Tamilnadu : హద్దులు దాటుతున్న ఉచితాలు…తమిళనాట పోటాపోటీ హామీలు

Tamilnadu : ఫ్రీ... ఫ్రీ... ఫ్రీ... అన్నీ ఫ్రీ...ఎన్నికలు వచ్చాయంటేనే చాలు రాజకీయ పార్టీల నుంచి వినిపించే మాటలు ఇవే..

Tamilnadu

ఫ్రీ… ఫ్రీ… ఫ్రీ… అన్నీ ఫ్రీ…ఎన్నికలు వచ్చాయంటేనే చాలు రాజకీయ పార్టీల నుంచి వినిపించే మాటలు ఇవే.. దేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ ఇదే తంతు… రాష్ట్రం ఆర్థిక పరిస్థితి ఎలా ఉన్నా వారికి అనవసరం.. అధికారం చేజిక్కించుకోవడమే పార్టీల లక్ష్యం.. అందుకే పోటాపోటీగా ఉచితాలు ప్రకటిస్తుంటాయి.

ప్రస్తుతం తమిళనాడు(Tamilnadu)లోనూ ఇదే తంతు. నిజానికి ఉచితాలు అంటేనే తమిళనాడును చిరునామాగా చెబుతుంటారు. ఎందుకంటే గత దశాబ్దాల చరిత్రలో ఇక్కడ ఉచితాల హామీలే అధికారాన్ని తెచ్చిపెడుతున్నాయి. 1967లో అన్నాదురై రూపాయికే బియ్యం ప్రకటన నుంచి తర్వాత డీఎంకే నేత కరుణానిధి రేషన్ కార్డు ఉన్నవారికి ఐదు కేజీల బియ్యం ఉచితం అంటూ హామీ ఇచ్చారు. 2006లోనూ కరుణానిధి కలర్ టీవీ ఇస్తానని ప్రకటించడం పెను సంచలనమైంది.

ఆయన ప్రత్యర్థి దివంగత ముఖ్యమంత్రి జయలలిత కూడా ఓటర్లకు ల్యాప్ టాప్ , మిక్సర్ గ్రైండర్లు, ఫ్యాన్లు ఇలా ఉచితాల హామీల వర్షం కురిపించారు. రానురానూ ఇది అన్ని పార్టీలకూ పాకిపోయింది. తాజాగా తమిళనాడులో ఎన్నికల సంగ్రామానికి సమయం ముంచుకొస్తున్న వేళ ప్రధాన పార్టీలు ఉచితాల హామీలతో ఓటర్లకు ఎరవేస్తున్నాయి.

డీఏంకే, అన్నాడీఎంకే , నటుడు విజయ్ టీవీకే ఇలా పార్టీ ఏదైనా ఉచితాల హామీలే ప్రధానంగా మేనిఫెస్టోలను ప్రకటించేస్తున్నాయి. డీఎంకేతో పోలిస్తే అన్నాడీఎంకే ఈ ఉచితాల్లో కాస్త ముందుందని చెప్పొచ్చు. తాము అధికారంలోకి వస్తే రేషన్ కార్డు ఉన్న ప్రతీ ఒక్కరికి ఉచితంగా రిఫ్రిజ్‌రేటర్ అందిస్తామని పళనిస్వామి హామీ ఇచ్చారు.

అటు అధికార పార్డీ డీఎంకే ప్రతీ నెల కుటుంబానికి వెయ్యి రూపాయలు ఇస్తుంటే.. అన్నాడీఏంకే దానికి రెట్టింపు అంటే 2 వేలు ఇస్తామని ప్రకటించింది. డీఎంకే బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణాన్ని కల్పిస్తుంటే, అన్నాడీఎంకే పురుషులకు కూడా ఈ పథకాన్ని వర్తింపచేస్తామని హామీ ఇచ్చింది.

ఇదిలా ఉంటే తమిళనాడులో సరికొత్త రాజకీయం చేస్తానంటూ చెబుతున్న నటుడు విజయ్ కూడా ఈ ఉచితాల హామీలను ప్రకటించారు. అయితే ఈ హామీల విషయంలో విజయ్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారన్న అభిప్రాయం వ్యక్తమైంది. యువతను, మహిళలను ఆకట్టుకునేలా హామీలు ఇచ్చారు. నిరుద్యోగ గ్రాడ్యుయేట్లకు రూ.4 వేల భృతి , ప్రతీ కుటుంబానికి ఏడాదికి 6 ఉచిత గ్యాస్ సిలిండర్లు వంటి హామీలు ఉన్నాయి.

Tamilnadu

తాము ఎన్నికల్లో గెలిస్తే రేషన్ కార్డు ఉన్నవారికి రూ.2500 ఇస్తామని ప్రకటించింది. అలాగే ఉన్నత చదువులు చదివే విద్యార్థులకు ఉచితంగా ల్యాప్ టాప్ లు అందిస్తామని హామీ ఇచ్చింది. మొత్తం మీద ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఈ ఉచితాల హామీలు నెరవేర్చాలంటే బడ్జెట్ లో లక్షలాది కోట్లు వెచ్చించాల్సిందే.

కరోనా తర్వాత చాలా రాష్ట్రాల్లో ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. కేంద్రం నుంచి వచ్చే నిధులు కూడా అన్ని రాష్ట్రాలకు సమానంగా అందుతున్న పరిస్థితులు లేవు. ఒకవేళ వీటిలో కొన్ని అమలు చేసినా తిరిగి ట్యాక్సుల రూపంలో ప్రజల నుంచే వాటిని వసూలు చేస్తారన్న అవగాహన ఓటర్లలో చాలా మందికి లేకపోవడం విడ్డూరమే. ఎప్పటికైనా ఈ ఉచితాల హామీలు ఆర్థికంగా రాష్ట్రాలను దెబ్బతీస్తాయనేది వాస్తవం.

Jaggery : మీరు వాడే బెల్లం స్వచ్ఛమైనదేనా ?…కల్తీ బెల్లం ఇలా కనిపెట్టండి

Exit mobile version