Konda Surekha
తెలంగాణ రాజకీయాలలో రోజుకొక డ్రామా నడుస్తోంది. కేబినెట్ నుంచి ఉద్వాసనకు గురైన మరుసటి రోజే మాజీ మంత్రి కొండా సురేఖ పేరుతో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తలకు ఆమె ఇప్పుడు చెక్ పెట్టేశారు.
త్వరలో బిగ్ అప్‌డేట్ రాబోతోందని..ఇక నిరీక్షణకు తెరపడనుందంటూ తన పేరుతో సర్క్యులేట్ అవుతున్న సెన్సేషన్ పోస్టులతో తనకు కానీ, తన కుటుంబానికి కానీ ఎలాంటి సంబంధం లేదని ఎక్స్ వేదికగా క్లియర్ కట్ స్టేట్‌మెంట్ ఇచ్చారు. తన పేరుతో అకౌంట్లలో వచ్చే ఫేక్ న్యూస్‌ను ఎవరూ నమ్మొద్దని కోరుతూ, తన ఒరిజినల్ సోషల్ మీడియా ప్రొఫైల్ వివరాలను కూడా పంచుకున్నారు.
ఆగస్ట్ నెలలో వరంగల్ జిల్లాలో జరిగిన ఒక పొలిటికల్ మీటింగ్‌లో కొండా సురేఖ కుమార్తె సుస్మిత, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన, ఆయన కుటుంబ సభ్యులపైన తీవ్రమైన ఆరోపణలు చేశారు. అంతేకాకుండా వచ్చే ఎన్నికల్లో పరకాల నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డికి ఓటు వేయాలని రేవంత్ రెడ్డి పిలుపునివ్వడంపై సుస్మిత తీవ్రంగా మండిపడ్డారు.
కాంగ్రెస్ తరఫున ప్రకాశ్ రెడ్డి బరిలో నిలిచినా సరే, తాను కచ్చితంగా పరకాల నుంచే పోటీ చేస్తానని అనడం పెద్ద చర్చకు దారి తీసింది. ఈ కామెంట్స్ పై పార్టీ క్రమశిక్షణా కమిటీ సురేఖకు షోకాజ్ నోటీసు జారీ చేయగా.. కూతురు చేసిన వ్యాఖ్యలకు తనను బాధ్యురాలిని చేయడం ఏంటని సురేఖ ఇచ్చిన రిప్లైపై అధిష్టానం ఫుల్ సీరియస్ అయింది.
దాంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిఫార్సుతో గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా సెప్టెంబర్ 3న కొండా సురేఖను మంత్రివర్గం నుంచి తొలగిస్తూ అఫీషియల్ నోటిఫికేషన్ ఇచ్చారు. హస్తినలో పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాష్ట్ర ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్‌లతో చర్చించిన తర్వాతే కాంగ్రెస్ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
అయితే తనను మంత్రి పదవి నుంచి తీసేయడంపై ఘాటుగా స్పందించిన సురేఖ ..సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అధిష్టానాన్ని బ్లాక్ మెయిల్ చేసి తనను కేబినెట్ నుంచి పక్కన పెట్టించారని తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ మొత్తం కుట్ర వెనుక రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి, ఎంపీ వేం నరేందర్ రెడ్డి ఉన్నారంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు.
ఇక పార్టీ మార్పు ప్రచారంపై రియాక్టయిన కొండా సురేఖ(Konda Surekha).. తాను కానీ, తన భర్త కొండా మురళి కానీ కాంగ్రెస్ పార్టీని వీడే ప్రసక్తే లేదని క్లారిటీ ఇచ్చేశారు. తాను ఎక్కడికీ వెళ్లడం లేదని తేల్చి చెబుతూ.. బీజేపీలో చేరడం లేదా కొత్త పొలిటికల్ పార్టీ పెట్టడం వంటి వార్తలను పూర్తిగా తోసిపుచ్చారు. సొంత పార్టీ నేతలపైనే ఆరోపణలు చేస్తూ, మరోవైపు కాంగ్రెస్‌లోనే ఉంటానని కొండా సురేఖ క్లారిటీ ఇచ్చేయడంతో .. రాబోయే రోజుల్లో తెలంగాణ కాంగ్రెస్ పాలిటిక్స్ ఏ మలుపు తిరుగుతాయో చూడాలి.
మీడియా మిత్రులకు నమస్కారం..
వివిధ సోషల్ మీడియా వేదికల్లో మా పేరుతో ప్రచారమవుతున్న వార్తలతో గానీ, పోస్టులతో గానీ మాకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేస్తున్నాము.
మా అధికారిక సోషల్ మీడియా ఖాతాల వివరాలను కింద జతపరిచాము. మీడియా మిత్రులు మరియు ప్రజలు కేవలం ఈ అధికారిక ఖాతాల ద్వారా… pic.twitter.com/7LDlfRz0IX
— Konda Surekha (@iamkondasurekha) September 4, 2026
Konda Surekha : అటాకింగ్ మోడ్‌లోకి కొండా ఫ్యామిలీ.. సురేఖ కాంగ్రెస్‌కి గుడ్ బై చెప్పేస్తున్నారా?
