Petrol Bunks Cash Rule : పెట్రోల్ బంకుల్లో పాతకాలం నాటి క్యాష్ రూల్.. డిజిటల్ ఇండియాకు రివర్స్ గేర్ పడుతుందా?

Petrol Bunks Cash Rule : అన్ని పెట్రోల్ బంకుల్లో ఇకపై గూగుల్ పే, ఫోన్ పే వంటి యూపీఐ యాప్‌లకు గుడ్ బై చెప్పేసి, కేవలం క్యాష్ మాత్రమే తీసుకోవాలని నిర్ణయం వైపు ఏపీ పెట్రోలియం డీలర్ల అసోసియేషన్ అడుగులు వేస్తోంది.

Petrol Bunks Cash Rule

చేతిలో ఒక్క రూపాయి లేకపోయినా, చేతిలో స్మార్ట్‌ఫోన్ ఉంటే చాలన్న కొండంత ధైర్యంతో రోడ్డెక్కే డిజిటల్ యుగంలో మనమందరం బతుకుతున్నాం. చాయ్ బడ్డీ నుంచి షాపింగ్ మాల్ వరకు ప్రతీదానికీ కూడా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి క్షణాల్లోనే కావాల్సినవి కొనుక్కోవడం అలవాటు చేసుకున్నాం.

ఇలా కూల్‌గా సాగిపోతున్న డిజిటల్ లైఫ్‌కి ఒక్కసారిగా బ్రేకులు వేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయం ఇప్పుడు రకరకాల టర్న్‌లు తీసుకుంటోంది. ఏపీలోని అన్ని పెట్రోల్ బంకుల్లో ఇకపై గూగుల్ పే, ఫోన్ పే వంటి యూపీఐ యాప్‌లకు గుడ్ బై చెప్పేసి, కేవలం క్యాష్(Petrol Bunks Cash Rule) మాత్రమే తీసుకోవాలని నిర్ణయం వైపు ఏపీ పెట్రోలియం డీలర్ల అసోసియేషన్ అడుగులు వేస్తోంది. ఒకవేళ ఇదే సీన్ రేపు తెలంగాణలో, ఆ తర్వాత దేశమంతటా రిపీట్ అయితే సామాన్యుడి పరిస్థితి ఏంటన్న ప్రశ్న జనాలలో వినిపిస్తోంది.

అసలు బంకుల యాజమాన్యాలు ఈ రేంజ్‌లో కఠిన నిర్ణయం తీసుకోవడానికి ..యూపీఐ పేమెంట్లు చేసేటపుడు తరచుగా సర్వర్లు డౌన్ అవ్వడం, కస్టమర్ అకౌంట్ నుంచి డబ్బులు కట్ అయినా బంకు యజమాని అకౌంట్‌లోకి సెటిల్మెంట్ కాకపోవడం అని కారణాలు ఉన్నా కూడా.. తాజాగా కేంద్రం తీసుకువచ్చిన బిజినెస్ యూపీఐ లావాదేవీలపై 0.4 శాతం ఎండీఆర్‌ రుసుము అక్టోబర్ నుంచి అమల్లోకి రాబోవడం కూడా దీనికి మరో రీజన్ అన్న వార్తలు వినిపిస్తున్నాయి.

ఒకవేళ డీలర్ల అసోసియేషన్ కనుక అనుకున్నట్లుగా యూపీఐ సర్వీసులను పూర్తిగా బంద్ చేసి, పాతకాలపు నోట్ల చెల్లింపులకే ఫిక్స్ అయితే వాహనదారులకే అసలైన కష్టాలు మొదలవుతాయి. రాత్రి పూట లేదా అత్యవసర పరిస్థితుల్లో ప్రయాణం చేసేటప్పుడు డబ్బులు చేతిలో లేకపోతే పెట్రోల్ లేక వాహనాలు రోడ్డుపైనే ఆగిపోయే ప్రమాదం ఉంది.

Petrol Bunks Cash Rule

ప్రస్తుతం జనాలెవరి చేతిలో కూడా మనీ ఉండట్లేదు. ఏటీఎమ్‌లకు వెళ్లడం ఎప్పుడో మానేశారు.ఇప్పుడంతా డిజిటలైజ్ అయిపోయింది. అంతేకాదు ఇప్పటివరకూ బంకుల వరకే ఉన్న ఈ క్యాష్ రూల్(Petrol Bunks Cash Rule) రేపు కూరగాయల షాపులు, సూపర్ మార్కెట్లు,థియేటర్లు, మాల్స్‌కు పాకితే.. డిజిటల్ ఇండియా కాన్సెప్ట్‌కు పూర్తిగా రివర్స్ గేర్ పడినట్లే అవుతుంది.

అందుకే వెంటనే కేంద్రం, బ్యాంకింగ్ రంగం జోక్యం చేసుకుని ఈ సమస్యను సరిచేయకపోతే తీవ్ర నష్టం చవిచూసేది మాత్రం సామాన్యుడే. క్యూఆర్‌ కోడ్‌ను నమ్ముకుని రోడ్డెక్కే కోట్లాది మంది పరిస్థితి అగమ్యగోచరంగా మారడం గ్యారంటీ.

Hangry : ఆకలేస్తే కోపం వస్తోందా.. ఆకలి కోపానికి బ్రేక్ వేసే సింపుల్ సైకాలజీ ట్రిక్స్..

Exit mobile version