August 5 : కశ్మీర్ నుంచి రామమందిరం వరకు సేమ్ సెంటిమెంట్.. ఆగస్ట్ 5న నయా హిస్టరీకి కేంద్రం రెడీ?

August 5 : కేంద్ర ప్రభుత్వం మళ్లీ 2025లో వస్తున్న ఆగస్ట్ 5వ తేదీకి ఇంపార్టెన్స్ ఇస్తుండటంతో ఈసారి ఎలాంటి బాంబ్ పేల్చబోతున్నారనే ఉత్కంఠ అందరిలో నెలకొంది.

August 5

భారత రాజకీయ క్యాలెండర్‌లో ఆగస్ట్ 5 అనే తేదీకి ఉన్న పవర్, ఆ తేదీ వెనుకున్న స్ట్రాటెజీ ఎలాంటిదో పాలిటిక్స్‌, కరెంట్ అఫైర్స్‌ రెగ్యులర్‌గా ఫాలో అయ్యేవారికి బాగానే గుర్తు ఉంటుంది. అందుకే ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఏ పెద్ద నిర్ణయాన్ని తీసుకోవాలన్నా, దేశంలో ఊహించని సంచలనానికి తెర దీయాలన్నా ఆగస్ట్ 5నే ఎంచుకోవడం ఒక సెంటిమెంట్‌గా మారిపోయిందని వారంతా బలంగా నమ్ముతుంటారు.

దీనిలో భాగంగానే ఢిల్లీలో పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జోరుగా సాగుతున్న సమయంలో, ఈ ఆగస్ట్ 5(August 5)న నరేంద్ర మోదీ సర్కార్ నుంచి మరో మైండ్ బ్లాకింగ్ అనౌన్స్‌మెంట్ లేదా విప్లవాత్మకమైన ప్రకటన రాబోతోందనే న్యూస్..ఇప్పుడు పొలిటికల్ వర్గాల్లో ఆసక్తిని రేపుతోంది. అయితే ఈ ఒక్క తేదీకే కేంద్రం ఎందుకంత ప్రాధాన్యత ఇస్తోందనే ప్రశ్న చాలామందిలో వినిపిస్తోంది.

ఒకసారి ఈ డేట్ తాలూకా హిస్టరీ తిరగేసి చూస్తే.. 2019 ఆగస్ట్ 5న జమ్మూకశ్మీర్‌కు దశాబ్దాలుగా ఉన్న ఆర్టికల్ 370 స్పెషల్ స్టేటస్‌ను రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయం దేశ వ్యాప్తంగా ఎలాంటి సెన్సేషన్‌ను క్రియేట్ చేసిందో ఎవరూ మర్చిపోలేరు.

పార్లమెంట్‌లో ఈ బిల్లు ప్రవేశపెట్టే వరకు ప్రతిపక్షాలకు ఏమాత్రం అనుమానం కూడా రాకుండా చాలా అంటే చాలా సీక్రెట్‌గా మోదీ టీమ్ ఈ ఆపరేషన్ పూర్తి చేసింది. సరిగ్గా అదే తేదీ సెంటిమెంట్‌ను కంటిన్యూ చేస్తూ, తర్వాతి ఏడాది 2020 ఆగస్ట్ 5(August 5)న కోట్లాది మంది భారతీయుల దశాబ్దాల కల అయిన అయోధ్య రామ మందిర నిర్మాణానికి ..భూమి పూజ కార్యక్రమాన్ని కూడా అత్యంత వైభవంగా నిర్వహించారు.

ఈ రెండు చారిత్రాత్మక ఘటనల తర్వాత, కేంద్ర ప్రభుత్వం మళ్లీ 2025లో వస్తున్న ఆగస్ట్ 5వ తేదీకి అలాంటి ఇంపార్టెన్స్ ఇస్తుండటంతో ఈసారి ఎలాంటి బాంబ్ పేల్చబోతున్నారనే ఉత్కంఠ అందరిలో నెలకొంది.

August 5

పొలిటికల్ విశ్లేషకుల అంచనాల ప్రకారం.. ఈసారి కేంద్ర కేబినెట్‌ను భారీగా పునర్వ్యవస్థీకరించడం కానీ దేశంలో ఎన్నో ఏళ్లుగా చర్చల్లో ఉన్న ఒక కీలకమైన చట్టపరమైన సవరణ బిల్లును ఉన్నపళంగా సభలో ప్రవేశపెట్టే అవకాశాలు కానీ చాలా క్లియర్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే దీనికి సంబంధించిన హోంవర్క్ అంతా వెనుక నుంచి వేగంగా పూర్తయిందనే వార్తలు వినిపిస్తున్నాయి.

కేంద్ర ప్రభుత్వం ఈ ఆగస్ట్ 5(August 5)న ఈ డెసిషన్ తీసుకుంటే కనుక.. దేశ పాలనా వ్యవస్థలోనే నయా విప్లవానికి పునాది వేస్తుందని భావిస్తున్నారు. సామాజికంగా, ఆర్థికంగా పారదర్శకతను పెంచేలా నూతన చట్టాలను తీసుకురావడానికి, ఇప్పటివరకు ఉన్న పాత చట్టాలకు పవర్ ఫుల్ సవరణలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఈ టైమ్‌ను సరిగ్గా వాడుకోబోతోందా లేదా అనేది మరికొద్ది గంటల్లో తేలిపోతుంది.

Questioning Nature : కోడింగ్ ఒక్కటే వస్తే సరిపోదా? .. ఆలోచించే విధానం మారకపోతే కష్టమేనా?

Exit mobile version