No-Caste, No-Religion Certificate
మనదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరికీ కూడా ఏదొక కులం, మతం గుర్తింపుగా రావడం కామన్. స్కూల్ అడ్మిషన్ ఫామ్ దగ్గర నుంచి మొదలైన క్యాస్ట్ అండ్ రిలీజియన్ (Caste & Religion) అనే బాక్స్‌లు ఉద్యోగం, ఇతర అప్లికేషన్ల వరకు మనల్ని వెంటాడుతూనే ఉంటాయి.
అయితే అసలు వ్యవస్థకే మైండ్ బ్లాంక్ అయ్యేలా తనకు ఏ క్యాస్ట్ వద్దు.. ఏ రిలీజియన్ వద్దని తమిళనాడుకు చెందిన అడ్వకేట్ ఎం.ఎ.స్నేహ తొమ్మిదేళ్ల పాటు పోరాటం చేసింది. అంతే కాదు ఏకంగా దానికి సంబంధించి ప్రభుత్వం నుంచి అధికారికంగా సర్టిఫికెట్ కూడా సాధించిన మొట్టమొదటి వ్యక్తిగా నేటికీ వార్తల్లోనే నిలిచారు.
ఆమె చిన్నతనం నుంచే దీనిపై యుద్ధం మొదలైంది. స్నేహ పేరెంట్స్ ఆనందకృష్ణన్, మణిమొళి ఇద్దరూ న్యాయవాదులే. ఇద్దరూ ఆదర్శవాదులే కావడంతో.. తమ పిల్లలకు ఎలాంటి కులమతాల రంగు పూయకూడదని నిర్ణయం తీసుకున్నారు. అందుకే తమ పిల్లల స్కూల్, కాలేజీ రికార్డుల్లో కులం, మతం అనే కాలమ్స్‌ను ఖాళీగానే వదిలేశారు. అంతేకాదు ఆమె సోదరీమణులు కూడా విభిన్న మతాల పేర్లు కలిసొచ్చేలా తమ పిల్లలకు పేర్లు పెట్టి తమ లౌకికభావాన్ని చాటుకున్నారు.
అయితే స్నేహ లాయర్‌గా ప్రాక్టీస్ ప్రారంభించాక అసలు ఇబ్బంది మొదలైంది. నోటరీ లాయర్‌గా, ఇతర ప్రభుత్వ న్యాయపరమైన పరీక్షలకు అప్లై చేసుకునే సమయంలో క్యాస్ట్ సర్టిఫికెట్ సమర్పించాల్సి వచ్చేది. తనకు కులం లేదని చెప్పిన ప్రతిసారీ, దానికి ప్రభుత్వ గుర్తింపు లేదని అధికారులు ఆమె దరఖాస్తులను రిజెక్ట్ చేసేవారు. దీంతో చివరకు 2010లో తనకు ఏ కులం, మతం లేవని ధృవీకరిస్తూ ఒక సర్టిఫికెట్ ఇవ్వాలని స్నేహ అధికారులను ఆశ్రయించారు.
కానీ భారతీయ చట్టాల్లో కానీ ప్రభుత్వ నిబంధనలలో కానీ ఇలాంటి సర్టిఫికెట్ ఇచ్చిన దాఖలాలు ఎక్కడా లేవంటూ అధికారులు 9 ఏళ్ల పాటు స్నేహ అప్లికేషన్‌ను హోల్డ్‌లోనే పెట్టేశారు. అయినా కూడా వెనక్కి తగ్గని స్నేహ లీగల్‌గా పోరాటం చేస్తూనే వచ్చారు. చివరకు 2019లో ఆమె రికార్డులన్నీ పరిశీలించిన అధికారులు.. తిరుపత్తూరు తహసీల్దార్ ద్వారా దిస్ ఈజ్ టు సర్టిఫై దట్ షీ డజ్ నాట్ బిలాంగింగ్ టు ఎనీ క్యాస్ట్ ఆర్ రిలీజియన్ అని అధికారిక గవర్నమెంట్ సర్టిఫికెట్ జారీ చేయడం అప్పట్లో పెద్ద సంచలన వార్తగా నమోదయింది.
అయితే నటుడు పార్థిబన్‌కు ఇటీవల ఇలాంటి సర్టిఫికెట్ జారీ అయింది. ఈ క్యాస్ట్ అండ్ రిలీజియన్ పత్రాల జారీ విధానంపై మద్రాస్ హైకోర్టులో మరోసారి న్యాయపరమైన చర్చ జరగడంతో.. స్నేహ పాత కథ మళ్లీ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
క్యాస్ట్ అండ్ రిలీజియన్ పత్రాలను పొందడం వల్ల ఇలాంటివారికి వచ్చే ప్రయోజనం ఏంటంటే.. భారత పౌరులుగా ఆధార్, పాస్‌పోర్ట్, ఓటర్ ఐడీ వంటివన్నీ ఎప్పటిలాగే వర్తిస్తాయి. కాకపోతే గవర్నమెంట్ ఉద్యోగాలు, విద్యాసంస్థల్లో కుల ప్రాతిపదికన వచ్చే రిజర్వేషన్లు, స్కాలర్‌షిప్‌లను మాత్రం వీరు పొందలేరు.
అయితే ఏ రకమైన ప్రయోజనాలను పొందడం కోసం కాకుండా, కేవలం తన నమ్మే ఆశయాలకు ప్రభుత్వ ముద్ర కావాలనే ఉద్దేశంతోనే వీరు ఈ సర్టిఫికెట్ సాధించారు. మనుషులంతా కులాలు, మతాల పేరుతో విడిపోతున్న ఈ రోజుల్లో ఇలాంటి నిర్ణయాలు ఎప్పుడూ కూడా సంచలనాత్మక విప్లవాత్మక అడుగులుగానే నిలిచిపోతాయి.
Palathalikala Payasam : వినాయక చవితి స్పెషల్..పర్ఫెక్ట్ తాలికల పాయసం రెసిపీ..
