UPI : భారతీయుల అలవాటును మార్చేసిన యూపీఐకి పదేళ్లు.. 12 వేల రెట్లు పెరిగిన డిజిటల్ విప్లవం

UPI : తర్వాత వచ్చిన ఒకే ఒక్క క్యూఆర్ కోడ్ మన జీవితాల్లోకి వచ్చి మొత్తం సీన్‌నే మార్చేసింది. జేబులో రూపాయి లేకపోయినా, ఒక్క మొబైల్ చేతిలో ఉంటే చాలు చాయ్ బడ్డీ నుంచి ఫారిన్ టూర్‌ల వరకు బిందాస్‌గా బతికేయొచ్చనే నమ్మకాన్ని ఇచ్చింది.

UPI

మనమంతా ఒక్క పదేళ్ల వెనక్కి వెళ్లినట్లయితే షాపింగ్‌కి వెళ్లాలన్నా, జర్నీ చేయాలన్నా, చివరకు టీ తాగడానికి బయటకు వెళ్లినా జేబు నిండా క్యాష్ పట్టుకుని వెళ్లేవాళ్లం. ఏటీఎంల ముందు గంటల తరబడి క్యూలో నిలబడటం ,చిల్లర దొరక్క ఇబ్బంది పడటం ఇప్పటికీ చాలామందికి గుర్తే.

కానీ తర్వాత వచ్చిన ఒకే ఒక్క క్యూఆర్ కోడ్ మన జీవితాల్లోకి వచ్చి మొత్తం సీన్‌నే మార్చేసింది. జేబులో రూపాయి లేకపోయినా, ఒక్క మొబైల్ చేతిలో ఉంటే చాలు చాయ్ బడ్డీ నుంచి ఫారిన్ టూర్‌ల వరకు బిందాస్‌గా బతికేయొచ్చనే నమ్మకాన్ని ఇచ్చింది.

భారతదేశపు ఆర్థిక వ్యవస్థ రూపురేఖలను సమూలంగా మార్చేసి, మనల్ని డిజిటల్ లీడర్‌గా నిలబెట్టిన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ అంటే మన యూపీఐ(UPI) అందుబాటులోకి వచ్చి ఈరోజుకు సరిగ్గా పదేళ్లు పూర్తయింది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(NPCI)గా రూపాంతరం చెందిన ఈ టెక్నాలజీ ఇప్పుడు ప్రతీ భారతీయుడి డైలీ లైఫ్‌లో ఒక భాగమైపోయింది.

ఈ దశాబ్ద కాలంలో యూపీఐ సాధించిన ప్రగతి నిజంగా ఒక అద్భుతమనే చెప్పాలి. 2016లో భీమ్ యాప్‌తో 21 బ్యాంకులతో మాత్రమే చాలా చిన్నగా మొదలైన ఈ జర్నీ, 2018 నాటికి యూపీఐ 2.0 రూపంలో కొత్త పుంతలు తొక్కింది. డైనమిక్ క్యూఆర్ కోడ్‌లు, ఇన్‌వాయిస్ ఇన్ ది ఇన్‌బాక్స్, యూపీఐ మ్యాండేట్స్ వంటి క్రేజీ ఫీచర్లు రావడంతో జనాలు దీనికి ఫిదా అయిపోయారు. ఆ తర్వాత 2019లో ఐపీఓ అప్లికేషన్లకు కూడా యూపీఐ పేమెంట్లను ఓకే చేశారు.

