12 Jyotirlingas
మన సనాతన ధర్మంలో మహా శివుడిని శాస్త్రాలు కేవలం ఒక ఆకారంగా మాత్రమే చూడలేదు. శివయ్య వ్యాపించి ఉన్న అనంతమైన కాస్మిక్ ఎనర్జీగా కూడా భావిస్తారు. బయట అనంత విశ్వంలో మహత్తరమైన శక్తి క్షేత్రాలుగా వెలిగే 12 జ్యోతిర్లింగాలు(12 Jyotirlingas)గా, అవి మన బాడీలోని నాడీ వ్యవస్థకు, మనిషి మానసిక తరంగాలకు (Mind Waves) ప్రతిరూపాలుగా కూడా చెబుతారు.
మన మైండ్ నుంచి బయలుదేరే 12 ముఖ్యమైన నాడులు (Cranial Nerves) మన ఆలోచనలను, ఎమోషన్స్‌ను, ప్రవర్తనను ఎలా కంట్రోల్ చేస్తుంటాయో.. ఈ 12 జ్యోతిర్లింగాలు(12 Jyotirlingas) కూడా మన అంతరంగంలో ఆ శక్తిని అలాగే రగిలిస్తుంటాయి. మనుషులలో వెలిగే ఆ 12 దివ్య చైతన్య దీపాల వెనుకున్న ఆశ్చర్యకరమైన, అత్యంత ఆసక్తికరమైన సైంటిఫిక్ అండ్ ఆస్ట్రల్ సీక్రెట్స్ గురించి తెలుసుకుంటే మనసంతా తన్మయత్వానికి గురవ్వడం ఖాయం.
మొదటిది గుజరాత్‌లో గల సోమనాథ్ జ్యోతిర్లింగం.. ఇది ప్రశాంతత, అశాంత మనస్సుకు విశ్రాంతిగా చెబుతారు. నిత్యం ఆలోచనలతో, తీవ్రమైన మానసిక ఒత్తిడితో, ఎమోషన్స్‌తో కష్టపడే మనస్సుకు ఇది ఒక పరమ పవిత్రమైన విశ్రాంతి ధామంగా ఈ ఆలయం ప్రసిద్ధి. సోముడు అంటే చంద్రుడు, మనస్సుకు అధిపతి. మన మెదడులోని ఆల్ఫ్యాక్టరీ నాడి మన భావాలని కంట్రోల్ చేస్తుంది. ఆలోచనల సుడిగుండంలో చిక్కుకున్న మెదడును క్షణాల్లో ప్రశాంతపరిచి, వెన్నెల వంటి చల్లదనాన్ని, సాఫ్ట్‌నెస్‌ను ఇచ్చే దివ్య శక్తి సోమనాథ్‌ది.
రెండోది శ్రీశైలం ఉన్న మల్లికార్జునుడి ఆలయం .. శివశక్తి సంయోగం, శ్రమ మరియు దైవకృప సమతుల్యతగా ఈ ఆలయం గురించి చెబుతారు. జీవితంలో మనందరం పడే కష్టాలకి, మనకు అందే దైవానుగ్రహానికి (Grace) నడుమ పర్ఫెక్ట్ బ్యాలెన్స్ తీసుకొచ్చే పవిత్ర క్షేత్రం. కేవలం శ్రమతోనే మనం అంతా సాధించలేం, ఆ జగన్మాత భ్రమరాంబ, మల్లికార్జునుల ప్రేమ, ఆశీస్సులు మనపై కురిసినప్పుడే విజయం దక్కుతుంది. మన కంటి చూపును, విచక్షణా జ్ఞానాన్ని కంట్రోల్ చేసే ఆప్టిక్ నాడికి మధ్య ఈ శివశక్తి సంయోగమే అసలైన బలంగా చెబుతారు.
మూడోది ఉజ్జయిని మహాకాళేశ్వరుడి ఆలయం.. కాలం, మృత్యువు, భయరాహిత్యానికి కేరాఫ్‌గా ఈ ఆలయం గురించి చెబుతారు. కాలానికి, మృత్యువుకు అతీతుడైన ఉగ్రతేజస్సు ఈ మహాకాళుడు. మనిషిలో దాగిన మరణ భయాన్ని, ఫ్యూచర్ గురించి అభద్రతా భావాన్ని బూడిదలో వేసి, క్షణభంగురమైన ఈ జీవితాన్ని దాటి శాశ్వతమైన ఆత్మ తత్వాన్ని దర్శించేలా చేసే మహా శక్తి ఈ మహాకాళేశ్వరుడి ఆలయం . మన దృష్టిని కాన్సన్‌ట్రేషన్‌గా నిలిపే ఆక్యులోమోటార్ నాడికి ఈ క్షేత్రమే మూలంగా చెబుతారు.
