Gold Rates : దేశవ్యాప్తంగా బంగారం రేట్లు వరుసగా నాలుగో రోజు కూడా రాకెట్ స్పీడ్‌తో వేగంగా దూసుకెళ్తున్నాయి.

Gold Rates : ఆదివారం ఉదయానికి హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 1లక్ష52వేల350 వద్ద ట్రేడ్ అవుతుండగా, 22 క్యారెట్ల ధర రూ. 1లక్ష39వేల650 గా నమోదైంది.

Gold Rates

అంతర్జాతీయంగా మారుతున్న పరిస్థితులు, ఇతర దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల వల్ల పెట్టుబడిదారులు అంతా సేఫ్ ఇన్వెస్ట్‌మెంట్‌గా గోల్డ్ వైపే ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. దీనివల్ల బంగారానికి డిమాండ్ అమాంతం పెరిగిపోయి ధరలు కొత్త రికార్డులను సృష్టించడానికి పరుగులు తీస్తున్నాయి.

కేవలం 4 రోజుల గ్యాప్‌లోనే 24 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి ధర ఏకంగా రూ.8 వేలకు పైగా పెరగడం గమనార్హం. ఆగస్టు 5 న మార్కెట్‌లో రూ. 1లక్ష44వేల వద్ద ఉన్న 10 గ్రాముల పసిడి రేటు, ఆదివారం ఉదయానికి రూ. 1.52 లక్షల మార్కును ఈజీగా క్రాస్ చేసేసింది.

ఆదివారం ఉదయానికి హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ ధర(Gold Rates) రూ. 1లక్ష52వేల350 వద్ద ట్రేడ్ అవుతుండగా, 22 క్యారెట్ల ధర రూ. 1లక్ష39వేల650 గా నమోదైంది. తెలంగాణలోని వరంగల్, నిజామాబాద్, ఖమ్మం వంటి మెయిన్ నగరాల్లో కూడా ఇవే ధరలు కొనసాగుతున్నాయి.

Gold Rates

ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే.. విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, తిరుపతి ప్రాంతాల్లో 24 క్యారెట్ల పుత్తడి ధర కాస్త ఎక్కువగానే కొనసాగుతూ రూ. 1లక్ష52వేల380 వద్ద ఉంది.

దేశంలోని ఇతర ప్రధాన నగరాలలో కూడా ఇదే ట్రెండ్ క్లియర్‌గా కనిపిస్తోంది. దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1లక్షల52వేల550 వద్ద ఉండగా, ముంబై, బెంగళూరు నగరాల్లో రూ. 1లక్ష52వేల350 గా కొనసాగుతుంది. అయితే ఒక్క చెన్నై సిటీలో మాత్రం మిగిలిన మెట్రో నగరాలతో పోలిస్తే రేటు కొద్దిగా తక్కువగా ఉండి రూ. 1లక్ష51వేల640 గా ఉంది.

Self-Acceptance : లోకం మిమ్మల్ని మెచ్చుకోవాల్సిన పనిలేదు..మిమ్మల్ని మీరు యాక్సెప్ట్ చేసుకుంటే చాలు..

Exit mobile version