Aashirwad Suryavanshi
భారత క్రికెట్ ప్రపంచంలో ఇప్పుడు ఎక్కడ చూసినా వైభవ్ సూర్యవంశీ పేరు మార్మోగిపోతోంది. 15 ఏళ్ల వయసుకే ఐపీఎల్‌లో పరుగుల వరద పారించి, క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ రికార్డులనే బ్రేక్ చేసిన యువ సంచలనంగా రికార్డులు క్రియేట్ చేశాడు.
తాజాగా ఐపీఎల్ 2026 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడిన వైభవ్ సూర్యవంశీ.. ఏకంగా 16 మ్యాచ్ లలో 776 పరుగులు తీసి ప్రెస్టీజియస్ ఆరెంజ్ క్యాప్‌ను తన సొంతం చేసుకున్నాడు. విరాట్ కోహ్లీ, శుభ్‌మన్ గిల్ వంటి స్టార్ ప్లేయర్లనే వెనక్కి నెట్టేసి, జూన్ 6న ఏకంగా టీమిండియా నుంచే పిలుపు అందుకున్నాడు.
ప్రస్తుతం శ్రీలంక టూర్‌లో ఉన్న వైభవ్ సూర్యవంశీ కుటుంబం నుంచి ఇప్పుడు మరో క్రికెట్ ప్రభంజనం పేరు వార్తల్లో తిరుగుతోంది. అన్న బాటలోనే నడుస్తున్న తమ్ముడు ఆశీర్వాద్ సూర్యవంశీ(Aashirwad Suryavanshi) కేవలం 10 ఏళ్ల వయసులోనే తన కెరీర్‌లో తొలి సెంచరీ బాది అందరినీ ఆశ్చర్యపరిచాడు.
బీహార్‌లోని సమస్తిపూర్‌లో జరిగిన ఒక లోకల్ ప్రాక్టీస్ మ్యాచ్‌లో క్రికెట్ అకాడమీ తాజ్‌పూర్ టీమ్ తరఫున బరిలోకి దిగిన ఆశీర్వాద్(Aashirwad Suryavanshi) మైదానంలో దుమ్మురేపేశాడు. కుడిచేతి వాటం బ్యాటర్ అయిన ఈ బుడతడు 87 బంతుల్లోనే 20 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 118.39 స్ట్రైక్‌రేట్‌తో ఏకంగా 103 పరుగులు సాధించి నాటౌట్‌గా నిలిచాడు.
బ్యాటింగ్‌లో తాను కూడా అన్నకు ఏమాత్రం తక్కువ కాదని నిరూపించిన ఆశీర్వాద్ కొట్టిన సెంచరీ స్కోర్‌కార్డ్, ఫోటోలను.. అతని పెద్దన్నయ్య ఉజ్వల్ సూర్యవంశీ తన సోషల్ మీడియా అకౌంట్‌లో షేర్ చేయడంతో అవి కాస్తా నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. దీంతో క్రికెట్ లవర్స్ , నెటిజన్లు ఆశీర్వాద్‌పై అభినందనల వర్షం కురిపిస్తున్నారు.
మరోవైపు ఆశీర్వాద్ సక్సెస్‌పై స్టార్ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ కూడా స్పందించాడు. లంక టూర్‌లో బిజీగా ఉన్నా కూడా, తమ్ముడి స్కోర్ బోర్డు స్క్రీన్ షాట్ తీసి తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేస్తూ విషెస్ చెప్పాడు. ముగ్గురు అన్నదమ్ములలో ఆశీర్వాద్ అందరికంటే చిన్నవాడు.
ఇటు కొడుకుల ప్రతిభపై తండ్రి సంజీవ్ సూర్యవంశీ కూడా రియాక్టయ్యారు.. ఆశీర్వాద్ ప్రాక్టీస్ మ్యాచ్‌లోనే ఈ రేంజ్‌లో ఆడటం తనకు చాలా ఆనందంగా ఉందని, రాబోయే రెండేళ్లలో తనను కూడా వైభవ్ లాగే దేశం గర్వించే అత్యుత్తమ క్రికెటర్‌గా తీర్చిదిద్దడమే తన టార్గెట్ అని గర్వంగా చెప్పారు.
కాగా అన్న ఐపీఎల్‌లో ఆరెంజ్ క్యాప్ కొట్టి ఇండియన్ టీమ్‌కు సెలక్టయితే, తమ్ముడు 10 ఏళ్లకే సెంచరీ కొట్టి హిస్టరీ క్రియేట్ చేస్తున్నాడు. మొత్తం మీద ఈ సూర్యవంశీ బ్రదర్స్ ఇండియన్ క్రికెట్‌ను రూల్ చేయడం ఖాయంలా కనిపిస్తోందని నెటిజన్ల కామెంట్లు వైరల్ అవుతున్నాయి.
Vaibhav Suryavanshi's younger brother Ashirwad Suryavanshi score his maiden century today.🔥
— Cricket Central (@CricketCentrl) June 12, 2026
Ashirwad Suryavanshi today score 103 runs in 87 balls including 1 six and 20 fours with strike rate of 118.39.🤯
Rajasthan Royals IPL 2027 opening partner locked.😂😭 pic.twitter.com/gO4QwQ1p64
Peddi : 9 రోజుల్లోనే పెద్ది సృష్టించిన అరాచకం .. 400 కోట్ల క్లబ్ వైపు చరణ్ మాస్ ర్యాంపేజ్..