నాలుగోది మధ్యప్రదేశ్‌లో ఉన్న ఓంకారేశ్వరుడి ఆలయం .. ప్రణవ నాదం మరియు అంతర్ముఖ ధ్యానంగా పురాణాలు చెబుతాయి. సృష్టికి ఆద్యంతమైన ఓంకార నాదానికి ఇది ప్రాణరూపం. బయటి ప్రపంచంలోని ఒత్తిడి నుంచి మనస్సును తప్పించి, మన ఇన్నర్ వరల్డ్‌లో ఎప్పుడూ మోగే అనాహత ధ్వని ద్వారా డీప్ మెడిటేషన్ స్థితికి తీసుకెళ్లే శక్తి ఇది. మన లోపలికి మనం తొంగి చూసేలా చేసే ట్రోక్లియర్ నాడికి ఈ ఓంకార నాదమే దివ్యౌషధంగా చెబుతారు.
ఐదోది ఉత్తరాఖండ్‌లో గల కేదార్‌నాథ్ ఆలయం.. హయ్యర్ కాన్సియస్ అండ్ తిరుగులేని సంకల్ప బలంకు సంకేతంగా చెబుతారు. హిమాలయాల అత్యున్నత శిఖరాల్లో గడ్డకట్టే చలిలో కూడా వెలిగే ఈ లింగం, మన మైండ్‌లోని మాస్టర్ గ్లాండ్స్ (ప్యూటరీ, పీనియల్) కు సైన్ అని అంటారు. మనలోని పరిమితమైన ఆలోచనలను, బలహీనతలను తుడిచేసి, కొండంత కాన్ఫిడెన్స్‌ను, ఉన్నతమైన టార్గెట్‌ను సాధించే మైండ్ పవర్‌ను ఇచ్చే అత్యున్నత చైతన్య దీపం కేదార్‌నాథ్ అని పిలుస్తారు.
ఆరోది మహారాష్ట్రలోని భీమాశంకరుడి ఆలయం .. అపారమైన జీవశక్తి మరియు రక్షణకు సింబల్‌గా చెబుతారు.మన వెన్నుపాము, నాడీ వ్యవస్థలో ఎలక్ట్రిక్ వేవ్స్‌లా ప్రవహించే ప్రాణ శక్తి (Bio-energy) అన్నమాట. మానసికంగా కుంగిపోయినప్పుడు మనలోని ఫిజికల్ అండ్ మెంటల్ ధైర్యాన్ని నిద్రలేపి, ఎలాంటి డిజార్డర్‌ను ఎదుర్కొనే శక్తిని ఇచ్చే అబ్డుసెన్స్ నాడికి ఈ భీమేశ్వర స్వరూపమే రక్షణ కవచమని అంటారు.
ఏడోది ఉత్తరప్రదేశ్‌లో ఉన్న కాశీ విశ్వనాథుడి ఆలయం .. ఆనంద భావం మరియు జ్ఞాన ప్రకాశానికి గుర్తుగా చెబుతారు
కాశీ అంటేనే ఎప్పుడూ ప్రకాశించే వెలుగు. మన ముఖంలో కనిపించే కామ్‌నెస్, చిరునవ్వు, ఆనందమయ స్థితికి మూలమైన ఫేషియల్ నాడిని ఇది రిప్రజెంట్ చేస్తుంది. అజ్ఞానం అనే చీకట్లను పటాపంచలు చేసి, సత్యమైన ఆధ్యాత్మిక ఆనందాన్ని, పరమాత్మ జ్ఞానాన్ని ప్రసరించే దివ్య ప్రకాశంగా కాశీ విశ్వనాథుడి గురించి అంటారు.
ఎనిమిదోది మహారాష్ట్రలోని త్రయంబకేశ్వరుడి ఆలయం .. ముక్కంటి చూపు మరియు లైఫ్ బ్యాలెన్స్‌కు గుర్తుగా భావిస్తారు. భూత, భవిష్యత్, వర్తమానాలను అబ్జర్వ్ చేసే త్రయంబక తత్వం. మన ఆలోచనలు, భావోద్వేగాలు హద్దులు దాటిపోకుండా, జీవితంలో అలాగే నాడీ వ్యవస్థలో పర్ఫెక్ట్ బ్యాలెన్స్ (Samatulya) ను కాపాడే వెస్టిబులోకోక్లియర్ నాడికి ఈ క్షేత్రమే ప్రాణాధారంగా చెబుతారు.
