Shiv Sena : మహారాష్ట్రలో మళ్లీ మహా ఆపరేషన్.. షిండే గూటికి ఆ 6మంది మంత్రులు ..

Shiv Sena : మహారాష్ట్ర డిప్యూటీ సీఎంగా ఉన్న ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని.. అసలు శివసేనకు సపోర్ట్ ఇవ్వడానికి ఈ ఆరుగురు ఎంపీలు లైన్ క్లియర్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది

Shiv Sena

మహారాష్ట్ర పాలిటిక్స్‌లో మరోసారి ఊహించని రేంజ్‌లో హైడ్రామా స్టార్ట్ అయింది. అంతకుముందు జరిగిన పాత సీన్లను గుర్తు చేస్తూ.. శివసేన(Shiv Sena) ఉద్ధవ్ బాలాసాహెబ్ థాకరే పార్టీకి చెందిన ఆరు మంది లోక్‌సభ ఎంపీలు.. త్వరలోనే గుడ్ బై చెప్పబోతున్నారనే వార్తలు ముంబై రాజకీయాలను ఒక్కసారిగా కుదిపేస్తున్నాయి.

ప్రస్తుతం మహారాష్ట్ర డిప్యూటీ సీఎంగా ఉన్న ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని.. అసలు శివసేన(Shiv Sena)కు సపోర్ట్ ఇవ్వడానికి ఈ ఆరుగురు ఎంపీలు లైన్ క్లియర్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఇదే కనుక నిజమైతే, 2022వ సంవత్సరంలో ఎదుర్కొన్న పెద్ద చీలిక తర్వాత ఉద్ధవ్ థాకరేకు ఇది కోలుకోలేని దెబ్బ అవుతుందని పొలిటికల్ విశ్లేషకులు భావిస్తున్నారు.

ఈ పొలిటికల్ రేస్‌లో సంజయ్ జాదవ్, సంజయ్ దేశ్‌ముఖ్, నగేష్ పాటిల్ అస్తికర్, ఓంరాజే నింబాల్కర్, భౌసాహెబ్ వాక్‌చౌరే, సంజయ్ దిన పాటిల్ వంటి కీలక నేతల పేర్లు వినిపిస్తున్నాయి. ఆరుగురు మంత్రులు ఇప్పటికే షిండే వర్గంతో టచ్‌లోకి వెళ్లినట్లు ప్రచారం జరుగుతున్నా, ఎక్కడా అధికారిక ప్రకటన మాత్రం రాలేదు.

అయితే ఈ లీకులపై ఉద్ధవ్ థాకరే నమ్మకస్థుడు, రాజ్యసభ సభ్యుడు అయిన సంజయ్ రౌత్.. హస్తినలో ప్రెస్ మీట్ పెట్టి రియాక్టయ్యారు. పార్టీ మారాలని చూస్తున్న ఎంపీలెవరైనా ఉంటే, దమ్ముంటే ముందు వారి పదవులకు రిజైన్ చేసి ఆ తర్వాతే వెళ్లాలని సవాల్ విసిరారు.

ఈ ఎంపీలందరి గెలుపు వెనుక ఉద్ధవ్ థాకరే ఇమేజ్, శివసైనికుల రక్తం, చెమట దాగున్నాయని, వెన్నుపోటు పొడిచి వెళ్తే పార్టీ కార్యకర్తలెవరూ చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు. అంతేకాదు గతంలో చేసినట్లుగానే శివసేనను మళ్లీ ముక్కలు చేయడానికి భారీ కుట్రలు జరుగుతున్నాయని, ఒక్కో ఎంపీని లొంగతీసుకోవడానికి ఏకంగా రూ. 15 కోట్ల వరకు భారీ ఆఫర్లు ఇస్తున్నారని సంజయ్ రౌత్ సంచలన ఆరోపణలు చేశారు.

Shiv Sena

అయితే ఈ మీడియా సమావేశం తర్వాత అసలైన ట్విస్ట్ మొదలైంది. సంజయ్ రౌత్ అంత అర్జంట్‌గా నిర్వహించిన ఈ ప్రెస్ మీట్‌కు.. పార్టీకి ఉన్న మొత్తం తొమ్మిది మంది లోక్‌సభ సభ్యుల్లో కేవలం అరవింద్ సావంత్, అనిల్ దేశాయ్, రాజభౌ వాజే మాత్రమే హాజరయ్యారు. మిగిలిన ఆరుగురు ఎంపీలు ఈ మీడియా సమావేశానికి రాకపోవడం ఇప్పుడు రాజకీయ సర్కిల్స్‌లో జరుగుతున్న ప్రచారానికి వంద శాతం బలాన్ని చేకూర్చింది.

ప్రస్తుతం తమ దగ్గర ఎలాంటి అధికారిక సమాచారం లేదని పైకి చెప్తున్నా.. లోపల మాత్రం పార్టీకి పెద్ద గండమే పొంచి ఉందని ఈ ఎంపీల గైర్హాజరీ క్లారిటీ ఇస్తుంది. రాబోయే రోజుల్లో మహా పాలిటిక్స్ ఎలాంటి కొత్త మలుపులు తిరుగుతాయో చూడాలి.

Capricorn : కఠోర శ్రమ,క్రమశిక్షణకు నిదర్శనం.. మకరరాశి వారి ప్లస్‌లు, మైనస్‌లు ఏంటి?

Exit mobile version