సామాన్యులకు మరింత దగ్గరయ్యేందుకు ఫీచర్ ఫోన్ యూజర్ల కోసం యూపీఐ 123పే, చిన్న చిన్న పేమెంట్ల కోసం వితౌట్ పిన్ ఆప్షన్‌తో యూపీఐ లైట్, క్రమం తప్పకుండా జరిగే పేమెంట్ల కోసం ఆటోపే వంటి సౌకర్యాలు వచ్చాయి. ఇక 2023 నుంచి 2025 మధ్య కాలంలో దీని రూపురేఖలు మరింతగా మారిపోయాయి. క్రెడిట్ లైన్ లింకింగ్, ప్రైమరీ యూజర్ అనుమతితో ఫ్యామిలీ మెంబర్స్ పేమెంట్స్ చేసే యూపీఐ సర్కిల్, టాక్స్ పేమెంట్ల లిమిట్ ఏకంగా రూ.5 లక్షల వరకు పెంచడం, అలాగే పిన్ ఆన్‌బోర్డింగ్ కోసం సేఫ్ ఆన్-డివైస్ బయోమెట్రిక్ ,ఫేస్ అథెంటికేషన్ వంటి హైటెక్ ఫీచర్లు అందుబాటులోకి వచ్చేసాయి.

స్టార్టింగ్ స్టేజ్ అయిన 2016-17 ఆర్థిక సంవత్సరంలో కేవలం రూ. 2 కోట్లుగా ఉన్న ట్రాన్జాక్షన్లు, 2025-26 నాటికి ఊహించని రీతిలో 24,162 కోట్లకు పైగా పెరిగాయి. అంటే కేవలం 10 ఏళ్లలోనే యూపీఐ ట్రాన్జాక్షన్లు ఏకంగా 12,000 రెట్లు పెరిగాయి. ఇక వార్షిక లావాదేవీల విలువ రూ.0.07 లక్షల కోట్ల నుంచి సుమారు రూ.314 లక్షల కోట్లకు చేరిందంటే ఎంతటి సునామీ సృష్టించిందో అర్థం చేసుకోవచ్చు.

ఇది సుమారు 4,000 రెట్ల గ్రోత్. ప్రస్తుతం జూలై 2026 నాటికి దేశవ్యాప్తంగా యూపీఐ నెట్‌వర్క్‌లో 741 బ్యాంకులు ఉండగా, ఒక్క నెలలోనే రూ. 29.87 లక్షల కోట్ల విలువైన 2,365.8 కోట్ల ట్రాన్జాక్షన్లు నమోదయ్యాయంటేనే మనవాళ్లు ఏ రేంజ్‌లో స్కాన్ చేస్తున్నారో ఊహించుకోవచ్చు.

UPI

యూపీఐ సక్సెస్ కేవలం భారత్‌కే పరిమితం కాలేదు. గ్లోబల్‌గా జరిగే రియల్ టైమ్ డిజిటల్ ట్రాన్జాక్షన్లలో మన యూపీఐ వాటా ఏకంగా 49 శాతానికి చేరిందని ఇంటర్నేషనల్ మోనెటరీ ఫండ్ అంటే ఐఎంఎఫ్ స్పెషల్‌గా మెచ్చుకుంది.

మన దేశంలోనే కాకుండా ఫ్రాన్స్, శ్రీలంక, మారిషస్, ఖతార్, భూటాన్, నేపాల్, సింగపూర్, యూఏఈ, కంబోడియా, గ్రీస్, మాల్దీవులు వంటి సుమారు 11 దేశాల్లో యూపీఐ సర్వీసులు పనిచేస్తున్నాయి. దీనివల్ల బోర్డర్ దాటించి డబ్బులు పంపడం, టూరిస్టులకు పేమెంట్లు చేయడం, షాపింగ్ వంటివి చాలా ఈజీ అయిపోయింది. ఇంకా చెప్పాలంటే భారత్ తయారు చేసిన ఈ డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇప్పుడు ప్రపంచదేశాలన్నింటికీ ఒక గ్రేట్ రోల్ మోడల్‌గా నిలిచింది.

Traffic Challans : ట్రాఫిక్ చలానా కట్టట్లేదా? డైరెక్ట్‌గా ఫాస్టాగ్ నుంచే కట్.. హైదరాబాద్‌ వాసులకు మైండ్ బ్లాక్ అయ్యే న్యూస్..

Exit mobile version