తొమ్మిదవది జార్ఖండ్‌లో ఉన్న వైద్యనాథుడి ఆలయం .. ఆరోగ్య ప్రధాత మరియు మనోవ్యాధి నివారణకు ప్రతీకగా చెబుతారు. మన శరీరంలోని రెసిస్టెన్స్ పవర్‌కి, ఆత్మ బలానికి పరమౌషధం. కేవలం శారీరక రోగాలనే కాదు, మనస్సును పిండిపిప్పి చేసే ఈర్ష్య, ద్వేషం, ఆందోళన వంటి మానసిక రోగాలను (Psychosomatic Disorders) కూడా సంపూర్ణంగా నయం చేసే ధన్వంతరి స్వరూపమే ఈ వైద్యనాథ తత్వం అని నానుడి.
పదోది గుజరాత్‌లోని నాగేశ్వరుడి ఆలయం .. వేగస్ నాడి మరియ నిర్భయత్వానికి గుర్తుగా చెబుతారు.
బ్రెయిన్ నుంచి హార్ట్, లంగ్స్‌ను కలుపుతూ బాడీని కంట్రోల్ చేసే వేగస్ నాడికి, వెన్నుపాముకు ప్రతీక ఈ నాగం. మనస్సులో వేధిస్తున్న దాగి ఉన్న ఇన్‌సెక్యూర్డ్ ఫీలింగ్‌ను, అనుమానాలను తుడిచిపెట్టి, గుండె నిండా ధైర్యాన్ని, కొండంత అభయాన్ని ఇచ్చే పరమ రక్షణే నాగేశ్వరుడు.
పదకొండవది తమిళనాడులో గల రామేశ్వరుడి ఆలయం.. బాధ్యత, సహనం మరియు ధర్మ రక్షణకు సింబల్‌గా చెబుతారు. లైఫ్‌లో ఎదురయ్యే ఛాలెంజెస్, కుటుంబ, సొసైటీ బాధ్యతలను మోసే మన భుజ స్కంధాలకు ఇది ప్రాతినిధ్యం వహిస్తుంది. కష్టాలు ఎదురైనప్పుడు అధర్మ బాట పట్టకుండా, అనంతమైన సహనంతో ధర్మాన్ని నిలబెట్టే శక్తిని ఇచ్చే యాక్సెసరీ నాడికి రామేశ్వర క్షేత్రమే ప్రేరణ.
పన్నెండవది మహారాష్ట్రలో ఉన్న ఘృష్ణేశ్వరుడు.. వాక్శుద్ధి, ఆత్మ సమగ్రత మరియు సంపూర్ణత్వం. మనం మాట్లాడే ప్రతీ మాట, పలికే ప్రతీ మంత్రంతో పాటు మన పర్సనాలిటీని కంట్రోల్ చేసే చివరి నాడి హైపోగ్లోసల్. మన నోటి వెంట వచ్చే ప్రతీ మాటలోనూ అమృతాన్ని అలాగే నిజాయితీని నింపి, సొసైటీలో అత్యున్నత గౌరవాన్ని అందించి, మనిషి జన్మను ఆధ్యాత్మికంగా పరిపూర్ణం చేసే దివ్య ముగింపుగా ఘృష్ణేశ్వరుడి గురించి చెబుతారు.
ఈ 12 జ్యోతిర్లింగాలు ఎక్కడో భౌగోళికంగా ఉన్న ప్రాచీన ఆలయాలు మాత్రమే కాదు. మన శరీరంలో, మన బ్రెయిన్‌లో నిత్యం వెలిగే 12 చైతన్య ఎలక్ట్రికల్ తరంగాలు . ఈ రహస్యాన్ని గుర్తించి మీ లోపల ఉన్న శివతత్వాన్ని దర్శించినప్పుడు, మీ లైఫ్‌లో అద్భుతాలు జరగడం ఖాయమని పండితులు చెబుతున్నారు.
Age For Marriage : పెళ్లికి ఏజ్ ఒక్కటే సరిపోదా?..మ్యారీడ్ లైఫ్‌ను లీడ్ చేసే మెచ్యూరిటీ ఉండాలా?
