Jantar Mantar : జంతర్‌మంతర్‌ ఇక హిస్టరీలో కలిసిపోతుందా? నిరసనల అడ్డాను పోలీసులు ఎందుకు మార్చేశారు?

Jantar Mantar : జంతర్‌మంతర్‌ను లిస్ట్ నుంచి తీసేసిన పోలీసులు..ప్రొటెస్ట్‌లు చేసుకోవడానికి మరో మూడు ప్రదేశాలను కొత్తగా సూచించారు.

Jantar Mantar

దేశ రాజధాని ఢిల్లీలో దశాబ్దాలుగా ఎన్నో ఉద్యమాలు,మరెన్నో ఆందోళనలకు అడ్డాగా మారిన జంతర్‌మంతర్‌(Jantar Mantar) పేరు ఇక చరిత్ర పాఠాలలోనే వినాల్సి వస్తుందేమో. ఎవరికీ ఊహించని విధంగా ఢిల్లీ పోలీసులు .. దశాబ్దాల చరిత్ర ఉన్న జంతర్‌మంతర్‌ను అధికారిక నిరసన ప్రదేశాల లిస్ట్‌ నుంచి శాశ్వతంగా తొలగిస్తున్నట్లు సంచలన ప్రకటనను రిలీజ్ చేశారు.

అయితే నిరసనలు, ఆందోళనల వల్ల రోజూ ట్రాఫిక్ జామ్‌లతో సామాన్య ప్రజలు పడుతున్న ఇబ్బందులు, వీఐపీ మూవ్‌మెంట్‌కు అడ్డుకట్ట వేయడమే ఈ పెద్ద నిర్ణయం వెనక మెయిన్ రీజన్ అని తెలుస్తోంది.

అయితే జంతర్‌మంతర్‌(Jantar Mantar)ను లిస్ట్ నుంచి తీసేసిన పోలీసులు, ప్రొటెస్ట్‌లు చేసుకోవడానికి మరో మూడు ప్రదేశాలను కొత్తగా సూచించారు. ఇకపై ఎవరైనా సరే, నిరసన కార్యక్రమాలు, ఆందోళనలు చేయాలనుకుంటే సెంట్రల్ ఢిల్లీలోని రామ్‌లీలా మైదాన్, నార్త్ ఢిల్లీలోని బురారీ మైదాన్, అలాగే ఈస్ట్ ఢిల్లీలోని సీబీడీ గ్రౌండ్‌లను మాత్రమే ఉపయోగించుకోవాలని పోలీసులు స్పష్టం చేశారు.

ఢిల్లీలో శాంతిభద్రతలను కాపాడటానికి అలాగే.. సామాన్యులకు వీటి వల్ల ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉంచడానికే ఈ ప్లాన్ అమలులోకి తెచ్చినట్లు అధికారులు చెబుతున్నారు.

అయితే ఈ కొత్త నిరసన ప్రదేశాలు నిరసనకారులకు మైనస్ అవుతుందన్న వాదన వినిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ధర్నాలు నిర్వహించే జంతర్‌మంతర్‌(Jantar Mantar) పార్లమెంట్, కీలక ప్రభుత్వ కార్యాలయాలకు అతి దగ్గరలో ఉండటం వల్ల ఎవరైనా సరే అక్కడ నిరసన చేస్తే డైరెక్టుగా..ఢిల్లీ ప్రభుత్వ పెద్దల దృష్టికి, మీడియా కవరేజ్‌కి ఈజీగా ఉండేది.

Jantar Mantar

కానీ ఇప్పుడు పోలీసులు కొత్తగా కేటాయించిన బురారీ, సీబీడీ గ్రౌండ్ వంటి ప్రాంతాలు సిటీకి చాలా దూరంగా.. శివారు ప్రాంతాల్లో ఉన్నాయి. దీనివల్ల మీడియా కవరేజ్ తగ్గిపోవడంతో పాటు జనసంచారం తక్కువగా ఉండటంతో నిరసనల ఎఫెక్ట్ జనాల్లోకి, ప్రభుత్వం ముందుకు అంతగా వెళ్లే అవకాశం ఉండదు.

దీంతో ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే విషయంలో.. ఈ దూరపు ప్రాంతాలు నిరసనకారులకు పెద్ద మైనస్ అవుతాయి. మొత్తానికి ఢిల్లీ పోలీసులు తీసుకువచ్చిన ఈ కొత్త రూల్స్ ఆందోళనకారులకు పెద్ద విషమ పరీక్ష అనే చెప్పాలి. దీనిపై వారి నుంచి ఎలాంటి వ్యతిరేకత వ్యక్తమవుతుందో చూడాలి.

Raw Banana : అరటి పండుని పక్కనబెట్టండి.. అరటికాయ మ్యాజిక్‌ను తెలుసుకోండి..

↑
Exit mobile version