పైగా ట్యాక్స్ పేయర్స్ తమ రిటర్న్స్‌ను ఆన్‌లైన్ ద్వారా సబ్మిట్ చేశారు. లాస్ట్ మినిట్స్‌లో సర్వర్ ప్రాబ్లమ్స్, నెట్‌వర్క్ రష్ వంటి ఇబ్బందులు పడకుండా ఉండటానికి ట్యాక్స్ పేయర్స్ అంతా ఇప్పుడే స్మార్ట్ నిర్ణయం తీసుకుని తమ ఐటీఆర్‌ను ఫైల్ చేయాలని ఆదాయపు పన్ను శాఖ సోషల్ మీడియా వేదికగా కోరింది.
మీరు 2025-26 ఫైనాన్స్ ఇయర్‌లో సంపాదించిన ఆదాయానికి ఐటీఆర్(ITR Filling) ఫామ్ 1, ఫామ్ 2 ఫైల్ చేయడానికి ఈ నెల, అంటే జూలై 31 లాస్ట్ డేట్‌గా నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి ఎలాంటి అదనపు పెనాల్టీలు పడకుండా ఉండాలంటే జూలై 31 లోపు మీ ఐటీఆర్ ఫైలింగ్‌ను కంప్లీట్ చేసుకోవాలి.
ట్యాక్స్ పేయర్స్ తమ ఆదాయ వనరులను బట్టి కరెక్ట్ ఫామ్‌ను సెలక్ట్ ఫైల్ చేయాల్సి ఉంటుంది. ఎవరి వార్షిక ఆదాయం అయితే రూ. 50 లక్షల లోపు ఉంటుందో, అలాగే జీతం, ఒక ఇల్లు, ఇంకా ఏడాదికి రూ.5,000 లోపు వ్యవసాయ ఆదాయం కలిగి ఉంటారో వారు ఐటీఆర్ ఫామ్-1 (సహజ్) ద్వారా రిటర్న్స్ ఫైల్ చేయొచ్చు.
ఒకవేళ బిజినెస్ లేదా వృత్తిపరమైన లాభాలు కాకుండా, షేర్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్ లేదా ఆస్తుల అమ్మకం వంటి ద్వారా క్యాపిటల్ గెయిన్స్ పొందిన వ్యక్తులు, హిందూ అన్ డివిడెడ్ ఫ్యామిలీలు (HUF) ‘ఐటీఆర్ ఫామ్-2’ ను ఉపయోగించి తమ ట్యాక్స్ రిటర్న్స్‌ను సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.
లాస్ట్ డేట్ వరకు వెయిట్ చేసి హడావుడిగా చేసే బదులు..ఇప్పుడు మీ ఫామ్ 16, ఇతర ఆదాయ వివరాల ఆధారంగా లేట్ చేయకుండా ఫైలింగ్ ప్రాసెస్ పూర్తి చేయడం మంచిదని నిపుణులు సలహా ఇస్తున్నారు.
Instagram : ఇన్‌స్టాగ్రామ్‌లో మెటా ఏఐ ప్రయోగం ఫ్లాప్.. మ్యూజ్ ఇమేజ్ టూల్ క్లోజ్
