Temple : గుడి పక్కన ఎత్తైన భవనాలు ఎందుకు కట్టకూడదు? ఈ నియమం వెనుకున్న ఆ 4 కారణాలేంటి

Temple : మన ఊరిలో ఎన్ని ఇళ్లు, భవనాలున్నా కూడా అన్నిటికంటే ఎత్తుగా ఆలయ గోపురం ఉండటం గమనిస్తూ ఉంటాం. చాలామంది దీనిలో దైవభక్తి , మూఢనమ్మకం ఉన్నాయని అనుకుంటారు. కానీ దీని వెనుక అద్భుతమైన ఆర్కిటెక్చర్ సైన్స్, ఇంజనీరింగ్ , స్పేస్ సైన్స్ రహస్యాలున్నాయి.

Temple

పూర్వం ఊరు ఏదైనా కానీ.. ఆ ఊరి మధ్యలో కానీ ఒక ప్రధాన ప్రదేశంలో కానీ గుడిని కట్టేవారు. ఆ గుడి(Temple) గోపురం ఎత్తు చుట్టుపక్కల ఉండే ఇళ్లు, భవనాల కంటే చాలా ఎక్కువగా ఉండేలా చూసేవారు. చాలామంది దీనిలో దైవభక్తి , మూఢనమ్మకం ఉన్నాయని అనుకుంటారు.

అయితే దీని వెనుకున్న మొదటి కారణం.. ప్రకృతి వైపరీత్యాల నుంచి, ముఖ్యంగా పిడుగుల నుంచి ఊరిని రక్షించడమే. వర్షాకాలంలో ఆకాశం నుంచి పడే పిడుగుల్లో లక్షల వోల్టుల ఎలక్ట్రిక్ పవర్ ఉంటుంది. అదే కనుక ఇళ్లపై పడితే ప్రాణనష్టం, ఆస్తి నష్టం జరుగుతుంది. ఈ ప్రమాదం నుంచి ఊరిని కాపాడటానికి గుడి(Temple) గోపురాలను ఒక రక్షణ కవచంలా డిజైన్ చేసేవారు.

దీనిలో భాగంగానే గుడి గోపురం పైన బంగారంతో, రాగితో చేసిన కలశాలు కనిపిస్తాయి. సైన్స్ పరంగా చూస్తే ఇవి అలంకార వస్తువులేమీ కావు, ఇవి అద్భుతమైన లైట్నింగ్ అరెస్టర్స్ అంటే పిడుగులను ఆకర్షించే సాధనాలుగా పనిచేస్తాయి. రాగి , బంగారానికి విద్యుత్‌ను చాలా వేగంగా తమ గుండా పంపే గుణం (High Conductivity) ఉంటుంది. దీంతో ఆకాశంలో పిడుగు పడే ఛాన్స్ ఉన్నప్పుడు.. ఆ విద్యుత్ శక్తి ఊళ్లో ఉన్న ఇళ్లపై పడకుండా, అన్నింటికంటే ఎత్తుగా ఉన్న ఈ గుడి పైనున్న కలశాలు తమ వైపునకు లాక్కుంటాయి.

ఇలా కలశాలు ఆకర్షించిన పిడుగు శక్తిని.. గుడి లోపల నిర్మించిన ప్రత్యేకమైన రాగి వైర్లు , లోహపు కడ్డీల ద్వారా డైరెక్టుగా భూమిలోకి పంపించేస్తారు. దీన్నే సైన్స్ భాషలో ఎర్తింగ్ (Earthing) అంటారు. అంటే ఊరిపై పడాల్సిన ఒక వినాశకర శక్తిని గుడి గోపురం తనపైకి లాక్కుని దాన్ని ఏమాత్రం నష్టం జరగకుండా తిరిగి భూమిలోకి పంపేస్తుంది. ఈ రక్షణ వ్యవస్థ కరెక్ట్‌గా పనిచేయాలంటే మాత్రం..ఊరిలోని ఏ భవనం కూడా ఆలయ గోపురం కంటే ఎత్తుగా ఉండకూడదు. ఒకవేళ గోపురం కంటే ఎత్తైన బిల్డింగ్ కడితే.. పిడుగు ఆలయంపై కాకుండా ఆ బిల్డింగ్‌పై పడే ప్రమాదం ఉంటుంది.

Temple

దీని వెనుక మరో ఆసక్తికరమైన స్పేస్ సైన్స్ అండ్ మేనేజ్‌మెంట్ కోణం కూడా ఉంది. పూర్వం కమ్యూనికేషన్ వ్యవస్థలు, గూగుల్ మ్యాప్స్ లేవు. చుట్టుపక్కల దట్టమైన అడవులు, కొండలు ఉండేవి. అటువంటప్పుడు దూర ప్రాంతాల నుంచి వచ్చే ప్రయాణికులకు దారి తెలియడానికి వీలుగా ఈ ఎత్తైన గోపురాలు దిక్సూచిలా (Navigation guide) సాయం చేసేవి. ఎంత దూరం నుంచి చూసినా గుడి గోపురం కనిపిస్తుంది కాబట్టి, దాన్ని బట్టి ఊరు వారికి ఇంకా ఎంత దూరంలో ఉందో అంచనా వేసేవారు.

అలాగే గుడి(Temple) పైన ఉండే కలశాల లోపల నవధాన్యాలను నింపేవారు. ఇవి కూడా సైన్స్ పరంగా చూస్తే.. పిడుగులోని రేడియేషన్‌ను తట్టుకోవడానికి సహాయపడతాయి. దీంతో పాటు మరో కారణం కూడా ఉంది. ఎప్పుడైనా భారీ వరదలు, కరువు వచ్చి ఊరంతా మునిగిపోయినా, ధాన్యం నాశనమైపోయినా.. ఆపద కాలంలో ఆ ఊరి ప్రజలు ఆకలితో అలమటించకుండా, గోపురం పైనున్న కలశాలలోని ఆ ధాన్యాలను తీసి పంటలు పండించడానికి వాడే విత్తనాలుగా ఉపయోగించేవారు.

Aquarius : సమాజ శ్రేయస్సు, ఒంటరిగా ఉండే మనస్తత్వం..కుంభరాశి వారి మైండ్ సెట్ ఇదే

Exit mobile version