Big Boss -10 : బిగ్ బాస్-10 లాంచ్ డేట్ లీక్..15 వారాల నాన్‌స్టాప్ డ్రామాకి టైమింగ్స్ ఫిక్స్

Big Boss -10 : ఆగస్టు 15 నుంచి స్టార్ మా ఛానల్‌ అలాగే జియో హాట్‌స్టార్ ఓటీటీలో సుమారు 15 రోజుల పాటు ఈ అగ్నిపరీక్ష ఎపిసోడ్లు స్ట్రీమింగ్ కాబోతున్నాయి.

Big Boss -10

తెలుగు ఆడియన్స్‌కి బుల్లి తెర ముందు పూనకాలు తెప్పించే ఏకైక బిగ్గెస్ట్ రియాలిటీ బిగ్ బాస్ షో అంటే చాలామంది ఒప్పుకోకపోవచ్చు కానీ ఇదే నిజం. వరుసగా రచ్చ రంబోలా సీజన్లను 9 సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేసుకున్న బిగ్ బాస్ షో, ఇప్పుడు పదో మైలురాయిని అందుకోవడానికి అదో జోష్‌తో వీర లెవెల్లో రెడీ అయిపోయింది. అయితే ఈసారి మాత్రం మేకర్స్ ప్లాన్ మామూలుగా లేదని.. పిచ్చ ప్లానింగ్‌తో వస్తున్నారని తెలుస్తోంది.

ఎప్పటిలాగే కేవలం సెలబ్రెటీలనే కాకుండా కామన్ పీపుల్‌ని కూడా హౌస్‌లోకి దింపి రచ్చ లేపడానికి అగ్నిపరీక్ష పేరుతో ఆడిషన్స్ గట్టిగానే నిర్వహించారు. ఆ సెలక్షన్ ప్రాసెస్ అంతా పూర్తయి, ఫైనల్ రౌండ్‌కి ఎంపికైన వారి రచ్చను స్మాల్ స్క్రీన్‌పై చూపించడానికి అంతా సిద్ధమైంది.

ఆగస్టు 15 నుంచి స్టార్ మా ఛానల్‌ అలాగే జియో హాట్‌స్టార్ ఓటీటీలో సుమారు 15 రోజుల పాటు ఈ అగ్నిపరీక్ష ఎపిసోడ్లు స్ట్రీమింగ్ కాబోతున్నాయి. దీంతో ఈసారి హౌస్ లోపలికి వెళ్లి తమ లక్ పరీక్షించుకునే ఆ లక్కీ కామన్ మేన్ ఎవరా అని నెటిజన్లు ఆసక్తిని చూపిస్తున్నారు.

అయితే ఏ రోజ కింగ్ నాగార్జున బిగ్ బాస్ హౌస్ డోర్లు తెరిచి షో స్టార్ట్ చేస్తారని ఈగర్‌గా వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్‌కి.. ఒక క్రేజీ న్యూస్ బయటికొచ్చింది. దీంతో లాంచ్ డేట్ లీక్ అయిపోయిందంటూ సోషల్ మీడియాలో ఈ వార్త తెగ వైరల్ అవుతోంది. దీని ప్రకారం సెప్టెంబర్ 6వ తేదీ ఆదివారం గ్రాండ్‌గా బిగ్ బాస్ సీజన్ 10(Big Boss -10) గ్రాండ్ లాంచ్‌కి ముహూర్తం ఫిక్స్ చేశారట.

అదే రోజు సాయంత్రం కంటెస్టెంట్లందరినీ క్రేజీగా ఇంట్రడ్యూస్ చేస్తూ హౌస్‌లోకి పంపించబోతున్నారట. దీనిని బట్టి ఆ మర్నాడు అంటే సెప్టెంబర్ 7 సోమవారం నుంచి అసలైన టాస్క్‌లు, నామినేషన్స్, లవ్ అండ్ ఫైట్స్ డ్రామా షురూ కాబోతున్నట్లు తెలుస్తుంది. దాదాపు 15 వారాల పాటు ఈ రియాల్టీ హంగామా సాగనుంది.

Big Boss -10

ఇక బిగ్ బాస్ 10(Big Boss -10) సీజన్ షో టైమింగ్స్ విషయానికి వస్తే.. పాత ఫార్మాట్‌లోనే మండే నుంచి ఫ్రైడే వరకు డైలీ రాత్రి 9:30 గంటలకు ఎపిసోడ్స్ టెలికాస్ట్ అవుతాయి. వీకెండ్స్‌లో మాత్రం కింగ్ నాగార్జున వీకెండ్ క్లాస్ పీకడానికి రాత్రి 9:00 గంటలకే ఎంట్రీ ఇస్తారు.

కాగా టీవీలో బిగ్ బాస్ హంగామా మిస్సయిన వాళ్లు జియో హాట్‌స్టార్ ఓటీటీలో ఎప్పుడైనా చూడొచ్చు. ఎప్పటిలాగే నాగ్ తనదైన మాస్ అండ్ క్లాస్ స్వైగ్‌తో హోస్టింగ్‌కి సిద్ధమైపోయారు. సరిగ్గా ఈ షోకు నెల రోజులు మాత్రమే టైమ్ ఉండటంతో.. ఈసారి హౌస్‌లో రచ్చ లేపబోయే ఆ సెలబ్రిటీలు, కామన్ పీపుల్ ఎవరో చూడాలంటే ఇక కౌంట్‌డౌన్ స్టార్ట్ అని అనాల్సిందే.

N.R. Narayana Murthy : రూ.10 వేల అప్పుతో 17 వేల కోట్ల సామ్రాజ్యం.. భారత ఐటీ పితామహుని ప్రస్థానం తెలుసా ?

Exit mobile version