N.R. Narayana Murthy
వేల కోట్లు సంపాదించినా అతి సాదాసీదా జీవితం గడపడం చాలా తక్కువ మందికే సాధ్యమవుతుంది. అలాగే వ్యాపారంలో నిజాయితీ, కార్పొరేట్ పాలనకు, ఉద్యోగులకు వాటాలు ఇచ్చి కంపెనీలో భాగస్వాములు చేయడం వంటి గొప్ప పనులు నూటికో కోటికో ఒక్కరే చేస్తుంటారు. అలాంటి వారిలో కచ్చితంగా ఉండే పేరు ఎన్ ఆర్ నారాయణమూర్తి(N.R. Narayana Murthy).
అందరికీ ఇన్ఫోసిస్ నారాయణమూర్తి(N.R. Narayana Murthy)గా సుపరిచితులైన ఆయన వ్యాపార ప్రస్థానం ఎంతోమందికి స్ఫూర్తి అనడంలో ఎలాంటి సందేహం లేదు. భార్య సుధామూర్తి దగ్గర కేవలం రూ.10 వేల రూపాయలు అప్పు తీసుకుని ఇన్ఫోసిస్ ప్రారంభించిన నారాయణమూర్తి దానిని ఏకంగా రూ.17 వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యంగా తీర్చిదిద్దారు.
చాలా తక్కువ సమయంలోనే ఇన్ఫోసిస్ వరల్డ్ బెస్ట్ కంపెనీల్లో ఒకటిగా పేరు తెచ్చుకుందంటే కారణం ఆయనే. భారతీయ ఐటీ రంగానికి పితామహునిగా పిలుచుకునే నారాయణమూర్తి 1981లో ఇన్ఫోసిస్‌ను ప్రారంభించారు. అది నాలుగేళ్లకే 2 లక్షల మందికి పైగా ఉద్యోగులతో దేశంలోనే రెండో అతిపెద్ద ఐటీ కంపెనీగా నిలిచింది.
సుమారు 30 ఏళ్ల పాటు ఇన్ఫోసిస్‌ను నడిపించిన నారాయణమూర్తి సక్సెస్ వెనుక భార్య సుధామూర్తి పాత్ర ఎంతో కీలకం. వేల కోట్ల రూపాయలున్నా అత్యంత నిరాడంబరంగా జీవితాన్ని గడిపారు. ఇప్పటికే తమ సింప్లిసిటీతోనే ప్రత్యేకతను చాటుకున్నారు. వ్యాపారంలో నిజాయితీకి, నైతిక విలువలకు మాత్రమే పెద్దపీట వేసిన నారాయణ మూర్తి ఉద్యోగులను సొంత కుటుంబంలా చూసుకున్నారు.
కంపెనీ లాభాల్లో వాటాలు ఇచ్చి వారిని భాగస్వాములను చేసిన గొప్ప వ్యక్తిగా నిలిచారు. 2011లో ఛైర్మన్ పదవి నుంచి తప్పుకున్న మూర్తి విశాల్ సిక్కాకు బాధ్యతలు అప్పగించారు. అయితే మళ్లీ రెండేళ్ల తర్వాత ఎగ్జిక్యూటివ్‌గా బాధ్యతలు తీసుకున్నారు. ఇదిలా ఉంటే పెళ్లి విషయంలోనూ నారాయణమూర్తి ఎంతో నిరాండబరంగా వ్యవహరించారు. కేవలం 800 రూపాయల ఖర్చుతో పెళ్లి చేసుకున్నారు.
కంపెనీ బాధ్యతలు తీసుకోవడంతో 30 ఏళ్ల పాటు ఒక్కసారి కూడా తాము వెకేషన్‌కు వెళ్లలేదని సుధామూర్తి పలు సందర్భాల్లో చెప్పారు. కేవలం సంపాదనపైనే కాకుండా సామాజిక సేవలోనూ ప్రత్యేకతను చాటుకున్నారు. ఇన్ఫోసిస్ ఫౌండేషన్ స్థాపించి విద్య, వైద్యం, గ్రామీణ ప్రాంతాల్లో కొన్ని సేవా కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహిస్తున్నారు. ఈయన భారత వ్యాపార రంగానికి అందించిన సేవలకు గానూ కేంద్ర ప్రభుత్వం 2000లో పద్మశ్రీ, 2008లో దేశ రెండో అత్యున్నత పౌర పురస్కారం పద్మ విభూషణ్ ఇచ్చి గౌరవించింది.
Peace Of Mind : ఎదుటివారి కామెంట్స్‌కు రగిలిపోతున్నారా?..మీ పీస్ ఆఫ్ మైండ్ మీ చేతుల్లోనే ఉంచుకోండి..
