Narendra Modi : గుజరాత్ సీఎంగా మొదలై దేశ ప్రధానిగా 25 ఏళ్లు.. మోదీ పాలనా ప్రస్థానంపై కేంద్ర మంత్రివర్గం ఏకగ్రీవ తీర్మానం

Narendra Modi : వరుసగా 3సార్లు దేశ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టి పాతికేళ్ల నాయకత్వాన్ని పూర్తి చేసుకున్న ప్రధాని నరేంద్ర మోదీకి కేంద్ర కేబినెట్..ఈరోజు ఘనంగా అభినందనలు తెలిపింది.

Narendra Modi

పాలిటిక్స్‌లో ఏకంగా 25 ఏళ్ల పాటు ప్రభుత్వాధినేతగా సుదీర్ఘ పాలన సాగించడమనేది అంత ఈజీ కాదు..నిజంగా అదొక అరుదైన రికార్డ్. నేషన్ ఫస్ట్ – సిటిజన్ ఫస్ట్ అనే సిద్ధాంతంతో గుజరాత్ ముఖ్యమంత్రిగా ప్రస్థానం ప్రారంభించి, ఆ తర్వాత వరుసగా 3సార్లు దేశ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టి పాతికేళ్ల నాయకత్వాన్ని పూర్తి చేసుకున్న ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi)కి కేంద్ర కేబినెట్..ఈరోజు ఘనంగా అభినందనలు తెలిపింది. దీనిలో భాగంగా భారత దేశ రూపురేఖలను సమూలంగా మార్చిన నరేంద్ర మోదీ(Narendra Modi) విజన్‌లోని 10 కీలక అంశాలను స్పెషల్‌గా తీర్మానించింది.

మొదటిది గుజరాత్‌‌లో తెచ్చిన స్వాగత్, జ్యోతిగ్రామ్ ఎక్స్‌పెరిమెంట్స్ కేంద్రంలో ప్రగతి రూపంలో దేశవ్యాప్త డెవలప్మెంట్‌కి బాటలు వేశాయి. సెకండ్‌ది 60 కోట్లకు పైగా జన్ ధన్ అకౌంట్లు, 4 కోట్ల పక్కా ఇళ్లతో 25 కోట్ల మందిని పేదరికం నుంచి బయటకు తీసుకువచ్చారు.

మూడోది 3.5 కోట్ల మంది స్త్రీలను లఖ్‌పతి దీదీలుగా మార్చడం, చట్టసభల్లో మహిళా రిజర్వేషన్లు, పీఎం కిసాన్ ద్వారా రూ. 4 లక్షల కోట్లు డైరెక్టుగా రైతుల అకౌంట్లలో వేయడం. నాలుగవది జీఎస్టీ, పాత చట్టాల రద్దు, డిజిటల్ పేమెంట్స్ వంటి సాహసోపేత పరిపాలనా సంస్కరణలు.

ఇక ఐదోది కేపిటల్ వ్యయాన్ని రూ. 12 లక్షల కోట్లకు పెంచి సెమీ కండక్టర్లు, డిఫెన్స్ రంగంలో భారత్‌ను స్వయం సమృద్ధి వైపు నిలపడం. ఆరవది యూపీఐతో డిజిటల్ విప్లవం అలాగే మేడ్ ఇన్ ఇండియా వ్యాక్సిన్లు, చంద్రయాన్-3 విజయంతో పాటు ఏఐ టెక్నాలజీలో గ్లోబల్ లీడర్‌గా ఎదగడం.

ఏడవది కరోనా టైమ్‌లో అలాగే అంతర్జాతీయ యుద్ధ సమయాల్లో దేశ ఆర్థిక వ్యవస్థ ఏ మాత్రం దెబ్బతినకుండా స్థిరమైన ప్రగతిని అందించడం. ఎనిమిదోది సర్జికల్ స్ట్రైక్స్, ఆపరేషన్ సింధూర్, ఆర్టికల్ 370 రద్దుతో జాతీయ భద్రతలో రాజీ పడని వైఖరిని ప్రపంచం ముందు చాటడం.

Narendra Modi

తొమ్మిదోది జీ20లో ఆఫ్రికన్ యూనియన్ చేరిక, అలాగే వ్యాక్సిన్ మైత్రి ద్వారా గ్లోబల్ స్థాయిలో భారతదేశ ఖ్యాతిని పెంచి 36 దేశాల అత్యున్నత పురస్కారాలను అందుకోవడం. పదోది కాశీ విశ్వనాథ్ ధామ్, అయోధ్య శ్రీరామ మందిరంతో సంస్కృతికి పూర్వవైభవం తీసుకువస్తూనే పర్యావరణ పరిరక్షణను కూడా వేగవంతం చేయడం.

మోదీ తన 25 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణం కేవలం ఒక రాజకీయ నేత రికార్డ్ మాత్రమే కాదు, వికసిత్ భారత్ వైపు దూసుకుపోతున్న నవ భారతావని సెల్ఫ్ కాన్పిడెన్స్‌కు ప్రతిరూపం.

Araku Valley Hot Air Balloon : గాల్లో తేలుతూ అరకు అందాలను ఆస్వాదించే ఛాన్స్..హాట్ ఎయిర్ బెలూన్ అడ్వెంచర్ రీ స్టార్ట్..

↑
Exit mobile version