Varanasi: సృష్టికి ముందే పుట్టిన వారణాసి.. కాశీ గురించి మీకు తెలియని అద్భుత రహస్యాలు

Varanasi: ప్రళయ కాలంలో ప్రపంచమంతా నీటిలో మునిగిపోయినా, కాశీ మాత్రం సురక్షితంగా ఉంటుందని.. ఆ సమయంలో శివుడు తన త్రిశూలంతో ఈ కాశీ నగరాన్ని పైకి ఎత్తి కాపాడతాడని భక్తుల నమ్మకం.

Varanasi

కాశీ పట్టణం అంటే ఒక నగరం మాత్రమే కాదు, అదొక అనంతమైన ఆధ్యాత్మిక శక్తికి నిలయంగా చెబుతారు స్థానికులు. భూలోకంలో ఉంటూనే స్వర్గలోకపు అనుభూతిని పొందే క్షేత్రం ఏదైనా ఉందంటే అది వారణాసి(Varanasi) మాత్రమే అంటారు. గంగానది తరంగాల సాక్షిగా, విశ్వనాథుడి అడుగుజాడల్లో నడిచే ఈ కాశీ పుణ్యభూమి గురించి ఎన్ని గ్రంథాలు రాసినా తక్కువే. మారుతున్న కాలంలో కూడా తన ప్రాచీన వైభవాన్ని కోల్పోకుండా, కోట్లాది మందికి మోక్ష మార్గాన్ని చూపిస్తున్న కాశీ క్షేత్రం గురించి చాలామందికి తెలియని అనేక అద్భుతమైన , రహస్యమైన విషయాలున్నాయి.

సృష్టికి అతీతమైన పరమేశ్వరుని నగరం..పురాణాలు చెబుతున్నదాని ప్రకారం కాశీ నగరం బ్రహ్మదేవుని సృష్టిలో భాగం కాదు. కాశీ క్షేత్రం సాక్షాత్తు విష్ణుమూర్తి హృదయం నుంచి వెలువడిందని, సృష్టి ప్రారంభంలోనే పరమశివుడు దీనిని తన నివాస స్థలంగా నిర్మించుకున్నాడని పురాణాలు చెబుతాయి. అందుకే ప్రళయ కాలంలో ప్రపంచమంతా నీటిలో మునిగిపోయినా, కాశీ మాత్రం సురక్షితంగా ఉంటుందని.. ఆ సమయంలో శివుడు తన త్రిశూలంతో ఈ కాశీ నగరాన్ని పైకి ఎత్తి కాపాడతాడని భక్తుల నమ్మకం. ఆ నగరం ధనుస్సు ఆకారంలో ఉండి, ఒక లింగ స్వరూపంగా దర్శనమిస్తుంటుంది.

కాలభైరవుడి అనుమతి లేనిదే కాశీలోకి ప్రవేశం అసాధ్యం..కాశీ క్షేత్రానికి పాలకుడు కాలభైరవుడుగా చెబుతారు. ఎన్నో జన్మల పుణ్యఫలం ఉంటే తప్ప కాలభైరవుడు ఏ జీవిని కూడా కాశీలోకి అనుమతించడట. అంతేకాకుండా ఇక్కడ ఒక విచిత్రమైన నమ్మకం ఉంది. ఎవరైనా కాశీలో అడుగుపెడితే, వారి పాపపుణ్యాల చిట్టా చిత్రగుప్తుని వద్ద నుండి కాలభైరవుని వద్దకు చేరుతుందని అంటారు.

వారణాసి(Varanasi)లో శిక్షలు అనుభవించిన తర్వాతే ఎవరికి అయినా మోక్షం లభిస్తుంది. అందుకే కాశీలో కాలభైరవుని దర్శనం చేసుకున్నప్పుడు పూజారులు వీపుపై కర్రతో కొట్టి, నల్లని కాశీ దారం కట్టడం ఆనవాయితీగా వస్తుంది. దీనివల్ల భవిష్యత్తులో పాపాలు అంటకుండా రక్షణ లభిస్తుందని నమ్ముతారు.

