Poison Chronicles Of Old Kolkata : కోల్‌కతా మరచిపోయిన చరిత్ర..హిస్టరీని గుర్తు చేస్తున్న విషపు సీసాలు..

Poison Chronicles Of Old Kolkata : మన పూర్వీకులు ట్రీట్మెంట్ నుంచి నేరాల వరకు విషాన్ని ఎన్ని రకాలుగా ఎలా ఉపయోగించేవారో కోల్‌కతాలో ఏర్పాటు చేసిన ఒక విచిత్రమైన ప్రదర్శన కళ్లకు కట్టేలా పరిచయం చేస్తోంది.

Poison Chronicles Of Old Kolkata

సాధారణంగా పాయిజన్ అనే మాట వినగానే మనకు ప్రాణాలు తీసే రసాయనమే గుర్తుకొస్తుంది. కానీ అదే విషాన్ని సరైన మోతాదులో వాడితే అద్భుతమైన ప్రాణరక్షణ ఔషధంగా మారుతుందని చాలామందికి తెలీదు. దీనికోసమే మన పూర్వీకులు ట్రీట్మెంట్ నుంచి నేరాల వరకు విషాన్ని ఎన్ని రకాలుగా ఎలా ఉపయోగించేవారో కోల్‌కతాలో ఏర్పాటు చేసిన ఒక విచిత్రమైన ప్రదర్శన(Poison Chronicles Of Old Kolkata) కళ్లకు కట్టేలా పరిచయం చేస్తోంది. డిజిటల్, గూగుల్ వరల్డ్‌కి దూరంగా.. పాతకాలపు జ్ఞాపకాలను, మర్చిపోయిన హిస్టరీని మనందరి కళ్ల ముందుకు తెస్తోంది ఈ ఎగ్జిబిషన్.

కోల్‌కతాలోని జగజ్యోతి లైబ్రరీలో సెకల్ బోయిఘర్ అనే నేమ్‌తో సౌవిక్ ముఖర్జీ అనే వ్యక్తి తన వద్ద ఉన్న అరుదైన కలెక్షన్స్‌తో ఈ(Poison Chronicles Of Old Kolkata) ప్రదర్శన ఏర్పాటు చేశారు. దీనిలో దాదాపు 22 పురాతన విషపు సీసాలు, 1950ల నాటి వందకు పైగా సిగరెట్ టిన్ డబ్బాలు ఉన్నాయి. పూర్వకాలంలో విషం వాడిన తర్వాత ఆ బాటిల్స్‌ను పగలగొట్టి పారేసేవారు. కాబట్టి ఈ రోజుల్లో అలాంటి గ్లాస్ బాటిల్స్ దొరకడం చాలా అరుదు అనే చెప్పాలి.

ఒక చిన్న గాజు బాటిల్ ఆనాటి ప్రజల లైఫ్ స్టైల్‌ను, కెమికల్స్ వాడకాన్ని , నాటి నేర చరిత్రను మనకు వివరిస్తుంది. దీనిలో కొన్ని ప్రాణాంతక పాయిజన్ సీసాలు కాగా, మరికొన్ని మోతాదు ప్రకారం వాడి తయారు చేసిన మెడికల్ బాటిల్స్ ఉన్నాయి. భద్రతా కారణాల వల్ల అత్యంత ప్రమాదకరమైన సీసాలను గాజు పెట్టెల్లో భద్రపరిచారు.

హిస్టరీలో 70 ఏళ్ల తత్వవేత్త సోక్రటీస్ తాగిన హెమ్లాక్ పాయిజన్ దగ్గర నుంచి, సాహిత్యంలో బ్యోమకేష్ బక్షి కథల్లో ప్రస్తావించిన పొగాకు నికోటిన్, ‘క్యూరరీ’ అనే పాయిజన్స్ వరకు ఎన్నో ఇంట్రస్టింగ్ విషయాలను ఈ ఎగ్జిబిషన్ గుర్తు చేస్తోంది. దీంతో పాటు మొదటి ప్రపంచ యుద్ధ కాలం నాటి కత్తెర, పాసింగ్ షో సిగరెట్ టిన్ డబ్బాలు ఆనాటి కల్చర్‌కు అద్దం పడుతున్నాయి.

Poison Chronicles Of Old Kolkata

బ్రిటిష్ కాలంలో మన ఇండియన్ విప్లవకారులు కొన్ని సిగరెట్ టిన్ బాటిల్స్‌ను ఏకంగా హ్యాండ్ గ్రెనేడ్లు తయారు చేయడానికి యూజ్ చేసేవారట. అలాగే అప్పటి సైనికుల కోసం స్పెషల్‌గా సిగరెట్ ప్యాకెట్ల లోపల యూరోపియన్ యాక్ట్రెస్ ఉన్న చిన్న ఫోటో కార్డులు ఉంచే సాంప్రదాయం ఉండేది.

ఒక రకంగా చెప్పాలంటే ఈ ఎగ్జిబిషన్ కేవలం పాత వస్తువుల ప్రదర్శన మాత్రమే కాదు.. మనల్ని చరిత్ర వైపు తీసుకెళ్లే ఒక వండర్ ఫుల్ టైమ్ మెషిన్ అని చెప్పొచ్చు.

No UPI Day : అక్టోబర్ 2న డిజిటల్ షాక్.. ఆ ఒక్క కొత్త రూల్‌తో ఎవరికి ఇబ్బంది?

↑
Exit mobile version