Australia : కంగారూలదే కప్పు..ఫైనల్లో ఇంగ్లాండ్ చిత్తు

Australia : కంగారూలు ఏడోసారి ట్రోఫీని ఎగరేసుకుపోయారు. అందరూ ఊహించినట్టుగానే ఈ మ్యాచ్ లో ఆసీస్ జట్టు అన్ని విభాగాల్లో అదరగొట్టింది.

Australia

తమను ఛాంపియన్ జట్టు అని ఎందుకు పిలుస్తారో ఆస్ట్రేలియా(Australia) మరోసారి రుజువు చేసింది. మహిళల టీ20 ప్రపంచకప్ ను రెండో సారి కైవసం చేసుకుంది. ఫైనల్లో ఉండే ఒత్తిడిని అలవోకగా అధిగమించిన కంగారూలు ఏడోసారి ట్రోఫీని ఎగరేసుకుపోయారు. అందరూ ఊహించినట్టుగానే ఈ మ్యాచ్ లో ఆసీస్ జట్టు అన్ని విభాగాల్లో అదరగొట్టింది.

టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లాండ్‌ జట్టుకు ఆరంభంలోనే ఆసీస్ బౌలర్లు వరుస షాకులు ఇచ్చారు .ఓపెనర్ అమీ జోన్స్ (6 ) రెండో ఓవర్లోనే లూసీ హామిల్టన్ బౌలింగ్‌లో ఔటవగా,,,.మరో ఓపెనర్ డానీ వ్యాట్-హోడ్జ్ (8) కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలవలేదు. అనబెల్ సదర్లాండ్ బౌలింగ్‌లో ఆమె పెవిలియన్ చేరింది.

ఆ తర్వాత వచ్చిన స్టార్ ప్లేయర్ అలిస్ క్యాప్సే (23) ధాటిగా ఆడే ప్రయత్నంలో సోఫీ మోలినీక్స్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయింది. సీనియర్ ప్లేయర్ హీదర్ నైట్ (2) కూడా నిరాశపరిచింది. ఈ దశలో నాట్ సీవర్-బ్రంట్ కెప్టెన్ ఇన్నింగ్స్‌తో ఆదుకుంది.

ఒకవైపు వికెట్లు పడుతున్నా బ్రంట్ బాధ్యతాయుతంగా ఆడి జట్టుకు మంచి స్కోరు అందించింది. ఆమె 53 బంతుల్లో 5 ఫోర్ల సహాయంతో 58 పరుగులు చేసి అజేయంగా నిలిచింది.చివర్లో బ్యాటింగ్‌కు వచ్చిన యువ ప్లేయర్ ఫ్రేయా కెంప్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడింది.

ఆమె కేవలం 28 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్సర్‌తో 44 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచింది.కెప్టెన్ సీవర్-బ్రంట్, ఫ్రేయా కెంప్ కలిసి ఐదో వికెట్‌కు కీలక భాగస్వామ్యం నెలకొల్పడంతో ఇంగ్లాండ్ జట్టు గౌరవప్రదమైన స్కోరు సాధించగలిగింది. ఆసీస్ బౌలర్లలో కిమ్ గార్త్, హామిల్టన్, సదర్లాండ్, సోఫీ ఒక్కో నికెట్ పడగొట్టారు,తర్వాత ఛేజింగ్ లో ఆస్ట్రేలియాకు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది.

Australia

ఓపెనర్ జార్జియా వోల్ (9) పరుగులకే ఔటయింది. ఈ దశలో మరో ఓపెనర్ బెత్ మూనీ , లిచ్ ఫీల్డ్ కీలక భాగస్వామ్యం నెలకొల్పారు. వీరిద్దరూ కేవలం 67 బంతుల్లోనే 100 పరుగులు జోడించారు. ఈ క్రమంలో మూనీ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోగా, లిచ్ ఫీల్డ్ 48 పరుగులకు వెనుదిరిగింది.

అటు మూనీ 49 బంతుల్లో 10 ఫోర్లతో 64 పరుగులు చేసి ఔటైనప్పటకీ ఆసీస్ విజయం అప్పటికే ఖాయమైపోయింది. దీంతో కంగారూలు 17.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించారు. ఆసీస్ జట్టు టీ20 ప్రపంచకప్ గెలవడం ఇది ఏడోసారి. గతంలో ఆసీస్ 2010, 2012, 2014లో వరుసగా మూడుసార్లు, 2018, 2020, 2023లో మరోసారి హ్యాట్రిక్ కొట్టింది. ఇప్పుడు ఏడోసారి పొట్టి క్రికెట్ లో విశ్వవిజేతగా నిలిచింది.

Mojtaba : కొనసాగుతున్న ఖమేనీ అంత్యక్రియలు..మరి సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీ ఎక్కడ ?

Exit mobile version