మరణం ఇక్కడ మోక్షానికి ద్వారం..సాధారణంగా చావు అంటే భయం కలుగుతుంది, కానీ కాశీలో చనిపోవడం అనేది ఒక వరం అంటారు పెద్దలు. కాశ్యాంతు మరణాన్ ముక్తి” అని పెద్దలు చెబుతుంటారు. ఎందుకంటే ఇక్కడ చనిపోయిన ప్రతి జీవికి శివయ్య స్వయంగా దర్శనమివ్వడంతో పాటు వారి చెవిలో తారక మంత్రాన్ని పలికి వారికి మోక్షం ప్రసాదిస్తాడట.

అందుకే జీవిత చరమాంకంలో ఉన్న చాలామంది కాశీకి వెళ్లి అక్కడే ప్రాణాలు వదలాలని కోరుకుంటారు. కాశీలో మరణించిన వారికి పునర్జన్మ ఉండదు. అంతేకాదు ఇక్కడి గంగానది దక్షిణాభిముఖంగా ప్రవహించడం మరో విశేషంగా చెబుతారు ఎందుకంటే ఇతర ప్రాంతాల్లో కనిపించని ఈ అరుదైన దృశ్యం ఇక్కడే కనిపిస్తుంది.

కాశీలోని వింతలు ,రహస్యాలు.. కాశీలో(Varanasi) కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు కూడా కనిపిస్తాయి. ఇక్కడ ఆకాశంలో గ్రద్దలు ఎగరవట, బల్లులు అరవవట, ఆవులు ఎవరినీ పొడవవట. అన్నిటికంటే వింతైన విషయం ఏంటంటే, ఇక్కడ చనిపోయిన తర్వాత వారి శరీరం నుంచి దుర్వాసన రాదట .

అలాగే మరణించిన ప్రతి జీవి కుడి చెవి పైకి లేచి ఉంటుందని..అక్కడి వారు చెబుతుంటారు. ఎందుకంటే మహాశివుడు వారి కుడి చెవిలోనే తారక మంత్రాన్ని పలికి వారికి మోక్షం ప్రసాదిస్తాడని ప్రతీతి. అంతేకాదు విదేశీ దండయాత్రికుల నుంచి మందిరాన్ని కాపాడుకోవడానికి పూర్వీకులు ఈ కాశీనగరాన్ని ఒక పద్మవ్యూహంలా నిర్మించారు. అందుకే ఇప్పటికీ కాశీలోని సందులలో కొత్తవారు దారి తప్పిపోతే దొరకడం చాలా కష్టం అంటూ ఉంటారు.

గంగా తీరాన 84 ఘాట్ల వైభవం.. వారణాసి(Varanasi)లో గంగానది ఒడ్డున ఉన్న 84 ఘాట్లలో.. ఒక్కోటి ఒక్కో చరిత్రను కలిగి ఉన్నాయి. దశాశ్వమేధ ఘాట్ వద్ద బ్రహ్మదేవుడు పది సార్లు అశ్వమేధ యాగం చేశాడని పురాణాలు చెబుతాయి. ఇక్కడి గంగా హారతి ప్రపంచ ప్రసిద్ధి చెందింది.

Varanasi

అలాగే మణికర్ణిక ఘాట్ ను విష్ణుమూర్తి స్వయంగా తన సుదర్శన చక్రంతో నిర్మించినట్లు స్థల పురాణం చెబుతుంది. అందుకే ఇక్కడ నిత్యం చితి కాలుతూనే ఉంటుంది. హరిశ్చంద్ర ఘాట్ లో సత్యహరిశ్చంద్రుడు కాటికాపరిగా పనిచేసి తన సత్యాన్ని నిరూపించుకున్నట్లు చరిత్ర చెబుతుంది. ఇలా ప్రతి ఘాట్ వద్ద కూడా ఒక పవిత్రమైన శక్తి దాగి ఉంటుంది.

అందుకే కాశీ విశ్వనాథుడిని ఒక్కసారి దర్శించుకుంటే చాలు ఆ వ్యక్తి చేతి రేఖలు కూడా మారిపోతాయని, వారు చేసిన సమస్త పాపాలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. ఏది ఏమయినా కాశీ వైభవం కేవలం మాటల్లో చెప్పేది కాదు, అది అనుభవించాల్సిన ఒక ఆధ్యాత్మిక అనుభూతి అంటారు అక్కడకు వెళ్లినవారు. ఓం నమః శివాయ!

Tamil Nadu:యువత విజయ్ వెంటేనా? తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలపై తాజా సర్వే ఏం చెబుతోంది?

Exit mobile version